దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇది గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు కావడం విశేషం. 2020 ఏప్రిల్ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,72,068కి చేరింది. ఇక ఇప్పటి వరకు వైరస్ నుంచి 4,41,36,471మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,982 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,615కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.01శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.80శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని వైద్య…
Author: Editor's Desk, Tattva News
తన పాదయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి జరపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం `ప్రగతి భవన్ ముట్టడి’కి బయలుదేరిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిలను అరెస్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్‌కు తరలించారు. ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరాహార దీక్షకు దిగారు. తన కూతుర్ని చూసేందుకు వెళుతుంటే అడ్డుకున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. షర్మిల అరెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ప్రగతి భవన్‌ను షర్మిల ముట్టడించనున్నారన్న సమాచారంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. షర్మిల డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉన్నారు. దీంతో.. షర్మిల ఉన్న కారును…
అమెరికాలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు సరస్సులో సరదాగా ఈతకు వెళ్లి మునిగి పోయారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు ట్విట్టర్‌లో ఫోటోలను షేర్ చేశారు. శనివారం వీకెండ్ కావడంతో సరదాగా మిస్సోరిలోని ఒజర్క్స్ సరస్సుకు వెళ్ళారు. ముందుగా 24 సంవత్సరాల ఉత్తేజ్ సరస్సులోకి వెళ్లి ఈతకొట్టాడు. అయితే తన స్నేహితుడు మునకకు గురవుతున్నాడని పసిగట్టిన శివ వెంటనే సరస్సులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు శివ కూడా మునకకు గురయ్యాడు. కాపాడండి అంటూ కేకలు వినిపించడంతో అక్కడే ఉన్న కొందరు పోలీసులకు కాల్ చేశారు. 2.20 గంటలకు మిస్సోరి స్టేట్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉత్తేజ్‌ను సరస్సులోనుంచి బయటకు తీశారు. శివ కోసం వెంటనే గాలించగా లభ్యం కాలేదు. ఆదివారం శివను రెస్క్యూ చేసిన పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు సరస్సులో మునిగి చనిపోయినట్లు నిర్ధారించారు. వీరిని ఎవరైనా గుర్తుపట్టాలంటూ ట్విట్టర్‌లో ఫోటోలు…
సమైక్య రాష్ట్ర విభజనపై సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విభజనపై దాఖలైన 27 పిటిషన్లపై విచారణ ప్రక్రియను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రారంభించింది. పిటిషనర్ ఇన్ పర్సన్ గా ఉన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్ తన వాదనలు వినిపిస్తూ ‘విభజనకు ఎటువంటి విధాన ప్రక్రియను అనుసరించలేదు రాజ్యాంగ నిబంధనలు పాటించలేదు.’ అని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని ఆర్టికల్ 368 ఉంది కదా అని ప్రశ్నించారు. ఉండవల్లి స్పందిస్తూ ‘వారు దానిని అనుసరించలేదు. కనీసం ఓటింగ్ కూడా నిర్వహించలేదు. ఎవరికి ఏం తెలియనివ్వలేదు. మొదటిసారి టీవి టెలికాస్ట్ నిలిపివేశారు. రాజ్యాంగంలో ఏనాడూ వినియోగించని 367 (3)న అమలు చేశారు. డివిజన్ చేయాలనే ఉన్న నిబంధనను పట్టించుకోలేదు. స్పీకర్ తలలు లెక్కపెట్టారు’ అని తెలిపారు. పైగా, విభజనను ఏపి శాసనసభ,…
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందున్నారు. గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా ఈ విశిష్ట పురస్కారాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులమీదుగా చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ తనను మెగాస్టార్‌ను చేసిందని, ఇవాళ ఇక్కడి వరకు నడిపించిందని, వారి ప్రేమకు తాను దాసుడ్ని అని చెప్పారు. తాను మెగాస్టార్ స్థాయికి చేరానంటే లైట్ బాయ్ నుంచి సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని చెప్పారు. తనకు ఈ అవార్డు ప్రదానం చేసి.. గొప్ప గౌరవాన్ని అందించినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొన్ని గుర్తింపులకు ప్రత్యేకమైన విలువ ఉంటుందని చెబుతూ ఈ పురస్కారం అలాంటిదని తెలిపారు. ప్రేక్షకులు తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలను జీవితాంతం కాపాడుకుంటానని చిరంజీవి చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో కొణిదెల శివశంకర్ వరప్రసాద్…
భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కొద్దీ నెలల క్రితమే ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దాంతో ఆసియా క్రీడల్లో పలు పతకాలు సాధించిన ఉష.. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఒలింపియన్‌గా, అంతర్జాతీయ పతక విజేతగా రికార్డు సృష్టించనుంది. అంతేగాక మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్ పర్సన్‌గా కూడా ఆమె ఘనత దక్కించుకున్నారు. ఇక, ఉపాధ్యక్ష పదవి (పురుషుల కేటగిరి)కి మాజీ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు. ఈ పదవి నారంగ్ నామినేషన్ ఒక్కటే…
విశేష ప్రఖ్యాతి పొందిన టీటీడీ ముద్రించే క్యాలెండర్లు, డైరీలు 2023 సంవత్సరానికి సంబంధించి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతితో పాటు, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలతోపాటు కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, రాజమహేంద్రవరం, తెలంగాణలోని హనుమకొండ టీటీడీ కల్యాణ మండపాల్లో డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు. ధర విషయానికొస్తే పెద్ద డైరీ రూ.150 కాగా, చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్ రూ.130గా ఉంది. టేబుల్ క్యాలెండర్ రూ.75గా నిర్ణయించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో పబ్లికేషన్స్‌ను క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేసుకోవచ్చునని తెలిపారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇంటివద్దకే అందిస్తున్నట్లు తితిదే తెలిపింది. భక్తులు డీడీ తీసి పంపొచ్చు. ఇందుకోసం ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ,…
మత స్వేచ్ఛ అంటే అందులో ఒక ప్రత్యేక మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భయపెట్టడం, బెదిరించడం, కానుకలతో ప్రలోభపెట్టడం వంటి మోసకారి పద్ధతుల ద్వారా జరిగే మోసకారి మతమార్పిడులను నిరోధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కేంద్ర హోంశాఖ అఫిడవిట్ సమర్పించింది. దేశంలోని నిస్సహాయ వర్గాలకు చెందిన పౌరులను వ్యవస్థీకృతంగా, ఓ పద్ధతి ప్రకారం, తెలివైన రీతిలో జరిగే మోసకారి మతమార్పిడుల గురించి పిటిషనర్ అనేక ఉదంతాలను ఎత్తిచూపారని అఫిడవిట్‌లో పేర్కొన్నది. రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణాలను మతమార్పిడులు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ 25వ అధికరణంపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని హోంశాఖ గుర్తుచేసింది. మత ప్రచారంలో మతమార్పిడి ప్రాథమిక హక్కు లేదనే స్పష్టీకరణ ఇచ్చిన తర్వాతనే రాజ్యాంగ సభ 25వ అధికరణాన్ని ఆమోదించిందని తెలిపింది. మతప్రచారం అంటే…
మహిళలు దుస్తువులు ధరించకపోయిన బాగుంటారనే అనే వ్యాఖ్యలపై యోగ గురు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పారు. రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్‌కు నోటీసులు జారీ చేసింది. దానితో బాబా రాందేవ్ క్షమాపణలు కోరినట్లు మహారాష్ట్ర కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలి చకాల్కర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్షమాపణలు కోరుతూ రాందేవ్ బాబా పంపిన లేఖను కూడా ఆమె తన పోస్టుకు జతచేశారు. మహిళల సాధికారత కోసం, వారి గౌరవం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని బాబా రాందేవ్ తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలను ప్రోత్సహించానని, మహిళా సాధికారక కోసం తాను ఎల్లప్పుడు కృషి చేశానని చెప్పారు. మహిళలను అగౌరవంగా చూడలేదని చెబుతూ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని…
‘‘అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దిగిపోవాలి’’.. ‘‘స్టెప్‌డౌన్ చైనా కమ్యూనిస్టు పార్టీ’’, ‘‘అన్‌లాక్ చైనా’’.. ‘‘అన్‌లాక్ షిన్‌జియాంగ్’’.. ‘‘పీసీఆర్ టెస్టులు వద్దంటే వద్దు’’ అంటూ చైనీయులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ‘జీరో కొవిడ్ పాలసీ’తో నెలల తరబడి లాక్‌డౌన్‌లలో మగ్గిపోయిన ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గురువారం షిన్‌జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరువ్‌కీలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది ఆహుతవ్వడంతో ప్రజాగ్రహానికి బీజం పడింది. ఆ భవనంలోని ఫ్లాట్ల తలుపులకు ప్రభుత్వం చైన్లతో తాళాలు వేసిందని.. దాంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేక వారు చనిపోయారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత చైనా ప్రధాన నగరాల్లో క్రమంగా ఆందోళనలు ఆరంభమయ్యాయి. ఉరువ్‌కీలో శుక్రవారం శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనల్లో వందల మంది ‘హాన్’ వర్గం చైనీయులు, వుయ్‌ఘర్ ముస్లింలు పాల్గొన్నారు. వారి నిరసనను అణచివేసేందుకు పోలీసులు లాఠీలను ఝుళిపించారు. ఈ వీడియోలు…