Author: Editor's Desk, Tattva News

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలను, నలుగురు వ్యక్తులను ఉగ్రవాద జాబితాలో చేరుస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ సంస్థల, వ్యక్తుల పేర్లను గత నాలుగు రోజులుగా వేర్వేరు ప్రకటనల్లో ఎంహెచ్‌ఎ పేర్కొంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పాకిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టిఆర్‌ఎఫ్‌), పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ (పిఎఎఫ్‌ఎఫ్‌)లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదులుగా పేర్కొన్న వారిలో టిఆర్‌ఎఫ్‌కు చెందిన షేక్‌ సజ్జాద్‌ గుల్‌, లష్కరే తోయిబా కమాండర్‌ మహ్మద్‌ అమిన్‌ కుబాబ్‌, అదే సంస్థకు చెందిన అర్బాజ్‌ అహ్మద్‌ మిర్‌, కాశ్మీరీ యువతను రెచ్చగొడుతున్న అసిఫ్‌ మక్బూల్‌ దర్‌ ఉన్నారు. వీరిలో అర్బాజ్‌ అహ్మద్‌ మిర్‌ కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తున్నట్లు ఎంహెచ్‌ఎ పేర్కొంది. కొన్ని నెలల క్రితం కుల్గాంలో టీచర్‌ రజిని బాల హత్య…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన వచ్చే తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది. ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-వైష్ణో దేవి కత్రా, న్యూఢిల్లీ-చండీగఢ్‌-ఉనా, ముంబై-అహ్మదాబాద్‌-గాంధీనగర్, చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ అత్యాధునిక రైలు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడవబోయేది 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్‌లో హౌరా-న్యూ జల్‌పాయ్‌గురి రూట్‌లో డిసెంబర్ 30న ఏడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆరంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెనక్కి వాలే సీట్లుంటాయి. ఇక ఎగ్జిక్యూటివ్ బోగీలో 180 డిగ్రీల మేరకు రొటేట్ అయ్యే సీట్లుంటాయి. వీటికి తోడు ఆటోమేటిక్ తలుపులు, జిపిఎస్ ఆధారిత ఆడియో-విజువల ప్యాసెంజర్ ఇన్‌ఫార్మేషన్ సిస్టం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్…

Read More

గతేడాది ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర దక్షిణాది సినిమాల ఆధిపత్యం కొనసాగింది. దక్షిణాది సినిమాల దెబ్బకు బాలీవుడ్‌ ఇండస్ట్రీ అంతా షాక్‌ అయింది. దక్షిణాది నుండి సినిమా వస్తుందంటే బాలీవుడ్‌ సినిమాలు కనీసం రెండు, మూడు వారాలు గ్యాప్‌ తీసుకుని రిలీజ్‌ అయ్యేంత వరకు వెళ్ళింది. దానితో హిందీ పరిశ్రమలో ఇప్పుడు అదే సౌత్‌ సినిమాలకు నీరాజనం పలుకుతుంది. గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మొదలుకొని, ‘కేజీఎఫ్‌’, ‘కార్తికేయ’, ‘కాంతార’ వంటి పలు సౌత్‌ సినిమాలు హిందీ సినిమాలతో పోటీ పడి మరీ అక్కడ విజయం సాధించాయి. నిజానికి పుష్ప సినిమా నుండే హిందీలో సౌత్‌ సినిమాల హవా కొనసాగింది. కాగా తాజాగా దక్షిణాది సినిమాలు ఉత్తరాది టెలివిజన్‌లో కూడా సత్తా చాటుతున్నాయి. తాజాగా విడుదలైన టాప్‌ టీవీ ప్రీమియర్‌ రేటింగ్స్‌లలో దక్షిణాది డబ్బింగ్‌ సినిమాల హవా కొనసాగింది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ జాబితా టాప్‌-5లో మొదటి మూడు స్థానాలు దక్షిణాది సినిమాలే ఆక్రమించాయి. మొదటి స్థానంలో…

Read More

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ (88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అదివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా డిసెంబర్‌లో స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆహారం తీసుకోవడం తగ్గించేశారు. మూత్ర విసర్జన కూడా తగ్గిపోవడంతో బలహీనపడ్డారు. తర్వాత ఆయనను ఐసియూకి తరలించారు. ఓ వారం రోజులుగా ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత త్రిపాఠీని ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. కేసరి నాథ్ త్రిపాఠీకి రెండు సార్లు కొవిడ్ వైరస్ సోకింది. కానీ ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆయన 1934 నవంబర్ 10న అలహాబాద్‌లో జన్మించారు. ఆయన బీహార్, మేఘాలయ, మిజోరంలకు గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు వహించారు. త్రిపాఠి ఆరు పర్యాయాలు…

Read More

ఏపీలో అరాచక పాలన జరుగుతుందని, బ్రిటిష్ కాలం నాటి జీవో ఎపిలో తెచ్చారని, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. ఇటీవల కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి వెళ్లి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రెండు గంటలసేపు జరిపిన భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘కుప్పంలో జరిగిన సంఘటనపై చంద్రబాబును కలిశాను. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులను వైసీపీ కాలరాస్తోంది’ అని విమర్శించారు.  “పెన్షన్లు తీసేయడం, రైతు సమస్యలపై చర్చించాం. వైసీపీకి బాధ్యతలు గుర్తు చేయాలి. బ్రిటీష్‌ కాలంనాటి జీవో తెచ్చారు. వీటికి బ్రేక్‌ పడాలి. వైజాగ్‌లో…

Read More

నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించి శ్రీలంకపై ఘనవిజయం సాధించి టీ20 సిరీస్ శైవసం చేసుకుంది. శ్రీలంకకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, లంక జట్టును 137 పరుగులకు ఆలౌట్ చేసింది. 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అద్భుత శతకంతో కదంతొక్కిన సూర్యకుమార్ యాదవ్ (112 రన్స్, 51 బంతుల్లో, 9 సిక్స్‌లు, 7 ఫోర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. ‘360 డిగ్రీస్‌ ప్లేయర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్‌ రాజ్‌కోట్‌లో మరోమారు తన బ్యాట్‌ పవర్‌ చూపాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా తన అమ్ములపొదిలోని అన్ని అస్ర్తాలను సమర్ధవంతంగా వినియోగించుకున్న సూర్య.. తన చిన్న కెరీర్‌లోనే టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేసుకున్నాడు.  మైదానం నలువైపులా బంతిని…

Read More

నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనరెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సభల్లో తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, బాధ్యులను గుర్తించాలని సూచించింది. ఏర్పాట్లలో లోపాలు గుర్తించాలని కమిషన్‌ను కోరింది. ఒకవేళ అనుమతుల ఉల్లంఘన జరిగితే దానికి కారణమైన వారిని గుర్తించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని, ఆయా ఘటనలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కందుకూరు, గుంటూరు ఉదంతాలు- రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధానికి దారి తీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు ఈ రెండు పార్టీల నాయకులు. వైఎస్ఆర్సీపీ సహా రాజకీయ పార్టీలన్నీ నిర్వహించబోయే రోడ్లు, బహిరంగ సభలను నిషేధించింది. గ్రౌండ్స్…

Read More

ఆందోళనకు దిగిన మరో ఇద్దరు వ్యక్తులను ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ న్యూస్‌ ఏజెన్సీ మిజాన్‌ వెల్లడించింది. మృతులు మహమ్ద్‌ మహదీ కరామి, సయ్యద్‌ మొహమ్మద్‌ హోస్సేనీలను శనివారం ఉదయం ఉరితీసినట్లు మీజాన్‌ తెలిపింది. ఈ ఇద్దరితో కలిసి ఇప్పటివరకు మొత్తం 14 మందికి ఉరిశిక్షను అమలు చేశారు. వీరిద్దరూ పారామిలటరీ దళం సైనికుడిని హత్య గావించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిపై వచ్చిన ఆరోపణలను విచారించిన కోర్టు వీరిద్దరికీ డిసెంబర్‌ నెలలో మరణశిక్ష విధించింది. ఈ శిక్షలను సుప్రీంకోర్టు జనవరి 3 న సమర్ధించింది. గత ఏడాది నవంబర్ 3న హిజాబ్ వ్యతిరేక నిరసన సమయంలో హత్యకు గురైన హదీత్ నజాఫీ నివాళిగా ఒక గ్రూప్‌ కరాజ్‌లో సమావేశమైంది. ఈ గుంపులోని వ్యక్తులు రుహుల్లా అజామియన్‌ అనే సైనికుడిని దుస్తులు విప్పించి హింసించి చంపారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో…

Read More

నెటిజన్ల వ్యక్తిగత సమాచార గోప్యతలో ఇప్పుడు ట్విట్టర్ సురక్షితం కాదని స్పష్టం అయింది. కొంతకాలం క్రితం హ్యాకింగ్‌కు గురయిన 23.5 కోట్ల మంది ట్విట్టర్ ఖాతాదార్ల వ్యక్తి గత సమాచారం అంతా తస్కరణకు గురి అవుతోంది. ఇది హాకర్ల బారిన పడుతుంది, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటర్నెట్ భద్రతా నిపుణులు అలన్ గాల్ తెలిపారు. కోట్లాది మంది ఇ మొయిల్స్ వాటిలోని సమాచారం గోప్యత లేకుండా పోతుందని హెచ్చరించారు. ట్విట్టర్ లీక్‌ల తరువాత కూడా ఎవరైనా ఏ విధమైన స్పందనలకు దిగినా , రహస్యంగా ప్రభుత్వాల దమననీతిని ఖండించే భావవ్యక్తీకరణలకు దిగినా అటువంటి వారి ఉనికి వెలుగులోకి వస్తుంది. వారు ఎవ్వరు వారి పూర్వాపరాలు ఏమిటనేది తెలుసుకునేందుకు వీలేర్పడుతుందని ఈ నిపుణులు తెలిపారు. ట్విట్టర్ లీక్‌కు గురి కావడంతో ఇక ట్విట్టర్ అకౌంట్స్ మరింతగా దెబ్బతింటాయి. ఇ మొయిళ్లు దాదాపుగా ఛేదనకు గురి కావడంతో దీనిని వాడుకుని హ్యాకర్లు కొందరిని ఎంచుకుని…

Read More

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక అవార్డు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాల్లో తీసుకొచ్చిన డిజిటల్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేయగా, విజేతలకు శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రదానం చేశారు.  మొత్తం 7 కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేయగా, ప్రతి కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన వారికి ప్లాటినం, 2వ స్థానంలో నిలిచిన వారికి గోల్డ్, 3వ స్థానంలో నిలిచిన వారికి సిల్వర్ అవార్డులను అందజేశారు. ఇందులో ‘డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్’ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచి గోల్డ్ అవార్డు అందుకుంది.  స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సాయిల్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం ఈ అవార్డుకు ఎంపికైంది.  డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వ ఈ-నామ్ వ్యవస్థ ప్లాటినం అవార్డు అందుకోగా,…

Read More