Author: Editor's Desk, Tattva News

విశ్రాంత క‌లెక్ట‌ర్ అరుణ్ గోయ‌ల్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారిగా నియ‌మితుల‌య్యారు. అరుణ్ గోయ‌ల్‌ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ కేంద్ర న్యాయ శాఖ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దాంతో, ఆయ‌న‌ మూడో ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.  చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సుశిల్ చంద్ర మే నెల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. దాంతో, మూడో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉన్న రాజివ్ కుమార్ భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్ప‌టినుంచి మూడో ఎన్నిక‌ల అధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. రెండో ఎన్నిక‌ల అధికారిగా అనూప్ చంద్ర పాండే కొన‌సాగుతున్నారు. పంజాబ్‌ కేడ‌ర్‌కు చెందిన అరుణ్ 1985 బ్యాచ్ ఎఏఎస్ అధికారి. 34 ఏళ్లు ప‌లు హోదాల్లో ఆయ‌న‌ సేవ‌లు అందించారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో అడిష‌న‌ల్ సెక్రెట‌రీగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చ‌దివిన అరుణ్ గోయ‌ల్ ఆ త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లోని ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు. ఈ మ‌ధ్యే గుజ‌రాత్…

Read More

ఈ ఏడాది డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు పార్లమెంట‌రీ వ్యవ‌హారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబ‌ర్ 7 నుంచి 29వ తేదీ వ‌ర‌కు పార్లమెంట్ స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. 23 రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. నిర్మాణాత్మక చ‌ర్చ కోసం ఎదురు చూస్తున్నామ‌ని పేర్కొన్నారు.  డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ఎలాంటి సెలవులు లేకుండా పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించనుంది. ముఖ్యంగా జిఎస్టి, రైతుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనుంది.  23 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయి. సమావేశాల మొదటి రోజు సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం ప్రకటిస్తూ వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో…

Read More

దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా ఈ విష సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. ఒడిశా గంజాం జిల్లా బినాయక ఆచార్య కళాశాలలో ఒక విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్ అంటూ లైంగిక పరమైన వేధింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. డిగ్రీ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై కొందరు సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు. అంతటితో ఆగకుండా శారీరకంగా వేధింపులకు గురి చేశారు. ఫ్రెషర్‌ విద్యార్థితో బాలికకు బలవంతంగా కళాశాల గ్రౌండ్‌లో అందరి ముందూ ముద్దులు పెట్టించారు.  మధ్యలో విద్యార్థిని వెళ్లిపోతుండగా పక్కనే నిల్చొని ఉన్న సీనియర్‌ విద్యార్థి కర్రతో ఆమెను బెదిరించి ఆపాడు.  ఇదంతా కొంతమంది సీనియర్ అమ్మాయిలు అక్కడే నిలబడి నవ్వుతూ చూశారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు.  అక్కడే ఉన్న మరికొంతమంది విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సంఘటన దృశ్యాలు సామాజిక…

Read More

కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.  తాను  బీజేపీలో చేరాబుతున్నట్లు వస్తున్న కథనాలపై స్పందిస్తూ  అందుకే ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు.  మర్రి శశిధర్ రెడ్డి  బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ లతో కలిసి శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  ఈ క్రమంలో తన ట్విటర్‌ ఖాతాలో కాంగ్రెస్‌ పదాన్ని తొలగించారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమేనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు ఈ సందర్భంగా మర్రి…

Read More

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత కార్యదర్శి హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. అతడిని ట్రాప్లో పడేసిన వ్యక్తులు పలు ముఖ్యమైన, రహస్య పత్రాలను  సొంతం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.  దీనిపై పలు కుంభకోణాలను బహిర్గతం చేసిన రిజిస్టర్డ్ పబ్లిక్ ఆర్గనైజేషన్ జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ శర్మ విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శాసనసభ్యులను టార్గెట్ చేసుకుని హనీ ట్రాప్ ముఠా పనిచేస్తుందని ఫిర్యాదుదారు ఆరోపించారు. విధానసౌధలో పనిచేస్తున్న డి-గ్రూప్ మహిళా ఉద్యోగి బొమ్మై పీఏ హరీష్‌ను హనీ ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు తమ వీడియోలను రికార్డ్ చేసి, హరీష్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన పలు రహస్య పత్రాలను సేకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి సంతకంతో కూడిన పత్రాలను ప్రతిపక్ష నేతలకు ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బెంగుళూరు సమీపంలోని కనకపుర రోడ్డు సమీపంలో నిందితురాలి పేరిట కోట్లాది…

Read More

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ఎప్పుడూ ధృడంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతం, తీవ్రతను అనుసరించి స్పందన ఉండబోదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ”నో మనీ ఫర్‌ టెర్రర్‌” సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడిగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి ముప్పు కలిగించే ఉగ్రవాదంపై అన్ని దేశాలు స్పష్టమైన విధానం కలిగి ఉండాలని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విస్తరిస్తోన్న ఉగ్రవాదంపై పోరాడేందుకు అన్ని దేశాలు ఏకమవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా గుర్తించకముందే భారత్‌ తీవ్రమైన ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాలకు పైగా ఉగ్రవాదం విభిన్న పేర్లతో, రూపాలతో భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని తెలిపారు. దీంతో వేలాది మంది విలువైన ప్రాణాలు కోల్పోయినప్పటికీ .. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు విశ్రమించబోమని ప్రధాని స్పష్టం చేశారు.…

Read More

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో లేదని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత లేకుండా పోతోందని పేర్కొన్నారు.  అయితే, తాము పరిమితికి మించి రుణాలు చేయడం లేదని, తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన పరిమితికి లోబడే ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనుమతికి మించి చేసిన రుణాల కారణంగా రూ. 17 వేల కోట్లను ప్రస్తుత పరిమితి నుంచి కేంద్రం కోతలు విధించిందని, అరదుకే ఆ మొత్తాన్ని మళ్లీ ఇవ్వాలనే తాము కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు.  అంతేగాని,  అదనపు రుణం అడగడం లేదని తెలిపారు. ఆ రూ. 17 వేల కోట్ల అరశం 14వ ఆర్ధిక సంఘానికి సంబంధించినదని, తాము ప్రస్తుతం 15వ ఆర్ధిక సంఘం పరిధిలో ఉన్నామని  ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు పదేపదే తనను అప్పుల మంత్రిగా అంటున్నారని, అప్పులు…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తమ నాయకులకు, వారికి సన్నిహితులైన వారికి నోటీసులు ఇస్తుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర హైకోర్టుకు మరోసారి వెళ్లారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో సోదాలు నిర్వ‌హించి దర్యాప్తు వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ఫోన్ కాల్ లైవ్‌లో మాట్లాడిన తుషార్‌కు తొలుత నోటీసులు జారీ చేశారు. కాగా, శుక్ర‌వారం) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బీఎల్ సంతోష్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తెలంగాణ‌లోని ఓ బీజేపీ నేత బంధువు అయిన అడ్వొకేట్‌ శ్రీనివాసరావుకు కూడా నోటీసులు అందాయి. ఇక కేర‌ళ‌లో కొచ్చికు చెందిన జగ్గుస్వామికూడా సిట్ నోటీసులు జారీ చేసింది. సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్ లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సంతోష్ కు అధికారులు సూచించారు. విచారణకు…

Read More

భారత్‌లో మొదటి ప్రైవేట్‌ రాకెట్‌ ‘‘విక్రమ్‌ ఎస్‌’’ ప్రయోగం విజయవంతమైంది. చెన్నైకి 115 కి.మీ దూరంలోని శ్రీహరికోట నుండి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ.. విక్రమ్‌-సబ్‌ ఆర్బిటల్‌ (వికెఎస్‌) ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. “విక్రమ్‌-ఎస్‌ గగనతలాన్ని అలంకరించిన భారతదేశపు మొదటి ప్రైవేట్‌ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ మహత్తరమైన సందర్భంగా మాతో ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని వికెఎస్ ఒక  ట్వీట్‌లో  ప్రకటించింది.    మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయికి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టినట్లు వికెఎస్ తెలిపింది.  ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్‌’ అని నామకరణం చేశారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో  నేటికి వాయిదా పడింది.  శ్రీహరికోట లోని సతీష్ ధావన్…

Read More

భారత్‌ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్యను పోలిన ఈ సంఘటన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరిగింది. ఓ హిందూ యువతిని ముస్లిం ప్రియుడు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. అబూ బకర్ అనే వ్యక్తి ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ నెల 6న అతడు పనికి రాలేదు. యజమాని ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌లో ఉంది. దీంతో అతడు అద్దెకున్న ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆ ఇంటి యజమాని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. తలలేని యువతి మృతదేహం ఒక పెట్టెలో ఉండటం చూసి షాకయ్యారు. ఇంట్లోనే మరోచోట పాలిథిన్‌ కవర్‌లో ఆమె తల కనిపించింది. అయితే రెండు చేతులు మాయమయ్యాయి. మృతురాలిని కవితా రాణిగా పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య…

Read More