Author: Editor's Desk, Tattva News

గుజరాత్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీతో పాటు సీనియర్‌ నేతలు ప్రచారం చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ తరఫున పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రోడ్‌షోలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అహ్మదాబాద్‌లో బీజేపీకి మద్దతుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు.  భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిస్వా శర్మ ఛలోక్తులు విసిరారు. సద్దాం హుస్సేన్ పోలికల్లో రాహుల్ కనిపిస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రాహుల్‌ పర్యటిస్తున్నాడన్న శర్మ ఆయన గుజరాత్‌లో కనిపించడు.. విజిటింగ్‌ ఫ్యాకల్టీలా రాష్ట్రానికి వస్తాడని విమర్శించారు.  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు బాలీవుడ్‌ తారలకు కాంగ్రెస్‌ పార్టీ డబ్బులిచ్చి ఉంటుందని…

Read More

టెక్‌ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. అమెరికాలో అమెజాన్‌, మెటా, ట్విట్టర్‌ వంటి టెక్‌ సంస్థలు చేపట్టిన మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజాగా గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. న్యూ ర్యాంకింగ్‌, పనితీరు మెరుగుదల ప్రణాళిక ద్వారా 10 వేల మంది ఉద్యోగులను తగ్గించుకొనే ప్లాన్‌లో ఆల్ఫాబెట్‌ ఉన్నదని, ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని ‘ది ఇన్ఫర్మేషన్‌’ నివేదిక పేర్కొన్నది. పనితీరు సక్రమంగా లేని వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడంలో ఈ కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ మేనేజర్లకు సాయపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం నుంచి మేనేజర్లకు తగిన ఆదేశాలు వెళ్లాయని నివేదించింది. ఈ…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్తులు జారీ చేయాలని కోరుతూ ఆ కేసులో ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రామ చంద్రభారతి, కోరె నందు కుమార్, డీపీఎస్‌‌‌‌‌‌‌‌కేవీఎన్‌‌‌‌‌‌‌‌ సింహయాజి సంయుక్తంగా మంగళవారం అనుబంధ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయకుండా వారి తరఫున లాయర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఈ అనుబంధ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ నెల 9న ప్రభుత్వం సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఏడుగురితో ఏర్పాటు చేసిన సిట్‌‌‌‌‌‌‌‌పై స్టే ఉత్తర్వులు జారీ చేయాలని నిందితులు తమ పిటిషన్​లో కోరారు. మొయినాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన కేసును సిట్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయడం సరికాదని, సీబీఐ దర్యాప్తుకు లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్‌‌‌‌‌‌‌‌ విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడం లేదు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే దర్యాప్తు…

Read More

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మధ్య ప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్ సందేశాన్ని ఈ ఆరోపణలకు మద్దతుగా చూపించింది. గాంధీతో 15 నిమిషాల పాటు నడవడం కోసం నటీనటులు తమకు నచ్చిన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చునని ఈ సందేశం చెప్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందిస్తూ, ఈ వాట్సాప్ సందేశాన్ని ఎవరు పంపించారో చెప్పడం లేదని, కేవలం యాత్రను అపఖ్యాతిపాలు చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రలో సినీ నిర్మాత, దర్శకుడు అమోల్ పాలేకర్ పాల్గొన్న తర్వాత బీజేపీ నేతలు ఈ ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఓ నాయకుడిగా రాహుల్ గాంధీ యోగ్యత, లక్షణాలు కొత్తదనాన్ని సంతరించుకోవడం అటుంచి, ఆయన యాత్ర సాధించినది ఏమిటంటే,…

Read More

అసోమ్, మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల ఘటనపై మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ జైంతియా హిల్స్ లోని ముక్రోహ్ లో మంగళవారం జరిగిన కాల్పుల్లో అస్సాం అటవీ అధికారి సహా.. మేఘాలయకు చెందిన ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేశారని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తెలిపారు. ఈ ఘటనపై వదంతులు ప్రచారం చేసే అవకాశం ఉందని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 48 గంటలపాటు నిలిపివేసింది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. ఇవాళ ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం -మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో.. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర చేపట్టిన సంజయ్ ఇప్పుడు ఐదో విడత యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ వరకు ఈ పాదయాత్ర సాగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని, డిసెంబర్‌ 15 వరకు యాత్ర కొనసాగనుందని యాత్ర కో ఆర్డినేటర్‌ వీరేందర్‌ గౌడ్‌ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ టిఆర్ఎస్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన గోల్కొండ కిల్లాపై కాషాయ జండా ఎగుర వేస్తం అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు…

Read More

మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిలతో సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మైసమ్మగూడ, మేడ్చల్…

Read More

భూకంపంతో ఇండోనేసియా చిగురుటాకులా వణికింది. తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 162 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. జకార్తాకు 75 కిలో మీటర్ల దూరంలో సింజూర్ భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని భూగర్భ పరిశోధన అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. 2200 ఇండ్లు కూలిపోయాయి. 5300 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. వేలాది ఇండ్లు, ఆఫీసులు కూలిపోయాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ టీమ్​లకు సిటిజన్లు సాయం చేస్తున్నారు. మరోవైపు మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు ఇండోనేసియా వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ ను సోమవారం 8 గంటల పాటు  సిట్ అధికారులు ప్రశ్నించారు. సింహయాజీ స్వామికి శ్రీనివాస్‌కు మధ్య నడిచిన ఫోన్ కాల్స్ డేటాపై అధికారులు ఆరా తీశారు. దాంతో పాటు సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటం గురించి కూడా శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నిచారు.  అయితే.. సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది నిజమేనని ఒప్పుకున్న శ్రీనివాస్  కేవలం పూజల కోసమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని వెల్లడించారు. ఈ రెండు విషయాల మీదే కాకుండా అధికారులు పలు కోణాల్లో శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ గురించిన విషయాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.  కాగా, సోమవారం విచారణకు కేరళాకు చెందిన తుషార్, జగ్గుస్వామితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ కూడా రావాల్సి ఉండగా..…

Read More

ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్‌పై మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోషియారీ వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలోని అధికార శివ‌సేన ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం-బీజేపీ కూట‌మిలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. బీజేపీని, సీఎం ఏక్‌నాథ్ షిండేను ల‌క్ష్యంగా చేసుకుని శివ‌సేన ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దానితో ఈ వ్యవ‌హారంపై మౌనం వీడిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మిత్ర‌ప‌క్ష నేత‌,ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీరును త‌ప్పుబ‌ట్టారు. `శివాజీ మ‌హారాజ్ మాకు దేవుడు. మా త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువ‌గా ఆయ‌న్ను పూజిస్తాం` అని గ‌డ్క‌రీ వ్యాఖ్యానించారు. శ‌నివారం జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోషియారీ మాట్లాడుతూ మ‌హారాష్ట్ర‌లో శివాజీ మ‌హారాజ్ కాలం చెల్లిన ప్ర‌ముఖుడు అనే అర్థం వ‌చ్చేలా వ్యాఖ్యానించారు. `మీ ఆరాధ్య నాయ‌కులు ఎవ‌రు అంటే జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర‌బోస్‌, మ‌హాత్మాగాంధీ అని జ‌వాబులు వ‌స్తాయి. మ‌హారాష్ట్ర‌లో చాలా మంది ఆరాధ్య నాయ‌కులు ఉన్నారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ పాత‌కాలం…

Read More