Author: Editor's Desk, Tattva News

అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్‌లో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే అంగరంగవైభవంగా జరిగింది. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. భారత్‌కు చెందిన పంజాబీ అందగత్తె, మిస్‌ యూనివర్స్‌-2021 హర్నాజ్‌ సంధు.. బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది. మిస్‌ యూనివర్స్-2022 పోటీలు అమెరికా కాలమానం ప్రకారం జనవరి 14న రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం జనవరి 15 ఉదయం 6.30 గంటలకు) ప్రారంభమయ్యాయి. ఈ పోటీల గ్రాండ్‌ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్‌ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్‌ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్‌ వేదిక మీదకు వచ్చింది. ఈ విశ్వసుందరి పోటీల్లో వెనెజులా భామ అమండా దుడామెల్‌ మొదటి రన్నరప్‌గా, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన అండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి…

Read More

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియోలింక్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిదో వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏండు హైస్పీడ్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ఏపీ, తెలంగాణల మధ్య ఇకపై వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుందని మోదీ చెప్పారు. విలువైన సమయాన్ని ఆదా చేయడానికి వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ తోడ్పడుతుందని తెలిపారు. వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను మన దేశంలోనే తయారు చేశామని చెప్పారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ. 3 వేల కోట్లకు పైగా ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో…

Read More

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తియేటా వేత‌న జీవులు, వ్యాపారులు, కార్పోరేట్ సంస్థ‌లు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి `పాన్ కార్డ్ లేదా ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్  తప్పనిసరి. ఇకనుండి ఏ వ్యాపార లావాదేవీ నిర్వ‌హించాల‌న్నా.. అన్ని ర‌కాల వ్యాపారాల గుర్తింపు ప్ర‌క్రియకు పాన్ కార్డ్ తప్ప‌నిస‌రి చేయ‌నున్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌చ్చేనెల ఒక‌టో తేదీన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించ‌నున్న ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇందుకోసం లీగ‌ల్ ఫ్రేమ్‌వ‌ర్క్ ప్ర‌తిపాదిస్తార‌ని స‌మాచారం.  ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ వ్యాపార లావాదేవీలు నిర్వ‌హించే వ్యాపారులు, ఇన్వెస్ట‌ర్లు.. ఆయా ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్స్‌, అధికారులు, శాఖ‌ల నుంచి అప్రూవ‌ల్ పొంద‌డానికి నేష‌న‌ల్ సింగిల్ విండో సిస్ట‌మ్ కింద ఒక‌టి కంటే ఎక్కువ గుర్తింపు ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి వ‌స్తున్న‌ది. ఇక నుంచి ఇన్వెస్ట‌ర్లు, వ్యాపారుల‌కు ఆ బాధ లేకుండా `పాన్ కార్డ్‌` ఒక్క‌టే స‌మ‌ర్పించేలా.. విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. `ఫైనాన్స్ యాక్ట్-2023`లో నిబంధ‌న చేరుస్తార‌ని…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ శనివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో, ఆఫీస్ లో మరోసారి సోదాలు జరిపింది. కాగా గతంలో కూడా మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సిబిఐ ఇదే కేసులో సోదాలు జరిపింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రధాన కార్యాలయంలో తొమ్మిది గంటలపాటు కూడా విచారించారు. ఈ కేసు కేవలం ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, తనను గుజరాత్ ఎన్నికల పాల్గొనకుండా అరెస్ట్ చేసేందుకే అని అంటూ ఆరోపించారు. ఆప్ ను వదిలి బీజేపీలో చేరాలని తనపై సిబిఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని, పార్టీ మారితో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారని సిసోడియా ఆరోపించారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా…

Read More

కరోనా వ్యాక్సిన్లను నిల్వచేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డ్‌చైన్ స్టోరేజీ అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్ మన దేశంలోనే తయారైంది. బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) , బయోటెక్ స్టార్టప్ కంపెనీ మైన్‌వ్యాక్స్ సంయుక్తంగా వార్మ్ ( వెచ్చని) అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఎలుకలపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా ప్రాథమిక అధ్యయనం లోనే సత్ఫలితాలు కనిపించాయి. డెల్టా, ఒమిక్రాన్‌తోపాటు ఇతర కొత్త వేరియంట్లను ప్రతిఘటించే బలమైన యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాను ఎదిరించడంలో రెండున్నర రెట్లు, ఒమిక్రాన్‌ను ప్రతిఘటించడంలో 16.5 రెట్లు ఈ వ్యాక్సిన్ సమర్థత చూపిస్తుందని చెబుతున్నారు. ఈ వార్మ్ వ్యాక్సిన్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు వారాల వరకు, 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో 90 నిమిషాల వరకు నిల్వ చేయవచ్చని ఆస్ట్రేలియా…

Read More

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ  ఇందులో భాగంగా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.  ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పిన ఆయన చెప్పిన ఆయన.. ఈ నెల 20న మరికొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తామని అన్నారు.  ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షా 50వేల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వెల్ నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ హాస్పిటళ్ల స్థానంలో ఇప్పుడు 22కు అందుబాటులోకి వచ్చాయని…

Read More

హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కెలలోని బిర్సాముండా హాకీ స్టేడియంలో జరిగిన పోటీల్లో భారతజట్టు స్పెయిన్‌ను చిత్తుచేయగా.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు వేల్స్‌ను ఓడించింది. గ్రూప్‌-డిలో ఉన్న భారత్‌ తొలి క్వార్టర్‌లోనే ఒక గోల్‌ కొట్టి 1-0 ఆధిక్యతను సంపాదించింది. ఆ గోల్‌ను రోహిదాస్‌ చేశాడు. రెండో గోల్‌ను హార్దిక్‌ సింగ్‌ 26వ ని.లో చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికే భారత్‌ 2-0గోల్స్‌ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్‌కు లభించిన పెనాల్టీ స్టోక్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అద్భుతంగా నిలువరించాడు. మూడో క్వార్టర్‌లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ప్రయోజనం లేకపోయింది. 47వ నిమిషంలో అభిషేక్‌ స్పెయిన్‌ ఆటగాడ్ని ప్రమాదకరంగా నిరోధించడంతో ఫీల్డ్‌ అంపైర్‌ 10నిమిషాలు సస్పెండ్‌ చేసి మైదానం నుంచి బయటకు పంపాడు. ఆ తర్వాత భారత్‌ 10మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ ఆడింది. 53, 57వ ని.లో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్లు…

Read More

ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి, ఇండ్లకు బీటలు రావడానికి అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్టే కారణం అనే ఆరోపణలు తీవ్రంగా తలెత్తుతున్నాయి. ఆ ప్రాజెక్టు కోసం టన్నెల్ తవ్వడం కారణంగానే జోషిమఠ్​లో ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై వాస్తవాలు తేల్చేందుకు 8 సంస్థలతో దర్యాప్తు చేయించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. జోషిమఠ్ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ జోషిమఠ్ పట్టణం కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించడంతో పాటు అక్కడి కొండ ప్రాంతాలు ఎంత భారం మోయగలవన్న దానినీ చెక్ చేయనున్నట్లు తెలిపారు. జోషిమఠ్​లో 700కు పైగా ఇండ్లకు, రెండు హోటళ్లకు బీటలు వచ్చాయని, ఇప్పటివరకూ 99 కుటుంబాలను సురక్షిత స్థలాలకు తరలించామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ. 1.5 లక్షలు అందిస్తున్నామని, వారికి పునరావాసం కోసం…

Read More

రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులపై ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖా మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఉగ్రదాడులపై జమ్మూ అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ ‘రాజౌరీ ఉగ్రదాడుల్లో చనిపోయిన ఏడుగురి మృతుల కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడాను. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ధైర్యం దేశానికే ఉదాహరణగా నిలుస్తుంది’ అని తెలిపారు.రాబోయే రోజుల్లో అత్యంత సురక్షితమైన గ్రిడ్‌ను రూపొందించేందుకు జమ్మూకాశ్మీర్‌లోని బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌డిఎఫ్‌, ఆర్మీ వంటి ఏజెన్సీలతోనూ చర్చించామని చెప్పారు. ఇందులో భాగస్వామ్యయ్యేందుకు అన్ని ఏజెన్సీలు, పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాజౌరీలో జరిగిన ఘటనలపైనే కాకుండా.. గత ఏడాదిన్నర కాలంలో జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. జనవరి 1-2 తేదీల్లో జరిగిన దాడులపై ఎన్‌ఐఎ బృందం, పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తారని అమిత్‌షా తెలిపారు.కాగా,…

Read More

నేరాలను అదుపు చేసేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీస్ యంత్రాంగాన్ని నిర్వహించి ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలోనే దొంగతనం జరగడం విస్మయం కలిగిస్తోంది. రాజేంద్రనగర్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపిఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో కంప్యూటర్లు మాయం అయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను కేటుగాడు మాయం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపిఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించడం కలకలం రేపుతోంది. కంప్యూటర్లు చోరీకి గురవ్వడంతో అధికారులు సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సిసిటివి ఫుటేజ్‌లో దొంగతనం దృశ్యాలు రికార్టు అయ్యాయి. అకాడమీలో ఐటి సెక్షన్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి కంప్యూటర్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్‌పిఎ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

Read More