రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మనుగోడు ఉప ఎన్నకల ఫలితాల ద్వారా మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం ప్రత్యక్షంగా, కాంగ్రెస్ తో పరోక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసినా, మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా, ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్ఎస్ 10 వేలకు మించి మెజారిటీ ఓట్లు సాధించలేకపోయిందని సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ సింహంలా సింగిల్ గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకు ఓట్లు సాధించిందని చెప్పారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని చెబుతూ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓడిపోయినప్పడు కుంగిపోవడం, గెలిచినప్పుడు పొంగిపోం అని చెబుతూ బిజెపిని నమ్మి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే…
Author: Editor's Desk, Tattva News
మొదటి నుండి గెలుపు పట్ల ధీమాగా ఉన్న బిజెపి అంచనాలను చౌటప్పాల్, చుండూరు మండలాలు కట్టడి చేశాయి. పట్టణ ప్రాంతాలైన చౌటుప్పల్, చండూరుపై బిజెపి పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అక్కడ కూడా టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పదో రౌండ్‌కే బిజెపి ఆశలు వదులుకుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి గెలుపు మీద ధీమాతో బరిలోకి దిగిన బిజెపికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఐదో రౌండ్ తర్వాత బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దానితో, కమ్యూనిస్టుల సహకారంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,307 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టిఆర్‌ఎస్‌కు 97,003, బిజెపికి 86,696 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,864 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బిఎస్‌పి 4,145 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. మునుగోడులో జోరుగా ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ.పాల్‌కు 805…
తెలంగాణాలో జరిగిన ప్రతిష్టాత్మక మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయింది.మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా, మొదట్లో రెండు రౌండ్లలో తప్ప అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉంటూ వచ్చారు. వరుసగా దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో తమ పార్టీ సీట్లను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం మంత్రులు, 100 మంది పార్టీ ఎమ్యెల్యేలను మోహరింపచేసి ప్రచారం నిర్వహించారు. దేశంలోనే అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన ఎన్నికలలో ఒకటిగా మిగిలింది. టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు పోటీపోటీగా ధనం వెదజల్లారు. అయితే, పోలింగ్ ముందు రోజులలో బిజెపి ప్రచారాన్ని కట్టడి చేయడంలో, ప్రజల దృష్టిని ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంవైపు మళ్లించడంలో విజయం సాధించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పీఏని ఈడీ అరెస్ట్ చేసింది. అతడు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. శనివారం ఈడీకి చెందిన ప్రత్యేక బృందం ఈస్ట్ ఢిల్లీ మండవ్లీలోని సిసోడియా పీఏ దేవేంద్ర శర్మ అలియాస్ రింకూ ఇంట్లో తనిఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించింది. అయితే దర్యాప్తు సమయంలో రింకూ సహకరించకపోవడంతో అతడిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి దాకా ఈడీ వందకు పైగా సోదాలు జరిపింది. ఆప్ మంత్రి సత్యేంద్రజైన్, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్లను విచారించి అరెస్ట్ చేసింది. తన పీఏ రింకూను ఈడీ అరెస్ట్ చేసిందంటూ మనీశ్ సిసోడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి భయం పట్టుకుందని ఆరోపించారు. ‘‘తప్పుడు…
త్వరలోనే దేశంలో విక్రయిస్తున్న డ్రగ్స్‌పై బార్‌కోడ్ ముద్రించనున్నారు. నకిలీ, నాణ్యతలేని డ్రగ్స్ తయారీ, సరఫరా, అమ్మకాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై జూన్‌లో ఫీడ్ బ్యాక్‌ను, సూచనలు కోరుతూ ముసాయిదా గెజిట్‌ను విడుదల చేసింది. మొత్తం 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్‌కోడ్ ముంద్రించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. బార్‌కోడ్‌లో మాన్యూఫ్యాక్చరింగ్ లైసెన్స్, బ్యాచ్ నెంబర్ , జనిటిక్ పేరు, డ్రగ్ పేరు, బ్రాండ్ పేరు, తయారు చేసిన కంపెనీ పేరు, చిరునామా, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వివరాలు కస్టమర్లు తెలుసుకోవచ్చు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ రూల్స్ 1945కి సవరణలు ఆమోదం పొందిన వెంటనే బార్‌కోడ్ నిబంధన అమల్లోకి రానుంది. వచ్చే సంవత్సరం మే నెల నుంచి బార్‌కోడ్ ముద్రించడం…
పాకిస్థాన్ లేదా చైనా పౌరసత్వంగలవారు ఉత్తర ప్రదేశ్‌లో వదిలిపెట్టిన ఆస్తులను దురాక్రమణల నుంచి కాపాడేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇటువంటి భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. హోం శాఖ పర్యవేక్షణలో వీటి ప్రస్తుత పరిస్థితిపై ఓ నివేదికను రూపొందించబోతోంది. యోగి నేతృత్వంలో శుక్రవారం జరిగిన హోం శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో ఉన్న శత్రు ఆస్తుల పరిరక్షణకు ఈ సమావేశంలో మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ, పర్యవేక్షణల కోసం నోడల్ అధికారిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రాలు, దేశ సరిహద్దుల్లోని గ్రామాలను శక్తిమంతంగా తీర్చిదిద్దవలసి ఉందని యోగి అధికారులకు చెప్పారు. సరిహద్దుల్లోని గ్రామాలు, జిల్లాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాలను సమర్థవంతంగా ప్రచారం చేసి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను, ఎన్‌సీసీ,…
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్నగోవాలోని కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ న్యూన్స్ ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాలో అతను కీలక నిందితుడు. గోవాలోని అంజునా నుండి అతడిని హైదరాబాద్కి తరలించారు. సెప్టెంబర్‌లో బీజేపీ నేత సోనాలి ఫోగట్ మరణం తర్వాత అరెస్టయిన ఐదుగురిలో నన్స్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతను బెయిల్‌పై బయటకు రాగానే తెలంగాణ పోలీసులు గోవా వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఫోగట్ మృతి కేసును సీబీఐ విచారిస్తోంది. మూడు నెలల క్రితం తెలంగాణలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ తర్వాత హైదరాబాద్‌లో పోలీసులు వెతుకుతున్న డజన్ల కొద్దీ డ్రగ్స్ డీలర్లలో న్యూన్స్ కూడా ఉన్నాడు. కరోనా సర్టిఫికేట్‌ను ట్యాంపర్ చేసినందుకు గోవా అంజునాలోని పోలీసుల ముందు లొంగిపోవాలని ఈ వారం ప్రారంభంలో మపుసాలోని అదనపు సెషన్స్ కోర్టు నూన్స్ ను ఆదేశించింది. దీంతో…
గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో) సందీప్‌సిన్హ్ జాలాను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోర్బీ మున్సిపాలిటీ ఒరెవా సంస్థకు 15 ఏళ్లపాటు ఈ వంతెన మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ కేబుల్ వంతెనను పున్ణ ప్రారంభించే ముందు అధికారులకు సమాచారం అందించలేదని జాలా చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మోర్బీ మున్సిపాలిటీ ముఖ్య అధికారి సందీప్‌సిన్హ్ జాలాను రాష్ట్ర పట్టణాభివఅద్ధి శాఖ సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జీటీ పాండ్య వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెసిడెంట్ అదనపు కలెక్టర్‌కు చీఫ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అంతకుముందు గురువారం ఈ…
స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి తుది శ్వాస విడిచే వరకూ బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ ఓటు వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీనిపై దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలని, శ్యామ్ శరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్యామ్ నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ లో 1917 జులై 1న జన్మించారు. 1951 సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. అప్పటి నుంచి ప్రతిసారి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా శ్యామ్ శరణ్…
విపక్ష నేతలు, కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేసిన వాళ్లు మాత్రమే మనవాళ్ళు, వేయని వాళ్లు మన శత్రువులు అనే విధంగా జగన్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. శనివారం మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో పర్యటించిన పవన్ రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఇప్పటం గ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉంటుందని, వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండవని పవన్ తెలిపారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల వెడల్పు రోడ్డు ఉందని, ఇప్పుడు దాన్ని 120 అడుగుల రోడ్డుగా మార్చేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఉవ్విళ్లూరుతున్నారని దుయ్యబట్టారు. రోడ్డు వెడల్పు పేరుతో వారికి ఓటు వేయని వారి ఇళ్లను తొలగిస్తున్నారని చెప్పారు. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్నారని, సామాన్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. ఏపీలో సీఎం జగన్మోహన్…