Author: Editor's Desk, Tattva News

తెలంగాణాలో మెడికల్‌ షాపులు పెద్ద సంఖ్యలో వస్తున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంతో నాణ్యత లోపించిన, నకిలీ మందుల విక్రయం విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు అధికంగా గ్రామీణ ప్రాంతాలలో కనీస నిబంధనలు పట్టించుకోవడంతో మెడికల్‌ షాపుల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నది. నిబంధనల ప్రకారం మెడికల్‌ షాపును నిర్వహించాలంటే సంబంధిత షాపు యజమాని బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పట్టభద్రుడై ఉండాలి. ఫార్మసిస్టుల ద్వారానే మందుల విక్రయం జరగాలి. షాపులో పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రిజ్‌, గ్లాసుతో కూడిన ర్యాకులో మందులు ఉంచాలి. రిజిస్టర్‌, బిల్‌ బుక్‌, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తీసేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ ఇచ్చే శాంపిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదనే నిబంధనలు ఉన్నాయి. మందులు తయారీ గడువు ముగియడానికి ముందు వాటిని ఆరు నెలల ముందుగానే ప్రత్యేకంగా విడిగా ఉంచాలి.…

Read More

తెలంగాణ‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేటాయింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసన సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. సోమేశ్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కేంద్రం 2017లో హైకోర్ట్ కు వెళ్లింది. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నందాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేష్‌ కుమార్‌ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం…

Read More

అధికారం కోసం బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించి, విధ్వంసంకు దిగడం కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లో జరిగిన అల్లర్లను ప్రపంచ నేతలు ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ అల్లర్లపై స్పందిస్తూ బ్రెజిల్‌లోని ప్రభుత్వ భవనాలవిధ్వంసం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ అల్లర్లను ఖండించారు. ‘శాంతియుత అధికార మార్పిడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. బ్రెజిల్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు మా మద్దతు ఉంటుంది.ఆ దేశ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కకూడదు. నేను భవిష్యత్తులో లూలాతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టాను’ అని బైడెన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ కూడా ఈ…

Read More

“ప్రపంచ సంక్షేమం కోసం విశ్వవిజ్ఞాన శాస్త్రం” పేరిట రూపొందించిన ఈ సంవత్సరపు “జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం-నేషనల్ సైన్స్ డే” ఇతివృత్తాన్ని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేసారు. నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవ ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు. కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, దేశం 2023లోకి ప్రవేశిస్తున్నందున ప్రస్తుత తరణంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో పెరుగుతున్న భారతదేశం పాత్రను, అంతర్జాతీయ రంగంలో నిర్వహించవలసిన భూమికను సైన్స్ దినోత్సవ ఇతివృత్తం తెలియజేస్తున్నదని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవ ఇతివృత్తం, అధ్యయన అంశానికి, కార్యక్రమాలకు సంబంధించి గట్టి మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రపంచ సంక్షేమం కోసం విశ్వ విజ్ఞానశాస్త్రం” అనే ఇతివృత్తం, జి-20 దేశాల అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టడానికి అనుగుణంగా ఉండటం అభినందనీయమని, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు, ప్రపంచంలోని దక్షిణాది వర్ధమాన దేశాల వాణికి…

Read More

భక్తులకు బూజుపట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు ఇచ్చారంటూ ఆందోళన చేయడంతో పోలీసులు సోమవారం పోటు (ప్రసాదాల తయారీ కేంద్రం)ను సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాన్ని దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు. దేవాలయ ఈవో సెలవులో ఉన్నప్పుడు, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకుండా రావడమేంటని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ) నాగరాజుతో వాగ్వాదానికి దిగారు. లడ్డూల నాణ్యత పరిశీలనకు సహకరిస్తామని, పోటును సీజ్‌ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేవస్థానం చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారి అని సిబ్బంది పేర్కొన్నారు. ఓ దశలో సీఐ అప్పటికప్పుడు నోటీసును సిద్ధం చేసి, ఇచ్చేందుకు యత్నించారు. దాంతో టీఎన్‌జీవో నాయకులు రంగప్రవేశం చేసి సీఐ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేశారా? ప్రసాదాల్లో నాణ్యత లేదని నివేదిక ఇచ్చారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాథమిక…

Read More

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే ఆయా నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, కంపా నిధులు సహా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివ్రుద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా,  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్  తెలంగాణను ఏ విధంగా అభివ్రుద్ధి చేస్తారని ప్రశ్నించారు.  ఈ విషయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే పదేపదే కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదనే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయిరు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే…

Read More

ఇప్పటి వరకు ఓటిపి, డెబిట్, క్రెడిట్ కార్డుల ఎక్స్‌పైరీ, లోన్లు పేరుతో మోసం చేసిన సైబర్ క్రైం నేరస్థులు ఇప్పుడు ఉచిత వైఫై పేరుతో కొత్త రకం దోపిడికి ప్లాన్ వేస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు. చాలామంది ఈ ప్రాంతాలకు వస్తుండడంతో వారికి ఉచిత వైఫైని ఎరగా వేసి దోచుకుంటున్నారు. ఉచిత వైఫై పేరుతో అమాయకులకు సైబర్ నేరస్థులు గాలం వేస్తుండటం వెలుగులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో ఓ యువకుడు నగరంలోని ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లాడు. తన మొబైల్‌లో డాటా తక్కువగా ఉండడంతో ఎవరిదైనా వైఫ్ ఉంటుందని భావించాడు. వైఫైని ఆన్ చేయగా ఓ షాపింగ్ మాల్ పేరుతో ఉచిత వైఫై పేరు రావడంతో మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నాడు. బాధితుడు కనెక్ట్ కాగానే అతడి బ్యాంక్ ఖాతా నుంచి ముందుగా రూ.6,000 ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఇలా కొద్ది నిమిషాల్లో యువకుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.50,000 మాయం…

Read More

మ‌త‌మార్పిడి ఓ సిరీయ‌స్ అంశ‌మ‌ని, దానికి రాజ‌కీయ రంగు పూయ‌రాదు అని ఇవాళ‌ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. మ‌త మార్పిడులను అరిక‌ట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేయాల‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ ఆర్ వెంక‌ట‌ర‌మ‌ణిని సుప్రీంకోర్టు కోరింది. జ‌స్టిస్ ఎంఆర్ షా, సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. బెదిరింపులు, మోసం, గిఫ్ట్‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం లాంటి చ‌ర్య‌ల‌తో మ‌త‌మార్పుడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వేసిన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీం విచార‌ణ చేప‌ట్టింది. ఈ అంశంలో కోర్టుకు స‌హ‌క‌రించాల‌ని అటార్నీ జ‌న‌ర‌ల్‌ను సుప్రీం కోరింది. డ‌బ్బు, ఇత‌ర ఆక‌ర్ష‌ణ‌ల‌తో మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డుతున్న అంశాల్లో ఏం చేయాల‌న్న దానిపై స‌రైన సూచ‌న‌లు చేయాల‌ని బెంచ్ తెలిపింది. భ‌యం, మోసం, ఆక‌ర్ష‌ణ‌తో మ‌త‌విశ్వాసాల్ని మార్చివేస్తే అప్పుడు విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉత్ప‌న్నం అవుతాయ‌ని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. బ‌ల‌వంత‌పు మార్పుడ‌ల వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ సీరియ‌స్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు…

Read More

త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ ర‌వి వాకౌట్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో డీఎంకే స‌భ్య‌లు సోమవారం స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాల‌ని, గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో కొత్త‌గా జోడించిన అంశాల‌ను తీసివేయాల‌ని సీఎం స్టాలిన్ స్పీక‌ర్‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ ఒరిజిన‌ల్ స్పీచ్‌గా రికార్డు చేయాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు. తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. ఈ ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేస్తుంది. దీంతో మ‌ళ్లీ స్టాలిన్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వైరం కొత్త స్థాయికి చేరిన‌ట్లు…

Read More

శీతల గాలులతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో  రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు చలి మరోవైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గడ్డ కట్టేంత ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు.  ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలకు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం తెలిపింది.  చలికి తోడు పొగమంచు అధికం కావడంతో వాతావరణ శాఖ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్‌లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలుగా నమోదు కాగా, లోధి రోడ్‌లో 2.8 డిగ్రీల సెల్సియస్‌ , పాలంలో 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండి వెల్లడించింది. విజిబిలిటీ తగ్గినట్లు అధికారులు తెలిపారు. చలి, పొగమంచు దెబ్బకు ఆప్ ప్రభుత్వం ఏకంగా విద్యాసంస్థలకు సెలవులు…

Read More