Author: Editor's Desk, Tattva News

గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, అసభ్యంగా తీశారు అంటూ లాపిడ్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో లాపిడ్‌ తాజాగా స్పందించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన లాపిడ్‌ ఇఫీ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ఎవరినీ కించపరిచే, అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే అందుకు తనను క్షమించాలని కోరారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ప్రదర్శించడాన్ని జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ ఫిలింమేకర్‌ అయిన నాదవ్‌ లాపిడ్‌ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ పనోరమా కేటగిరీలో ఈ నెల 22న…

Read More

పాఠశాలలకు వెళ్లే పిల్లల స్కూల్ బ్యాగులు చెక్ చేసిన ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు, మందు మిక్స్ చేసిన వాటర్ బాటిళ్లు, వైటనర్లు కనిపించడంతో వారి నోట మాట రాలేదు ఒకరిద్దరు విద్యార్థుల బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు కూడా కనిపించడం ఉపాధ్యాయులను మరింత షాకింగ్‌కు గురిచేసింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. 8, 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థుల బ్యాగ్‌లలో ఇవి కనిపించాయి. విద్యార్థులు క్లాసులకు మొబైల్ ఫోన్లు తీసుకొస్తున్నారేమో అనే అనుమానంతో తనిఖీలు చేయగా, ఈ షాకింగ్ విషయం బయట పడింది. వెంటనే అప్రమత్తమైన ఆ విద్యా సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్‌ను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థుల బ్యాగ్‌లను చెక్ చేయాలని ‘కర్ణాటక అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్’ పాఠశాలల యాజమాన్యాలకు…

Read More

ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తానంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలని ఆయన సూచించారు.  ఇండ్ల జాగా ఉన్న వాళ్లందరికీ డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని  విమర్శించారు. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదని చెప్పారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని మండిపడ్డారు.  రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలు సహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల గడువు దగ్గర…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ  కవిత పేరును ఈడీ  అధికారులు ప్రస్తావించారు. బుధవారం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు.  ఆమ్ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు.  విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. పది సెల్‌ఫోన్లను కూడా కవిత డ్యామేజ్ చేసినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 36 మందికి చెందిన 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ…

Read More

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు రావడం విదితమే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బిజెపి కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. ‘తాము వదిలిన “బాణం”… తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”’ అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే…

Read More

న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ ఫౌండర్స్‌ (ఎన్‌డిటివి) ఫౌండర్‌, ప్రమోటర్‌ అయిన ప్రణయ్  రాయ్, రాధికారాయ్ లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు.  రాయ్  దంపతులకు ప్రస్తుతం 32.26 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.  వీరు రాజీనామా చేసిన వెంటనే అదానీ గ్రూప్‌కి చెందిన సుదీప్త భట్టాచార్య, సంజయ్  పుగాలియా, సెంథిలి సిన్నయ్ చెంగల్వరాయన్‌లను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది.  ఈ వారం ప్రారంభంలో వీరు మీడియాను స్వాధీనం చేసుకున్నారు. రాయ్  దంపతుల రాజీనామాలతో పాటు నూతన డైెరెక్టర్ల  నియామకాలను మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఎన్‌డిటివి మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్‌డిటివి అదానీ గ్రూప్‌ సొంతమైంది. ఎన్‌డిటివి ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హౌల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు. ఎన్‌డిటివిలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే,…

Read More

ఎన్నికల బాండ్ల పథకం మొదలైనప్పటి (మార్చి 2018) నుంచి ఇప్పటివరకు జరిగిన అమ్మకాల్లో అత్యధికం ముంబయి నుంచి జరిగాయని ఎస్‌బిఐ వెల్లడించింది. ముంబయి తర్వాత బాండ్ల అమ్మకాలు ఎక్కువగా కోల్‌కతా, హైదరాబాద్‌, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో చోటుచేసుకున్నాయని, ఈ ఐదు నగరాల నుంచి బాండ్ల పథకం ద్వారా రూ.10,791 కోట్ల విరాళాలు సమకూరినట్టు ఎస్‌బిఐ తెలిపింది. ఇందులోని 62 శాతం మొత్తం న్యూఢిల్లీలోని ఎస్‌బిఐ ప్రధాన శాఖ నుంచి ఆయా రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. సామాజిక కార్యకర్త లోకేశ్‌ బాత్రా దాఖలు చేసిన ఆర్‌టిఐ దరఖాస్తుకు ఎస్‌బిఐపై గణాంకాలు విడుదల చేసింది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్ముడైన బాండ్లలో 65శాతం ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌ ఎస్‌బిఐ బ్రాంచ్‌ల వద్ద నుంచి ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముఖ్య నగరాల్లోని ఎస్‌బిఐ శాఖల వద్ద మాత్రమే ఈ బాండ్ల అమ్మకాల్ని కేంద్రం…

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టపాల్జేసిన కేసీఆర్ ఏం సాధించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే బైంసా పేరును మైసా (మహిషా) మారుస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలకు అధికారమిచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండని కోరారు.  అట్లాగే బైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందించడంతోపాటు నిలువనీడ లేని వాళ్లందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. బైంసా సమీపంలో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు…

Read More

తిరుపతి నుండి తిరుమల వెళ్ళే మెట్ల మార్గం దగ్గర ” గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం”* కార్యక్రమాన్ని మొదలుపెట్టి నాలుగు అడుగులు వేయగానే మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్, ఇతర నాయకులను, వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి వారి ఆందోళనను భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుతో కలసి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన కార్యక్రమాన్ని అడ్డగించి అరెస్లు చేశారు. సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం, మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్లమీ తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా, గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని. సర్పంచులకు…

Read More

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన నిర్వహిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిలో పూనం మాలకొండయ్యను నియమించారు. ఒకప్పుడు సీఎంఓలో చక్రం తిప్పి, ప్రధాన కార్యదర్శిని సహితం లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీచేసి, వివాదాస్పదంగా మారడంతో ఢిల్లీకి బదిలీ అయిన ప్రవీణ్ ప్రకాష్ తిరిగి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాష్ట్రంలో పోస్ట్ సంపాదించ గలిగారు, రవాణా శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్నా, వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జ్‌గా వై. మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్‌గా రాహూల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరిగా మహ్మద్ దివాన్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. తిరిగి 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం…

Read More