ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రను సోమవారం ప్రారంభించడం కోసం కరీంనగర్ నుండి బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు అకస్మాత్తుగా, ఆదివారం రాత్రి మార్గమధ్యలో అనుమతి రద్దు చేస్తున్నట్లు చెబుతూ, అడ్డుకొని, అరెస్ట్ చేసి, కరీంనగర్ కు తీసుకు వచ్చి వదిలిపెట్టారు. దానితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భైంసాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన, రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమని ఆయన మండిపడ్డారు. భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమ? అక్కడికి ఎందుకు వెళ్లొద్దని ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు.…
Author: Editor's Desk, Tattva News
మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబరు 9వ తేదీన సీఎం కేసీఆర్ ఇందుకు భూమిపూజ చేయనున్నారు. 31 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ సెకండ్ ఫేజ్ కోసం సుమారు రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 2017 నవంబర్ లో నాగోల్ – అమీర్పేట్ – మియాపూర్ మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 2018 అక్టోబర్ లో ఎల్బీనగర్ – అమీర్పేట్ మెట్రో లైన్ను ప్రారంభించారు. 2019 మార్చిలో అమీర్పేట్ –హైటెక్ సిటీ మెట్రో లైన్ ను ప్రారంభించారు. జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో లైన్ 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. మెట్రోలో కరోనా ముందు వరకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం సుమారు 4 లక్షల వరకు ప్రయాణిస్తున్నారు.…
ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ గా మారుతున్న భారత్ లో ఇటీవల సరఫరాలు తగ్గుతూ, అమ్మకాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉండడం ఆందోళన సాగిస్తున్నది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌లో 10 శాతం సరఫరాలు తగ్గగా, అమ్మకాలు మూడేళ్ల కనిష్టామైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2019 తరువాత ఒక త్రైమాసికంలో నమోదైన అత్యల్ప సరఫరాలు ఇవేనని తెలిపింది. తగ్గిన డిమాండ్, అధిక ధరలు పండగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. మొత్తం స్మార్ట్ ఫోన్‌లలో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి (1.6 కోట్లు) కు చేరింది. జూన్ త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 377 డాలర్లు, దాదాపు 30,600గా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 393 డాలర్లుగా ఉంది, అంటే దాదాపు 32 వెలుకుపెరిగిందని తెలిపింది. స్మార్ట్ ఫోన్ నిల్వలు పెరుకుపోగా, పండుగల తరువాత గీరాకీ సహజంగానే తగ్గుతుంది కనుక డిసెంబర్…
వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి హాజరుకానున్నారు. ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరు కాలేదు. అంతకుముందు ఏడాది భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సొనారో హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. “ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్టు…
చందమామపై మరో ఆరేండ్లలో అణు విద్యుత్ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్లు చైనా వెల్లడించింది. చైనా లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ చీఫ్ డిజైనర్ వు వియ్‌రాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంచేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన నివేదికలో తెలిపింది. ‘‘మరో ఆరేండ్లలో చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేస్తాం. అది అణు విద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది. వచ్చే పదేండ్లలో మా వ్యోమగాములు చంద్రుడిపైకి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ల్యాండర్, హాపర్, ఆర్బిటర్, రోవర్ అనే నాలుగు కీలక భాగాలుంటాయి.’’ వు వియ్‌రాన్ స్పష్టం చేశారు. అయితే చంద్రుడిపై స్థావరం కోసం చైనా స్పేస్ ఏజెన్సీ ఎలా ప్రణాళికను అనుసరిస్తున్నదో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కానీ, చైనా చంద్రుడిపై ఏర్పాటు చేయబోయే అణు శక్తి ఆధారిత స్థావరం ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దాంతో ఒక ఏడాదిపాటు వందలాది ఇండ్లకు విద్యుత్‌ను అందజేయవచ్చని…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించేమన్‌కీ బాత్ మనసులో మాట)లో భాగంగా ఇవాళ రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడిన మోదీ తెలంగాణ ప్రస్తావన తేవడం విశేషం. సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న తనకు జీ-20 లోగోను పంపారన్నప్రధాని ఆ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇలాంటి సృజనాత్మకత దేశ ప్రజల్లో ఉత్సాహం, ఎనర్జీని చాటి చెబుతోందని పేర్కొన్నారు. ఈ రోజున దేశంలోని ప్రజలంతా కొత్తగా, ప్రత్యేకంగా ఏదైనా చెయ్యడానికి ఎవరి వంతుగా వారు తమ తమ రంగాల్లో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈసారి డిసెంబర్ 1న భారత్ బాధ్యతగా తీసుకోబోయే జీ-20 సదస్సును చక్కగా జరిపేందుకు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మెచ్చుకున్న మోదీ ఇది మనకు గర్వకారణం తెలిపారు. ఈ సదస్సులోని సభ్య దేశాల్లో ప్రపంచంలోని మూడొంతుల జనాభా ఉన్నారన్న మోదీ ప్రపంచంలోని నాలుగింట మూడొంతుల వాణిజ్యం ఈ దేశాల్లోనే జరుగుతోంది పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీలో 80…
మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాగానే అధికార టిఆర్ఎస్ లో ప్రకంపనాలు తధ్యమని, ఆ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొంటూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు తరాలుగా కాంగ్రెస్ కుటుంభం నేపధ్యం గల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చేరికతో ఉత్సాహంతో ఉన్న బిజెపి నేతలు మరి కొంతమంది నేతలను కూడా చేర్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం పది మంది సీనియర్ కాంగ్రెస్ నేతల పట్ల బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. వారిలో ఐదు మంది వరకు త్వరలో చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్లను ఆకర్షించే పనిలో బిజెపి నేతలున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు బీజేపీలో…
ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్స్‌యాప్ లో డేటా భద్రత లోపించినట్లు స్పష్టమైనది. భారీగా డేటా లీక్ కావడంతో దాదాపు 50 కోట్ల మంది వాట్స్ యాప్ యూజర్ల ఫోన్ నెంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్ నివేదిక తెలిపింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్ నెంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సైబర్ న్యూస్ కథనం తెలిపింది. 48.7 కోట్ల వాట్స్‌యాప్ యూజర్ల ఫోన్ నెంబర్లతో 2022 డేటా బేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. అమెరికా, యూకే, ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియా సహా 8 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని ఆ కథనం పేర్కొంది. ఇందులో మన దేశానికి చెందిన యూజర్ల నెంబర్లు కూడా ఉన్నాయి. అత్యధికంగా ఈజిప్టు…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఆయన హత్యకు దారి తీశాయని మరో వాదన తెరమీదకు వచ్చింది. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు ఆమె కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తీవ్ర ఆందోళన కలిగించిందని ఆరోపణలు తలెత్తాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో ఆ మేరకు శనివారం సంచలన వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ తీరును తప్పుబడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకాను వదిలిపెట్టాలని షమీమ్‌ను ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత బెదిరించారని తుల్సామ్మా చెప్పారు. షమీమ్‌కు జన్మించిన కుమారుడినే తన చట్టబద్ధమైన వారసుడిగా ప్రకటిస్తానని వైఎస్ వివేకానంద రెడ్ తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో ఆ వివాదం మరింత…
పెద్ద నోట్లు రద్దు సమయంలో తమ వద్ద గల పాత నోట్లను డిపాజిట్ చేయలేకపోయిన వారికి ఏదైనా పరిష్కార మార్గాన్ని ఆలోచించగలరా? అని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ)ని సుప్రీం కోర్టు కోరింది. నిజాయితీగానే వీరు తమ వద్ద గల మొత్తాలను ఆనాడు బ్యాంకుల్లో జమ చేయలేకపోయారని తేలిన వారి కేసుల్లోనే ఈ పరిష్కారం ఆలోచించాలని కోరింది. ఇటువంటి నిజాయితీ గల కేసులు కొన్ని వుంటాయి. ఒక వ్యక్తి ఆరు మాసాల పాటు కోమాలో వుండి తన వద్ద గల నోట్లను మార్చుకోలేక పోయింది. ఆమె పిల్లలకు ఆ నోట్ల గురించి తెలియదు. బహుశా లాకర్‌లో వుండి వుంటాయి. ఇటువంటి కేసుల్లో మీరు తప్పక ఒక పరిష్కార మార్గానిు సూచించాల్సి వుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ బి.ఆర్.గవారు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గ్రేస్ పీరియడ్ 2016 నవంబరు 9 నుండి డిసెంబరు…