అయ్యప్పస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్పస్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప మాలాధారులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్‌పై సులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అరెస్ట్ చేశారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్పస్వాములు ఆందోళణలు చేస్తుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు…
Author: Editor's Desk, Tattva News
కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బిజెపి ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ వెల్లడించారు. ఏప్రిల్‌లో అమిత్ షాలేదా, జేపీ నడ్టాతో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో దానిని విడుదల చేస్తామని తెలిపారు. 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని ఆయన చెప్పారు. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని పేర్కొంటూ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో గెలవని 160 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. హైదరాబాద్…
మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లు 2022ని ఆమోదించింది. ఇక దీంతో ముఖ్యమంత్రి, మంత్రి మండలిలోని వారంతా ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ కిందికి వస్తారు. ఈ బిల్లును ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదించారు. కాగా ప్రతిపక్షాలు టీచర్స్ ఎంట్రెన్స్ టెస్ట్ కుంభకోణంపై వాకౌట్ చేశాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును చారిత్రాత్మక శాసనంగా శ్లాఘించారు. క్యాబినెట్ మంత్రి దీపక్ కేసర్కర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ యాంటీ కరప్షన్ అంబుడ్స్‌మన్ పరిధిలోకి ఇక ముఖ్యమంత్రి, క్యాబినెట్ వస్తారు. ఈ బిల్లు ప్రకారం ముఖ్యమంత్రిపై ఏదేని విచారణ జరిపేందుకు లోకాయుక్త ముందు అసెంబ్లీ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. దీని ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండువంతుల మంది శాసన సభ్యులు దీనికి ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రిపై లోకాయుక్త ఎలాంటి దర్యాప్తు చేయడానికి వీలులేదు. ఒకవేళ విచారణ చేపట్టినా అది రహస్యంగానే ఉంచాలి. ఒకవేళ ఫిర్యాదును కొట్టివేయాలన్న…
మయన్మార్‌లో నేతగా పదవీచ్యుతురాలైన ఆంగ్‌సాన్ సూకీకి సంబంధించిన ఐదు అవినీతి కేసుల్లో అంతా కలిపి ఏడేళ్ల జైలు శిక్షను మిలిటరీ కోర్టు శుక్రవారం విధించింది. పాత కేసులను తిరగదోడి ఈ పొడగింపు శిక్షను విధించారని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. కోర్టు విచారణ రహస్యంగా జరిగింది. ఈ తీర్పుతో, గతేడాది డిసెంబరు నుండి కనీసం 26 ఏళ్ళ జైలు శిక్షలు విధించారు. గతేడాది డిసెంబరు నుండి గృహ నిర్బంధంలో ఉన్న ఆమెను ఐదు అవినీతి ఆరోపణల్లో దోషిగా నిర్ధారించారు. ప్రచార సమయంలో కరోనా ఆంక్షల ఉల్లంఘన, అక్రమంగా రేడియో పరికరాలను కలిగివుండడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ రహస్య చట్టానిు ఉల్లంఘించడం, దేశ ఎన్నికల కమిషన్‌ను ప్రభావితంచేయడానికి ప్రయతిుంచడం వంటి ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.ఆంగ్‌సాన్ సూకీని 2021 ఫిబ్రవరిలో తిరుగుబాటు జరిగినప్పుడు అరెస్టు చేశారు. మయన్మార్ నాయకురాలుగా ఉన్నప్పుడు ఆమె హెలికాప్టర్‌ను లీజుకు తీసుకున్న కేసులో నేరస్తురాలుగా ఈ శిక్ష విధించారని తెలుస్తోంది. నోబెల్ ప్రైజ్ విజేత అయిన ఆంగ్‌సాన్…
ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ మృతితో ఆయన వర్చువల్‌గా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. హావ్‌డా, న్యూజల్‌పయ్‌గురిని కలిసే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. వంద్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయాను, నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.కోల్ కతాలో జరిగే జాతీయ గంగా మండలి సవేశాన్ి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్సువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడిన…
తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ హెచ్చరించారు. ఈ కేసు నమోదు తర్వాత మొదటిసారి బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విస్తారక్ల సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని తెలిపారు. తాను ఎవరో తెలియకపోయినా తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందని, తెలంగాణలో తన పేరు పాపులర్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి పేరుతో గెలిచి.. ఆ తల్లి రొమ్మును గుద్దారంటూ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ కార్యకర్తలకు సంతోష్ పిలుపునిచ్చారు. ఇక్కడున్న నాయకులు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి శాపమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం…
ప్రధాని నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ (100) శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. తల్లి మరణంతో ప్రధాని మోడి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరారు. మరోవైపు ఈరోజు ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి హీరాబెన్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ” నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు…
120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది.. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలు, మౌళికసదుపాయాలనే రష్యా లక్ష్యం చేసినట్లు అధ్యక్ష సలహాదారు మైఖేల్ పొడోయాక్ తెలిపారు. ఈ దాడిలో కనీసం ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. కీవ్‌లో క్షిపణులు పడినట్లు ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్‌కోవ్ తెలిపారు. ఖార్కీవ్, ఒడిసా, లివివ్, జైటోమిర్ నగరాల్లోనూ భారీ స్థాయిలో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో మిస్సైల్ అటాక్ జరిగినట్లు ఒడిసా ప్రావిన్సు నేత మాక్సిమ్ మార్చెంకో తెలిపారు. వివిధ దిశల నుంచి వైమానిక, నౌకా స్థావరాల మీదుగా క్రూయిజ్ మిస్సైళ్లను రష్యా వదిలినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కమికేజ్ డ్రోన్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. కీవ్ నగరంలో సుమారు 16 క్షిపణులను తిప్పికొట్టారు. అయితే మిస్సైళ్లను ఢీకొట్టడం వల్ల శిథిలాలు ఇండ్లపై పడ్డాయి. …
ఈ నెలాఖరుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన అంజనీ కుమార్‌ను ఇంఛార్జ్ డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరిగేంత వరకు అంజనీ కుమార్ ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీగా నియమితులయ్యారు. అంతకు ముందు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కూడా పని చేశారు. ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలోనూ అంజనీ కుమార్ పని చేశారు. గతంలో కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్‌గా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్‌గా పనిచేశారు. నిజామాబాద్ డీఐజీగా, వరంగల్ ఐజీగా చేశారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గానూ అంజనీ కుమార్ చేశారు. తెలంగాణ లా అండ్…
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఓ చైనా మహిళ హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో బీహార్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే కాలచక్ర మైదానం వెలుపల ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక నేపథ్యంలో బిహార్ పోలీసులు సాంగ్ షియాలోన్ అనే చైనీ మహిళకు సంబంధించి పోలీసులు ఓ ఊహా చిత్రాన్ని , ఆమె పాస్ పోర్ట్, వీసా వివరాలను మీడియాకు విడుదల చేశారు. బీహార్ లోని గయకు సమీపంలో ఉన్న బుద్ధగయలో, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ను దలైలామా గురువారం ఉదయం సందర్శించారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. దలైలామా పర్యటన నేపథ్యంలో మహాబోధి టెంపుల్ కు వస్తున్న భక్తులను పోలీసులు క్షుణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. గయ సీనియర్ ఎస్పీ హర్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ చైనా మహిళకు సంబంధించి గత రెండేళ్లుగా తమకు సమాచారం…