దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్, జైకుమార్‌లను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. మేలో పెరారివళవన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడు జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే తీర్పు ఆరుగురికి వర్తిస్తుందని జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో నిందితులందరూ 30 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించారు. నిందితుల ప్రవర్తన సరిగా ఉండడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి ఉందని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులపై ప్రేమ ఒలకపోస్తున్న కేసీఆర్.. కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలో ఢిల్లీలో దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కనీసం మద్దతు తెలపలేదని ధ్వజమెత్తారు. ఎన్నో త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తుంటే కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్..రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా రాష్ట్రంలో రైతులకు, యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కానీ…
యూనివర్సిటీలలో ఉమ్మడి నియామక బోర్డు బిల్లులపై విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు కలిసి, ఆమె సందేహాలకు వివరణ ఇచ్చారు. గవర్నర్ తమిళిసైతో గురువారం సాయంత్రం మంత్రి జరిగిన భేటీలో ఆమెతో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. యుజిసి నిబంధనల అమలు, న్యాయపరమైన అం శాలు, రిజర్వేషన్లు వంటి వాటిపై గవర్నర్ వివరాలు అడిగినట్లు తెలిసింది. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సాంకేతిక, న్యాయపరమైన స మస్యలు లేకుండా, యుజిసి నిబంధనల మేరకు నియామకాలు చేపట్టేలా బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుత విధానంలో ఉన్న ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యా న్ని గవర్నర్‌కు మంత్రి వివరించారు. నియామకాలు త్వరగా జరిగేందుకు,…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గత నెల విజయవాడలో అకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కలిసి, ఇరువురం ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం జరుపుతామని ప్రకటించడంతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో పొత్తుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు పంపినట్లయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంకు రెండు రోజుల పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడం, విశాఖపట్నంలో అందుబాటులో ఉండమని కోరుతూ ఆయన కార్యాలయం ఫోన్ చేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా సంభవిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 2014లో బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకున్న తర్వాత పవన్ ప్రధానిని కలవడం ఇదే కానున్నది. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు.శుక్రవారం రాత్రి గాని, శనివారం ఉదయం గాని వారు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీ సందర్భంగా…
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ఈ సమాచారాన్ని ట్విటర్‌లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటే ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు, డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. మెయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996 నుంచి ఎస్పీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది. 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ వచ్చిన…
ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల నవీకరణపై కేంద్రం కచ్చితమైన ప్రకటన చేసింది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలను పునరుద్ధరించుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం నిబంధనల్ని సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ చేయబడ్డాయి. వీటిలో కొన్ని ఆధార్ కార్డుల వివరాలు సరిగాలేవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్‌డేషన్‌పై దృష్టిసారించింది. ఆధార్ పొందిన ప్రతివ్యక్తి, పదేళ్లకోసారి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలు పొందడంలో ఆధార్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ పొంది పదేళ్లు పూర్తయిన ప్రతివ్యక్తి కనీసం ఒక్కసారైనా వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. దీనివల్ల కేంద్ర సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్)లో డేటా పక్కాగా నిక్షిప్తం అవుతుంది అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ తెలిపింది. పదేళ్లకోసారి వ్యక్తిగత ధ్రువీకరణ (పీఓఐ),…
అయ్యప్ప స్వామి భక్తులు కేరళలోని శబరిమల క్షేత్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది ఈ క్షేత్రంలో రెండు నెలల పాటు ‘మండలం మకరవిళక్కు’ పండుగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది మరో రెండు రోజుల్లో ఈ పండుగ ప్రారంభం కానుంది. దాంతో, ఆలయ పరిసరాలను నవంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ‘లిక్కర్, డ్రగ్స్ ఫ్రీ జోన్’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమలలోని వ్యాపారులు, శబరిమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అంతేకాదు మందు, డ్రగ్స్, పొగాకుపై విధించిన నిషేధాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారుల బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు. ఆలయ పరిసరాల్లో ‘ఇక్కడ మద్యం, డ్రగ్స్, పొగాకు వంటివి నిషేధం’ అని పలు భాషల్లో రాసున్న బోర్డులని అధికారులు చాలా చోట్ల ఏర్పాటు చేశారు.…
లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ సీబీఐ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. అరబిందో గ్రూపు సహా 12 కంపెనీల్లో డైరక్టర్‌గా ఉన్న పి. శరత్ చంద్రా రెడ్డిని, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినోయ్ బాబును ఈడీ అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఇరువురి నిందితులను వారి భార్యలు కలిసేందుకు కోర్టు అనుమతించింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కుటుంబ సభ్యులు వారిని కలవవచ్చని స్పష్టం చేసింది. అరెస్టుకు సంబంధించి తొలుత వాదనలు వినిపించిన బినోయ్ బాబు తరఫు న్యాయవాది లిక్కర్ స్కాంలో లబ్ది పొందిన ఇండో స్పిరిట్స్ కంపెనీతో తన క్లయింటుకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు.…
దేశంలో మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్దరించి ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు. అందులో భాగంగా రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో ఈనెల 12న ప్రధానమంత్రి రామగుండం వచ్చి కర్మాగారాన్ని జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పారు. బుధవారం ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో సమీక్ష జరిపారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమిక ల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) పరిశ్రమను పరిశీలించారు. కర్మాగారంలో కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, సైలోలను పరిశీలించారు. ప్రధాని రూట్ మ్యాప్‌లో ఎక్కడె క్కడ ఎంతసేపు పరిశీలన చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం పరిశ్రమలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగదర్ ఎంపీ బండి సంజయ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. షట్‌డౌన్ తరువాత పరిశ్రమ వంద శాతం ఉ త్పత్తి సాధిస్తుందని, ఈ ఏడాది ఇప్పటికే 5లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని అధికారులు…
తన ఫోన్ ట్యాప్ అవుతుందని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తద్వారా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని చెప్పారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కూడా రాజ్ భవన్ ను లాగాలని చూశారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారని పేర్కొంటూ ఫాంహౌస్ ఆడియో టేస్ విషయంలోనూ రాజ్ భవన్ ప్రస్తావన వచ్చిందని గుర్తు చేశారు. తన మాజీ ఏడీసీ తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని చెబుతూ తుషార్ గతంలో తనకు ఏడీసీగా పని చేశారని ఆమె తెలిపారు. తాను ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవంక, బిల్లులను తాను కూలంకుశంగా పరిశీలిస్తుంటే.. తాను బిల్లులను తొక్కి పెట్టానని బయట తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. బిల్లును తొక్కి పెట్టాలనుకుంటే వివరణ ఎందుకు కోరతానని…