Author: Editor's Desk, Tattva News

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్వైజరీ బోర్డ్‌ షాకిచ్చింది. రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డ్‌ సమర్థించింది. తనపై పెట్టిన పీడీ యాక్టును ఎత్తేయాలని రాజాసింగ్ కమిటికి విజ్ఞప్తి చేశారు. విచారించిన కమిటీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. రాజాసింగ్‌ బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో ఆయన భార్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 28న హైకోర్టులో విచారణ జరుగనుంది. పీడీ యాక్ట్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. గతంలో రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌‌ ఎత్తివేసే అంశంపై అడ్వైజరీ బోర్డు సమావేశమైంది. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని బోర్డు కు రాజాసింగ్ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్ట్ నమోదు చేసారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. రాజాసింగ్‌ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని తెలిపారు. గతంలో…

Read More

కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్‌ఐఏ దర్యాప్తు కోరింది. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తునకు రికమెండ్‌ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడటంతో స్టాలిన్‌ ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు కోరారు. కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని, కోయంబత్తూర్‌లో కావాల్సిన భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని స్టాలిన్‌ తన లేఖలో కోరారు. ఈ నెల 23న కోయంబత్తూరులోని ఉక్కడంలో ఓ కారులో సిలిండర్‌ పేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పేలుడుకు ముందు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు పలు అనుమానాలు రావడానికి కారణమయ్యాయి. పేలుడులో మరణించిన మొబిన్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు…

Read More

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే అధికారం జగన్‌కి లేదని పేర్కొంటూ విశాఖను స్మార్ట్‌ సిటీ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని, కుటుంబ పార్టీలది కాదని తేల్చి చెప్పారు. వికేంద్రీకరణకు కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని చెబుతూ. రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వీర్రాజు విమర్శించారు. అనంతపురంలో అధిక వర్షాలకు పంట వేసిన రైతులు నష్టపోయారని, చెరువు కట్టలు తెగిపోయి పంటలు పాడయ్యాయని విచారం వ్యక్తం చేశారు. అనంత నగరం వరదల్లో మునిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమసించారు. రూ.20 వేల కుటుంబాలు ముంపుకి గురయ్యాయని, రూ. 30,000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అనంత నష్టంపై ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. విశాఖకు…

Read More

మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, సి ఎల్ పి లీడర్లు హాజరయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికేట్‌ను సోనియా గాంధీ అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. ఒక కార్మికుడి కొడుకు, పార్టీ సాధారణ కార్యకర్త ఈరోజు ఇలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కలలో కూడా ఊహించలేమని ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. తన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు అహర్శిశలూ కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ను కాపాడుకోవడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం మనందరి ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన…

Read More

అయోధ్యలో రామమందిరంలో రామ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 2024 జనవరి నుంచి ప్రజా సందర్శనకు అనుమతించడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఆలయ నిర్మాణ ప్రక్రియ సంతృప్తికరంగా జరుగుతోందని చెప్పారు. మకర సంక్రాంతికి మందిరంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధమవుతుందని, 2024 జనవరి 14 నాటికి రామ్‌లల్లా విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి రూ.1,8000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.  మందిరం మొదటి అంతస్థులో శ్రీ రాముని దేవాలయం ఉంటుంది. మందిరానికి 12 గేట్లు ఉంటె, ప్రధాన ద్వారానికి  `సింగ్ ద్వార్’ అని పేరు పెడుతున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం 400 స్తంభాలు దేవాలయంకు ఉంటాయి. భూకంపాలకు…

Read More

‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలను వివరించే పోస్టర్లను మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి విడుదల చేసింది. జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డితో కలసి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం విడుదల చేశారు. గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిన ముఖ్యమైన హామీలను, ఆ తర్వాత వాటిని గాలికి వదిలేసినా తీరును వీటిల్లో ఎండగట్టారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరోసారి పచ్చి అబద్ధాలు, మోసాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ మండిపడ్డారు. మందు, మాంసం, మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ , సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని పోస్టర్ ద్వారా ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం…

Read More

సిత్రాంగ్‌ తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌ అతలాకుతలమయింది. బెంగాల్‌ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను కారణంగా 35 మంది మృతిచెందారు. సుమారు 10 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు.  తుఫాను ధాటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవండంతో 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లలోనే మగ్గుతున్నారని, 15 ఎకరాల్లో పంట నాశనమయిందని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో ఫిషింగ్‌ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపింది.  విమాన రాకపోకలు నిలిచిపోయాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని పేర్కొన్నది.  తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6925 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశామని వెల్లడించింది.  కాగా, తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే…

Read More

మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ హయాంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుతానని, ఆర్థిక సుస్థిరత, విశ్వాసం కల్పించడమే తమ ప్రభుత్వ ఏజెండా అనిహన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తక్షణం తమ ప్రభుత్వ పనితీరు మొదలవుతుందని ఆయన వెల్లడించారు. మంగళవారం బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత అధికార నివాసరం డౌనింగ్‌ స్ట్రీట్-10 నుంచి రిషి సునాక్‌ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్తిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అంతటా ప్రొఫెషనలిజంతో కూడిన అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక సుస్థిరత తీసుకొస్తానని పేర్కొన్నారు. ఇంతకుముందు బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ప్రజలను, వ్యాపారాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నానని సునాక్ గుర్తు చేశారు. ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక సంక్షోభం…

Read More

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన  రిషి సునాక్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్‌ రాజీనామా చేయడం, వెంటనే రిషి సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టడం అంత లక్షణాలలో జరిగి పోయాయి.  రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో రిషి సునాక్ పిలుపునిచ్చారు. లిజ్ ట్రస్‌.. తన అధికారిక నివాసం 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో చివరి క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. అటుపై తన రాజీనామా లేఖను రాజు చార్లెస్‌-3కి సమర్పించారు. దీంతో బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ప్రమాణం చేసేందుకు మార్గం సుగమమైంది. చివరి క్యాబినెట్‌ భేటీ తర్వాత లిజ్ ట్రస్ మాట్లాడుతూ రిషి సునాక్‌ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంచి రోజులు ముందు ఉన్నాయన్నారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార…

Read More

ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నారు.కోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది.ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 20న ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతించింది.  విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఎంఎంటీసీ నుంచి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి తరలించారన్న అంశంపై ఆరా తీయనున్నారు. దీంతో పాటు ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపైనా సుఖేష్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఎంఎంటీసీకి రూ.504 కోట్ల రుణం ఎగవేత కేసుకు సంబంధించి ఈడీ సుఖేష్ గుప్తాను ఈ నెల 17న అరెస్ట్ చేసింది.…

Read More