భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రం షార్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో షార్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల క్రితం సీఐఎస్‌ఎఫ్ జవాన్ చింతామణి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డగా అదేరోజు రాత్రి షార్ మొదటి గేటు వద్ద విధులు నిర్వర్తించే సీఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ వికాస్‌సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి మృతదేహాలను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శ్రీహరికోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ వికాస్‌సింగ్ భార్య ప్రియాసింగ్ భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులతో సూళ్లూరుపేటకు చేరుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదుకాని మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత నర్మద గెస్ట్ హౌస్‌లో ప్రియాసింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట…
Author: Editor's Desk, Tattva News
త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్ లకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మార్చి 2న వెల్లడికానున్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న ముగియనుండగా, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 15, మార్చి 22న ముగుస్తుంది. నాగాలాండ్, మేఘాలయలలోఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో ఓటర్ల సంఖ్య 62.8 లక్షలుగా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య – 31.47 లక్షలు. మొదటిసారి ఓటర్ల సంఖ్య 1.76 లక్షలు. మూడు రాష్ట్రాల్లో కలిపి 2.23 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. 17 ఏళ్లు నిండి 18 ఏళ్లు నిండని వారికి ముందస్తుగా నోటీసులు అందజేసే ఏర్పాటు చేశామని, తద్వారా 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు పొంది వారి పేర్లను చేర్చామని ఎన్నికల సంఘం…
2024 ఎన్నికలు తరుముకు వస్తున్నాయని, అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నాయకులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలను ఉద్దేశించి మోదీ మంగళవారం ప్రసంగిస్తూ లోక్ సభ ఎన్నికలకు ఇంకా 400 రోజులు మాత్రమే ఉన్నాయని, నేతలంతా ఓటర్లను కలవాలని దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు దగ్గర కావడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వాల పాలనపై, వారు చేసిన నష్టంపై 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు పెద్దగా అవగాహన ఉండదు. వారికి ఆ అవగాహన కల్పించాలి. బీజేపీ అందిస్తున్న సుపరిపాలన కొనసాగాల్సిన అవసరాన్ని వారికి వివరించాలి’ అని మోదీ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. మైనారిటీలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కావాలని చెబుతూ…
దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి లాభం గడిస్తున్నామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ హిందూ దేవుళ్లను కించపరుస్తుంటే నోరెందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కబ్జా చేసి భూముల రేట్లు పెరిగేలా చేశారని సంజయ్ ఆరోపించారు. ధర్మం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ధార్మిక క్షేత్రాలను వ్యాపారం కోసం అభివృద్ధి చేస్తున్నట్లు నమ్మిస్తే ఆ దేవుడు కూడా క్షమించడని సంజయ్ హెచ్చరించారు. మరోవైపు నిజాం వారసుడి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించడాన్ని సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ సమాజాన్ని రాచి రంపాన పెట్టి, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ నిజాం నవాబు వారసుడు ఎక్కడో టర్కీలో చనిపోతే ఆయన మృతదేహాన్ని…
జిఒ -1పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీల రోడ్ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జిఒ నెంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న జిఒ నెంబరు 1 తీసుకొచ్చిందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘స్వాతంత్య్రోద్యమ సమయంలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలను అడ్డుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది తప్ప.. ఇలాంటి ఉత్తర్వులివ్వలేదు. పోలీసు చట్టం సెక్షన్ 30, 30(ఎ)ని ఆధారంగా చూపుతూ బహిరంగ సమావేశాలను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లోనే సమావేశాలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పోలీసులు పరిశీలించాలని జిఒ…
చైనాలో జనాభా తగ్గుతుండడం భారత్‌కు ఓ మేలుకొలుపు హెచ్చరిక కావాలని నిపుణులు అంటున్నారు. జనాభా నియంత్రణ కోసం ఏదయినా బలవంతపు నిర్ణయం తీసుకుంటే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో గత అరవై ఏళ్లలో తొలిసారి గత ఏడాదిలో జనాభా గణనీయంగా తగ్గినట్లు జాతీయ గణాంకాల బ్యూరో ప్రకటించింది. సుమారు 140 కోట్ల జనాభా కలిగి ఉన్న చైనాలో ప్రస్తుతం జననాల రేటు తగ్గినట్లు అంచనాకు వచ్చారు. 2020 చివరి నాటికి చైనా జనాభా 141.75 కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే జనాభా 8,50,000 తగ్గినట్లు తేల్చారు. గత ఏడాది చైనాలో సుమారు 95 లక్షల మంది జన్మించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక మరణించిన వారి సంఖ్య కోటీ 4 లక్షలున్నట్లు తెలిపింది. మరో వైపు…
పాకిస్థాన్‌కు చెందిన తొయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రకటన వెనుక చైనా సహకారం ఉండటం విశేషం. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను అడ్డుకున్న చైనా తన పట్టును వీడటంతో యూఎన్ అబ్దుల్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. భద్రతామండలి అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఏకాభిప్రాయం ద్వారా అతడిని బ్లాక్‌లిస్టులో చేర్చేందుకు మార్గం సుగమమైంది. యూఎన్ భద్రతామండలి 1267 (దాయెష్) అల్‌ఖైదా ఆంక్షల కమిటీ 68ఏళ్ల మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో మక్కీ ఆస్తులును స్తంభింపచేయడం, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, ఆయుధాలు స్వాధీనం తదితర చర్యలు చేపట్టనున్నారు. పాక్ సన్నిహిత చైనా జూన్ 16, 2022న భారత్, యూఎస్ ప్రతిపాదనకు మోకాలడ్డింది. అనంతరం ఏడు నెలల తర్వాత మక్కీ ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలోకి ఎక్కాడు. లష్కరే…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు జిఎచ్ఎంసితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ల ను ప్రారంభించగా, సిద్ధం అవుతున్నాయి. ఇక ఇవే కాదు అతి త్వరలో స్కై వాక్ కూడా అందుబాటులోకి రాబోతుంది. మెహిదీపట్నంలో నిర్మాణమవుతున్న స్కైవాక్ ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి రానుంది. 11 ఎలివేటర్లతో 390 మీటర్ల పొడవుతో ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.32.97 కోట్లతో ఈ స్కైవాక్ నిర్మిస్తోంది. మొత్తం 390 మీటర్ల పొడవులో మెహిదీపట్నం బస్టాండ్ నుంచి డిఫెన్స్ సరిహద్దు వరకు 50 మీటర్లు, మెహిదీపట్నం నుంచి రైతు బజార్, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ వరకు ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్ 160 మీటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. స్కైవాక్ పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేకి ఆనుకుని నిర్మితమవుతోంది. స్కైవాక్‌లో ఐదు యాక్సెస్ పాయింట్‌లు (హాప్-ఆన్ స్టేషన్‌లు, లేదా ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌లు) ఉన్నాయి. రైతు…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించింది అధిష్టానం. మంగళవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం చేసారు. ఈ నెల 20న నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నడ్డాను కొనసాగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నడ్డా అధ్యక్షతన 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామని పేర్కొంటూ తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయిందని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం బీజేపీకి…
తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా ఓడిపోకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యూహాలు రచించేందుకు రెండ్రోజులు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం తర్వాత పార్టీ నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమమిదే. జాతీయ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పార్టీ ఉపాధ్యక్షులు వసుంధరరాజె, రమణ్‌సింగ్, రాధామోహన్‌సింగ్, సౌదాసింగ్, ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్ (సంస్థాగత వ్యవహారాలు), అరుణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్, తరుణ్ ఛుగ్, సీటీ రవి, రాష్ట్రాల అధ్యక్షుడు, మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. తొలిరోజు సమావేశంలో చర్చించిన వివరాలను కేంద్ర ఆర్థిక…