Author: Editor's Desk, Tattva News

ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విలీనం జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణను సెయిల్ నిర్వహిస్తుంది. అలాగే అప్పుల నుంచి బయటపడేసేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీనితో పాటు రుణాల చెల్లింపు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్…

Read More

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగా అమీన్ పూర్ చెరువు ఎప్టీఎల్ పరిధిలో ఉందంటూ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టు కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా.. పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ…

Read More

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-ముడా భూముల కుంభకోణం.. కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో స్వయంగా సీఎం సిద్ధరామయ్యపైనే కేసు నమోదు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను తాజాగా ఈ కేసులో నిందితుడిగా లోకాయుక్త పేర్కొంది.  ఈ కేసులో ఏ1గా సిద్ధరామయ్య పేరును ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు చేశారు. సిద్ధరామయ్యతోపాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితోపాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఆయనకు రోజురోజుకూ మరిన్ని చిక్కులు ఎదురవుతున్నారు. ముడా భూముల కుంభకోణానికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు.. కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం సిద్ధరామయ్యపై శుక్రవారం లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్‌లో ఏ1గా సిద్ధరామయ్య పేరును చేర్చింది.  ముడా…

Read More

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తలపెట్టిన తిరుమల పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరాల్సి ఉన్న జగన్ తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయించుకున్నారు. తిరుమలలో అన్యమతస్థులు సంతకం చేయవలసిన డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే అని అధికార కూటమి నేతలతో పాటు హిందూ సంఘాలు కూడా స్పష్టం చేయడంతో ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించిన జగన్ మోహన్ రెడ్డిని డిక్లరేషన్ పై సంతకం చేయాలనడం `రాజకీయ కుట్ర’ అని టిటిడి బోర్డ్ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. జగన్ సంతకం చేయరని స్పష్టం చేస్తూ ఆయనను తిరుమలకు రానీయని పక్షంలో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మరోవంక, కరుణాకరరెడ్డి ప్రకటన పట్ల స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

Read More

వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక, గనులు, ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. జగన్‌ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రూ. 2,566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది.  ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తించింది.  ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల గుత్తేదారులు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారని నిర్ధరించింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. వీటికి సంబంధించిన కీలక…

Read More

నేషనల్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనలు సులభతరం చేసేందుకు రూ. 130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మరోవైపు, వాతావరణ పరిశోధనల కోసం రూ. 850 కోట్లతో రూపొందించిన హై పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టంను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు. సాంకేతిక విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సాంకేతిక విప్లవంలో మన వాటా బిట్స్ బైట్స్ లో కాదు.. టెరా బైట్లు, పెటా బైట్లలో…

Read More

తిరుపతి లడ్డు నాణ్యతపై ఒకవంక దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుండగా, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపు నిచ్చింది. జగన్ శుక్రవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని, శనివారం శ్రీవారి దర్శనం చేసుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తిరుమల దర్శనా నికి వచ్చే భక్తులు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ నెలకొంది. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తామని బిజెపి, జనసేన, టిడిపి నేతలు, హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుమల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లడ్డూ కల్తీ వివాదంలో జగన్‌పై హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడు ఆయన డిక్లరేషన్…

Read More

బిల్కిస్ బానోపై లైంగికదాడి కేసుపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్షా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో 11 మంది దోషులకు రెమిషన్ ఇవ్వడంలో గుజరాత్ ప్రభుత్వం తన అధికార పరిధిని మించి వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఓపెన్ కోర్టులో సమీక్షించేందుకు లిస్టింగ్ చేయాలన్న అభ్యర్థననూ జస్టిస్‌లు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్ లతో కూడిన బెంచ్ నిరాకరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ ఘటన తర్వాత గుజరాత్ లో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు పారిపోతున్న బిల్కిస్ బానోపై ఆగంతకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోతోపాటు ఆమె మూడేండ్ల కూతురుతోపాటు ఏడుగురు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. 15 ఏండ్ల…

Read More

ప్రపంచంలోనే అతిపెద్దదైన డ్యామ్ చైనాలో ఉంది. చైనాలోని ఈ త్రీ గోర్జెన్ డ్యామ్ భూ గమనాన్నే ప్రభావితం చేస్తోందని, ఇది శ్రేయస్కరం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలో మీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో 2006లో త్రీగోర్జెస్ డ్యామ్ ను నిర్మించారు. ఈ డ్యామ్‌ను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేలమట్టం చేసింది. ఈ డ్యామ్ కు మూడు నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు పది ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటోంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలతో అంచనా వేశారు.…

Read More

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని, ఇలాంటి పాపిష్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా? అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గులేకుండా మళ్లీ తిరుమల దర్శనానికి వెళ్లడం ఏమిటని వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని గౌరవించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని, దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ మంచి మాట చెప్పారని, ఒక సనాతన ధర్మ రక్షణకు ఓ హిందూ బోర్డ్ అవసరమని చెప్పారని రాజాసింగ్ ప్రశంసించారు. మన గుడిని, మన ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చూస్తే వారికి బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. ఏపీలోని ఎన్నో దేవాలయాలలో ఇతర మతస్తులు ఉద్యోగం చేస్తున్నారని,…

Read More