Author: Editor's Desk, Tattva News

నేపాల్ నూతన ప్రధాన మంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’  ఆదివారం నియమితులయ్యారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ రాజ్యాంగంలోని అధికరణ 76 క్లాజ్ 2 ప్రకారం ఆయనను నియమించినట్లు అధ్యక్ష కార్యాయలం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతును స్వీకరించి, ప్రతినిధుల సభలో ఆధిక్యతను సాధించగలిగే సభ్యుడిని ప్రధాన మంత్రి పదవిలో నియమించేందుకు నేపాల్ ప్రెసిడెంట్ ఆహ్వానించవచ్చునని రాజ్యాంగంలోని అధికరణ 76 క్లాజ్ 2 చెప్తోంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల్లోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ అంతకుముందు ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను ప్రచండ ఈ గడువు ముగియక ముందే సమర్పించారు. ప్రెసిడెంట్ కార్యాలయానికి వచ్చిన వారిలో ప్రచండతో పాటు సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ, రాష్ట్రీయ…

Read More

మహారాష్ట్రలో గత శనివారం ఆత్మహత్యకు పాల్పడిన యువ నటి తునిషా శర్మ (20) ‘లవ్ జిహాద్’ బాధితురాలని స్వయంగా ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తునీషా సహనటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ ను ఆదివారం అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టి, నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సహితం `లవ్ జిహాద్’ ఫలితంగా ఆమె మృతి చెందినదని అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ దర్యాప్తులో వాస్తవం వెల్లడి కాగలదని భరోసా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్‌లో టెలివిజన్ ప్రోగ్రామ్ సెట్‌లోనే తునీషా శర్మ చనిపోయి ఉంది. అలీ బాబా: దస్తాన్-ఇ-కాబూల్ అనే టెలివిజన్ సీరియల్లో తునీషా సహనటుడు షీజాన్ మహ్మద్ ఖాన్తో లవ్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక.. తునీషా తల్లి ఫిర్యాదు ఆధారంగా షీజాన్ మహ్మద్ ఖాన్ తునీషా ఆత్మహత్యకు కారణమయ్యాడనే…

Read More

త్వరలో అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న కర్నాటకలో అధికార పార్టీ బీజేపీకి  మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి, కొత్త పార్టీని పెడుతున్న  ప్రకటించారు.  కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ”కర్నాటక రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తా. మా పార్టీ కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఏయే నియోజకవర్గాల్లో పోటీచేస్తుందన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం.” అని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.  తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తాను గంగావతి నియోజకవర్గంలో…

Read More

రాష్ట్ర‌ప‌తి హోదాలో ద్రౌపది మర్ము తొలిసారి తెలంగాణ‌కు సోమవారం రానున్నారు.ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు శీతాకాల విడిదికోసం ఆమె హైద‌రాబాద్ రానున్నారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము 30వ తేదీ వరకు బస చేస్తారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో, సమీప ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను, ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు.  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రాష్ట్రపతి నిలయం పరిసరాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తులు వేసవి కాలంలో సిమ్లాకు, శీతాకాలంలో హైదరాబాద్ పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ లో శీతాకాల విడిదికి రాలేదు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Read More

దేశంలో మహారాష్ట్ర-కర్ణాటక, అసోం-మేఘాలయల మధ్య సరిహద్దు వివాదాలు పరాకాష్టకు చేరుతున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ – కర్ణాటకల మధ్య కూడా అటువంటి వివాదాలు చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశాల మధ్య కొఠియా గ్రామాల సరిహద్దు పంచాయతీ నడుస్తూనే ఉంది. మహారాష్ట్రంలోని కొందరు గ్రామస్తులు తమను తెలంగాణాలో కలపమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఏపీలోని కొన్ని గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ లేవనెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ ఎమ్మెల్యే ఈ సమస్యను ప్రస్తావించడం గమనార్హం. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలోని 40 గ్రామాలను కర్ణాటకలో కలిపి కన్నడ విద్యను ప్రోత్సహించాలని బళ్లారి జిల్లా శిరగుప్ప ఎమ్మెల్యే సోమలింగప్ప శాసనసభలో కోరారు. డిసెంబరు 22న ఎమ్మెల్యే శిరగుప్ప అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌లోని కన్నడ మాధ్యమం పాఠశాల విషయమైన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కన్నడ విద్య, కన్నడ పాఠశాలల స్థితిగతులపై వివరించారు. మూడేళ్ల కిందట 40 గ్రామాల్లో సుమారుగా 12…

Read More

ప్రముఖ నటుడు చలపతి రావు (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో చలపతి రావుకు గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 1966లో ‘గూడచారి’ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆయన దాదాపుగా 600కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. చల్లిపతి రావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రిలో జన్మించారు. రెండు రోజల వ్యవధిలో కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చలపతి రావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడు, నిర్మాతగా ఉన్నాడు. రాష్ట్రపతి గారి అల్లుడు, పెళ్లంటే నూరేళ్ల పంట, జగన్నాటకం, కడప రెడ్డమ్మ, కలియుగ కృష్ణుడు తదితర సినిమాలకు చలపతి రావు నిర్మాతగా వ్యవహరించారు. నటుడు చలపతిరావు హఠాన్మరణం పట్ల జూ.ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి…

Read More

భారత్‌లో ప్రస్తుతమున్నకరోనా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అవసరం లేదని, లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు హైబ్రిడ్‌ ఇమ్యూనిటీని కలిగి ఉండటం వల్ల తీవ్ర కరోనా లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలకు అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేశారు. ‘మొత్తంగా చూసుకుంటే.. కరోనా కేసుల్లో పెరుగుదల లేదు. ప్రస్తుతం మన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ సమయంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్లు విధించాల్సిన అవసరం లేదు’ అని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని అరికట్టడంలో విమానాలను నిషేధించడం అంత ప్రభావవతంగా లేదని గత అనుభవాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఇంకో విషయం ఏంటంటే.. చైనాలో విజఅంభిస్తోన్న బిఎఫ్‌.7ను ఇప్పటికే భారత్‌లో గుర్తించారు. ఇంకోపక్క భారత ప్రజలు హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ (వ్యాక్సినేషన్‌ వైరస్‌ సోకడంతో వచ్చిన నిరోధకత)ని సొంతం చేసుకోవడంతో తీవ్ర వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలు ఉండకపోవచ్చు’ అని…

Read More

దేశంలోని పేద ప్రజలకు సంవత్సరం పాటు ఉచిత రేషన్‌ను అందిస్తారు. ఆహార చట్టం పరిధిలో ఈ మేరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశం తరువాత మంత్రివర్గ కీలక నిర్ణయాలను కేంద్ర ఆహార మంత్రి పియూష్ గోయల్ విలేకరులకు వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ఏడాది పాటు దేశంలోని 81.35 కోట్ల మందికి రేషన్ పంపిణీ పథకంలో భాగంగా ఆహార ధాన్యాలను అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోయల్ తెలిపారు. ఇప్పుడు ఈ పథకం పరిధిలో నిరుపేదలకు కేంద్రం రూ 2 నుంచి 3 కిలో చొప్పున 5 కిలోల ఆహారధాన్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా గోధుమలు, బియ్యం ఇస్తున్నారు. ఇక అంత్యోదయ అన్న యోజన ( ఎఎవై) పరిధిలోకి వచ్చే పేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ధాన్యాలను ఇస్తున్నారు. ఈ పరిధిలో బియ్యం…

Read More

మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సిబిఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ లోన్ మోసం కేసులో వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్‌కు రుణం మంజూరులో ఐసిఐసిఐ బ్యాంక్‌లో తన హోదాను చందా కొచ్చర్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  2009 ఆగష్టులో వీడియోకాన్ గ్రూప్‭ అధినేత వేణుగోపాల్ ధూత్ నాయకత్వంలోని.. వీఐఈఎల్ కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ కోసం వీరిద్దరికీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే.. 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు.  ఈ కేసులో కొచ్చర్ జంటతో పాటు వేణుగోపాల్ దూత్, ఇతరులపై సిబిఐ కేసు నమోదు చేసి,…

Read More

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరుపై మండిపడుతూ తెలంగాణలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు.  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించలేకపోయిందని దుయ్యబట్టారు.  కేసీఆర్ రైతులను సైతం దగా చేస్తున్నారని, మాయమాటలతో మోసగిస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే రైతులకు ఏమీ చేయలేకపోయిన వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్త రైతాంగం కోసం పోరాడతానంటూ పార్టీ పేరు మార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  బీఆర్ఎస్ ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆ పార్టీ వైపు ఒక్కరూ కూడా కన్నెత్తి చూడలేదని స్పష్టం చేశారు. ఇకపోతే తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ రద్దు చేయడం వరకే సీఎం కేసీఆర్ చేతుల్లో…

Read More