Author: Editor's Desk, Tattva News

మునుగోడు కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, శాసనసభ్యత్వానికి సహితం రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నిక అంటూ జరిగితే తెలంగాణ  రాజకీయ గమనాన్ని మార్చే విధంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలను కృతనిశ్చయంతో ఉన్న బిజెపి ఇప్పటికే ఆ దిశలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉండగా, ఈ ఉప ఎన్నిక అవకాశం రావడంతో మరింత ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నది. పైగా ఈ ప్రాంతంలో బలమైన నేపధ్యం గల రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరడంతో, బిజెపిని ఎదుర్కోవడం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ పోరాటంగా మారనున్నది.  మనుగోడు ఉప ఎన్నిక ఫలితం మీదే తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అది గెలవకపోతే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం కాగలదని ఆందోళనలు రెండు పార్టీలను వెంటాడుతున్నాయి.  దానితో ఈ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించి, తెలంగాణాలో రాబోయే ప్రభుత్వం తమదే అన్న సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయడం కోసం బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.…

Read More

ఆరు, ఏడు నెలల తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైతే పొరపాట్లు చేశారో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. జనగాంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సోమవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ దాడిని మంత్రి సమర్ధించుకోవడం ఘోరమని ధ్వజమెత్తారు. బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయని, అందుకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని దాడులు చేసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు గ్రామ గ్రామాన పాతరేస్తారని హెచ్చరించారు. ఆరు నెలల్లో తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గానీ, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని గాని ఎవరు రక్షించలేరని స్పష్టం చేశారురు. ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ పరిధిలో ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా ప్రజలు టీఆర్ఎస్‌ని ఓడిస్తారని తేల్చి…

Read More

ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 2024 ఎన్నికల లోగా పశ్చిమ బెంగాల్ లో బిజెపికి సారధ్యం వహించనున్నారా? స్వతంత్ర దినోత్సవంకు రెండు రోజుల ముందు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలవడంతో ఈ విషయమై మరోసారి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బిజెపి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా, ప్రజాదరణతో ఆమెతో పోటీ పడగల నాయకత్వం లేక పోవడంతో వెనుకంజ వేస్తున్నది.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గంగూలీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపి ఉత్సాహ పడింది. అయితే ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో కార్యరూపం దాల్చలేదు. ఆయన తరచూ బిజెపి కేంద్ర నాయకులను కలుస్తూ ఉండడంతో అయన బీజేపీలో చేరబోతున్నట్లు ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన అటువంటి వార్తలను తోసిపుచ్చుతూ వస్తున్నారు.  ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నారు. దానికి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శి కావడంతో ఆయనకు అమిత్ షా కుటుంబంతో…

Read More

వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్‌ అహ్మెద్‌ సర్కిల్‌లో వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్‌ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్‌ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వీరసావర్కర్ ఫోటోను తొలగించిన ఇద్దరిని అరెస్టు చేశారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వర్గీయులు నిరసన చేపట్టారు. పోలీసు బలగం అక్కడికి తరలింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్‌కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్…

Read More

త్వరలోనే జియో కంపెనీ 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనులపై కంపెనీ దష్టి సారించినట్లు, దసరా లేదా ఈ ఏడాది చివరినాటికి జియో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది విడుదల చేసిన జియో ఫోన్‌ నెక్ట్స్‌ రూ.5 వేలకే ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఉండటంతో యూజర్లు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. త్వరలోనే వచ్చే 5జీ ఫోన్‌లో ఫీచర్లు, దాని ధరపై ఇప్పుడు చర్చ మొదలైంది. జియో 5జీ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.డిస్‌ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది.5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో తీసుకొస్తున్నారట.డ్యూయల్‌ సిమ్‌, మెమొరీ కార్డు…

Read More

కరోనాను అడ్డుకునే నాసల్‌ వ్యాక్సిన్‌ ‘బీబీవీ154’ మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఇది పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వెల్లడించింది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించినందుకు గర్వపడుతున్నామని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా ట్విటర్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. …

Read More

76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఐదు ప్రతిజ్ఞలు చేశారు. ‘ రాబోయే సంవత్సరాల్లో మనం ‘పంచ ప్రణ్’పై దృష్టి పెట్టాలి. మొదటిది : అభివృద్ధి..భారత్‌ పెద్ద సంకల్పాలు, సంకల్పాలతో ముందుకు సాగడం, రెండవది : దాస్యం యొక్క అన్ని జాడలను తుడివేయడం, మూడవది : మన వారసత్వం గురించి గర్వపడటం, నాల్గవది : ఐక్యత బలం, ఐదవది : ప్రధాని, ముఖ్యమంత్రులతో కూడిన పౌరుల విధులు నిర్వర్తిచడం’ చేయాలని పేర్కొన్నారు.  న్యూఢిల్లీలోని ఎర్రకోటపై సోమవారం ప్రధాని మోదీ జాతీయ పతాకంను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో ప్రతి భాష గురించి గర్వపడాలని పేర్కొన్నారు. మనకు భాష తెలిసినా, తెలియకపోయినా, మన పూర్వీకులు దాన్ని అందించినందుకు మనం గర్వపడాలని చెప్పారు. పలు నగరాల్లో డిజిటల్‌ ఇండియా చొరవను ఈ సందర్భంగా ప్రశంసించారు. దేశంలో స్టార్టప్‌లు పెరుగుతున్నాయని చెబుతూ వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి అంకితమివ్వాలని…

Read More

‘‘2047 నాటికి భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకునే లక్ష్యంతో ముందుకు కదలాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.   దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  రాష్ట్రపతి ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగీస్తూ దేశభక్తితో భారత  స్వాతంత్య్రం కోసం పోరాడిన సమర యోధులను స్మరించుకునే సందర్భాన్ని కల్పించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.  వచ్చే 25 ఏళ్లు అమృతకాలమని తెలుపుతూ ఈ వ్యవధిలో దేశం అభివృద్ధి మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరువలేమని, వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె ఉద్బోధించారు. ‘‘కరోనాను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. దేశంలోనే వ్యాక్సిన్ల అభివృద్ధి సైతం జరిగింది. కరోనాపై యుద్ధంలో భారత్ సాధించిన విజయంలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైంది. ఇతర దేశాలకూ కరోనా వ్యాక్సిన్లను అందించే స్థాయికి భారత్ ఎదగడం…

Read More

బిజెపి సహాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు వారాల తర్వాత, ఏక్‌నాథ్ షిండే తన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలలను అప్పగించారు.18 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా మంగళవారం తన మంత్రివర్గాన్ని విస్తరించిన షిండే పట్టణాభివృద్ధి శాఖను తన వద్దే ఉంచుకున్నారు. షిండే రవాణా, పర్యావరణం, మైనారిటీ, విపత్తు నిర్వహణ శాఖలను కూడా తన వద్దే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వెలువడిన ఒక ప్రకటన ప్రకారం, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రణాళిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తారని తెలిసింది. బిజెపి మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. బిజెపి మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌కు అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖలను కేటాయించారు. ఆయన గతంలో కూడా అటవీ శాఖను నిర్వహించారు. రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నత, సాంకేతిక విద్యా శాఖకు కొత్త మంత్రిగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాలను కూడా…

Read More

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై న్యూయార్క్ లో జరిగిన దాడి అంతర్జాతీయంగా కలకం సృష్టిస్తున్న సమయంలో బ్రిటిష్‌ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌ (57)కు చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడిని ఖండిస్తూ హ్యారీ పోటర్‌ రచయిత రౌలింగ్‌ ట్వీట్‌ చేయగా.. ఆమెకు ఈ బెదిరింపు వచ్చింది.  పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్‌ ఉగ్రవాది ట్విట్టర్‌ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు.  దీనిపై కరాచీకి చెందిన మీర్‌ ఆసిఫ్‌ అజీజ్‌ అనే వ్యక్తి స్పందిస్తూ  ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్‌ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.  సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్‌ అజీజ్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌…

Read More