అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేయనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్కు సంబంధించిన నమూనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. అంతేకాకుండా.. అండమాన్లోని 21 దీవులకు వీర సైనికుల పేర్లు పెట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జన్మదినం సందర్భంగా పోర్ట్ బ్లెయిర్లో నిర్వహించిన ఓ ఈవెంట్లో వర్చువల్గా పాల్గొంటూ ప్రధాని 21 దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతుల పేర్లు పెట్టారు. వీర సైనికులకు గౌరవం, గుర్తింపు దక్కాలని ప్రధాని మోదీ చేస్తున్న కృషిలో భాగంగానే ఈ నామకరణ వేడుక జరిగింది. “ఈ రోజు అండమాన్ ప్రజల ముందు నేను ప్రసంగిస్తుండటం చాలా గర్వంగా ఉంది. 1943లో ఇదే అండమాన్ దీవుల నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్.. తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడే. ఈరోజు నేతాజీ జన్మదినం. దేశం ఈరోజును పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటోంది. వలస…
Author: Editor's Desk, Tattva News
బాక్సర్ మేరీకోమ్కు కేంద్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో..ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్రం కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీకి మేరీకోమ్ అధ్యక్షురాలిగా ఎంపికైంది. దీంతో పాటు, మేరీకోమ్ రెజ్లింగ్ రోజువారీ వ్యవహరాలను కూడా చూసుకోనుంది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర క్రీడాశాఖ నియమించింది. ఈ కమిటీలో మేరీ కోమ్తోపాటు ఒలింపిక్ మెడల్ విజేత యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ మాజీ సీఈఓ రాజగోపాలన్ మిగిలిన సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్తో పాటు, ఇతర కోచ్లను విచారించనుంది. బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ వినేష్ ఫోగాట్తోపాటు పలువురు రెజ్లర్లు…
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశానని.. తనని బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లుగా చెప్పారు. మహారాష్ట్ర కు గవర్నర్‌గా సేవలందించడం గౌరవంగా భావిస్తున్నట్లు భగత్ సింగ్ కోశ్యారీ తెలిపారు. గవర్నర్ గా తనపై రాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇటీవల ముంబై పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని మోడీతో పంచుకున్నట్లు చెప్పారు. అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకున్నట్లు వివరించానని వెల్లడించారు. తన మిగిలిన జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం వంటి వాటితో గడపాలనుకుంటున్నాని తెలిపారు. ప్రధాని మోదీకి తనంటే ఎంతో అభిమానమని.. తన నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారనుకుంటున్నట్లు కోశ్యారీ చెప్పారు. విద్యాసాగర్ రావు తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన భగత్ సింగ్ కోశ్యారీ..అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచిపెట్టి…
మహిళల, పురుషుల టీ20 జట్లను ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. మహిళా జట్టులో భారత జట్టు నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. స్మృతి మంధాన, రీచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్‌లు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా నుంచి తహ్లియా మెక్‌గ్రాత్, అష్ గార్డ్‌నర్, బేథ్ మూనేలు సెలక్ట్ అయ్యారు. నిడా దార్ (పాకిస్థాన్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇనోక రణవీర (శ్రీలంక) కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. ఈ టీమ్‌కు న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డెవినేను కెప్టెన్‌గా, రీచా ఘోష్‌ను వికెట్ కీపర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా, పురుషుల టీ20 జట్టులో భారత జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు…
పరాక్రమ్ దివస్ (నేతాజీ జయంతి) సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని మోడీ గుర్తు చేసుకుంటున్నాన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా భారతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. నేతాజీ ఎనలేని ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఆయనకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేసిన అసమానమైన కృషిని మోదీ గుర్తు చేసుకుంటున్నాన్నారు. వలస పాలనకు తీవ్రంగా ప్రతిఘటించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. అతని ఆలోచనలకు తాము ప్రభావితమయ్యామని తెలిపారు. ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు. భారతమాత ముద్దు బిడ్డ నేతాజీ…
మార్చి 28, 29 తేదిల్లో జీ-20 సదస్సు నిర్వహణకు విశాఖపట్నం ముస్తాబవుతున్నది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు గ్రేటర్ అధికారులకు సహకరించాలని గ్రేటర్ కమిషనర్ పి. రాజాబాబు కోరారు. ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహించనున్న సదస్సుకు 40 దేశాల నుంచి 200 వరకూ ప్రతినిధులు హాజరవుతారని, వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ నగరాన్ని సుందరీకరించడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, ప్లాంటేషన్, పౌంటైన్ల ఏర్పాటు ప్రత్యేకంగా చేపడుతున్నామని తెలిపారు. సదస్సుకు విచ్చేసే ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాలను సైతం సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కేబీచ్ తో పాటు, రుషికొండ, తొట్లకొండ, శిల్పారామం ప్రాంతాలను సైతం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అయితే జీ-20 సదస్సు కంటే ముందుగా మార్చి2,…
కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన అయినట్టుగా తెలుస్తోంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో సింగర్ మంగ్లీ పాల్గొంది. కార్యక్రమం అయిపోయాక వేదిక నుంచి తిరిగి వెళ్లేప్పుడు కార్యక్రమానికి వచ్చిన కొంతమంది ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవటమే ఈ దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బళ్లారి ఉత్సవం (బళ్లారి ఫెస్టివల్) అట్టహాసంగా మెుదలైంది. రెండు రోజుల ఉత్సవాన్ని మంత్రి శ్రీరాములు ప్రారంభించారు. ఉత్సవంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. శాండిల్ వుడ్ ప్రముఖ యాంకర్ అనుశ్రీ, సంగీత దర్శకుడు అర్జున్ బృందం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రొగ్రామ్ ముగించుకుని వస్తున్న గాయని…
జమ్ములో పేలుళ్ల అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహల్‌గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం పున: ప్రారంభమైంది. ఉదయం ఏడుగంటలకు జమ్ము డివిజన్‌లోని కతువా జిల్లా హీరానగర్ నుండి ప్రారంభమైన యాత్ర నెమ్మదిగా కొనసాగుతోంది. జమ్ముకాశ్మీర్ పార్టీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లాలతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో యాత్రలో పాల్గొన్నారు. శనివారం పేలుళ్లతో యాత్రకు విరామం ప్రకటించారు. ఉదయం 8 గంటలకు యాత్ర సాంబ జిల్లాలోకి చేరుకుంది. రహదారికి ఇరువైపులా వేచి ఉన్న కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు రాహుల్‌కు స్వాగతం పలికారు. సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చక్ నానక్ వద్ద యాత్రకు విరామం ఇవ్వగా, సోమవారం ఉదయం తిరిగి యాత్రను ప్రారంభించారు. అయితే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతా దళాలు జమ్ము – పఠాన్‌కోట్ హైవేను…
కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారుతున్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మొత్తం 13 వేల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన వారంలో 13 వేల మంది మరణించారని, వారిలో 681 మంది శ్వాసవ్యవస్థ వైఫల్యం వల్ల, 11,987 మంది కరోనాతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్‌లు సోకడంవల్ల ప్రాణాలు కోల్పోయారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. కానీ కేవలం కరోనా కారణంగా 13 వేల మంది మృతి చెందారని మాత్రం చెప్పలేదు. అంతకుముందు వారం చేసిన ప్రకటనలో దేశంలో జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసింది మొదలు జనవరి 12…
త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సర్వీసులు అందిస్తున్న వందే భారత్ ట్రైన్‌ను నెల 15 సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మిగతా రైళ్ల కంటే వేగంగా ప్రయాణిస్తూ త్వరగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు ఏసీ, వైఫై సౌకర్యంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ ట్రైన్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రోజూ ఈ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ప్రయాణికుల కోసం త్వరలో మరో మూడు వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఏయే మార్గాల్లో అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారులు కూడా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో విడతలో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక,…