Author: Editor's Desk, Tattva News

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు సుమారు రెండు గంటల సేపు నిలిచిపోవడంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు. సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో తమ డేటా బ్యాలెన్స్ అయపోయిందేమోనని చెక్ చేసుకున్నారు. ట్విట్టర్‌లో వాకబు చేసుకున్నారు. అందరికీ అదే సమస్య ఉందని తెలుసుకుని కుదుటపడ్డారు. సేవలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన వాట్సాప్ వెంటనే సమస్యను కనిపెట్టేందుకు ప్రయత్నించింది. చివరికి 2.21 గంటల తర్వాత సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అయితే, సేవలు నిలిచిపోవడానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి సేవలు నిలిచిపోయినట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలిసింది. గ్రూపుల్లో మెసేజులు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజులు పంపిస్తే బ్లూటిక్‌ రావడం లేదని పలువురు వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్‌ వెబ్‌కి కనెక్ట్‌ చేస్తున్నప్పుడు ‘కనెక్టింగ్‌’ అని కొన్నిసార్లు, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేదు అని కొన్నిసార్లు వస్తున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. సేవల అంతరాయంపై వాట్సాప్‌…

Read More

భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి, 42 ఏళ్ళ రిషి సునాక్ బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. రవి అస్తమించని సామ్రాజ్యం నెలకొల్పుకున్న బ్రిటన్ వందల ఏళ్ళు భారత దేశాన్ని వలస రాజ్యంగా మలచుకొని, వెనుకకు మళ్ళిన 75 ఏళ్ళ తర్వాత నేడు ఓ భారత సంతతి వ్యక్తి ఆ దేశాధినేత కావడం గమనార్హం. ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ (టోరీ)కి చెందిన ఎంపీల్లో సగానికిపైగా ఎంపీల మద్దతు రుషి సునాక్‌కు లభించింది. 188 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన తదుపరి బ్రిటన్ ప్రధాన మంత్రిగా నియమితుడయ్యారు. అంతకుముందు ఆయనకు పోటీదారుగా నిలిచిన పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా పోటీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రుషి సునాక్ సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పాలైన…

Read More

తమిళనాడు కోయంబత్తూర్‌ నగరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్‌ సిలిండర్‌ పెట్టడానికి ముబిన్‌ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్‌ తీసుకుని వస్తున్న నలుగురు యువకుల వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. కోయంబత్తూర్‌ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ ప్రారంభించారు. పేలుడుకు రసాయనాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో జమేషా ముబిన్‌ (25) మరణించాడు. గతంతో 2019లో ముబిన్‌ను ఎన్‌ఐఏ విచారించింది. ముబిన్‌ ఇంటిలో పొటాషియం నైట్రేట్‌, అల్యూమినియం పౌడర్‌, బొగ్గు, సల్ఫర్‌, నాటు బాంబుల తయారీకి అవసరమయ్యే పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముబిన్‌ ఇంటిలో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు.  తమిళనాడు డీజీపి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే మరో నలుగురు యువకులు…

Read More

దేశ సైనికులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కార్గిల్ లో జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులకు ప్రధాని మోదీ స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు. దేశ సైనికుల శౌర్యం అనంతం. జవాన్లతో కలిసి పండుగ జరుపుకోవడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి తాము అనుకూలమని కార్గిల్‌ సైనికులతో ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని దాన్ని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగిస్తుందని…

Read More

ఉద్వేగ భరితంగా జరిగిన టి20 ప్రపంచకప్‌ పోరులో ఆదివారం భారత్ దయాదిదేశం పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించి శుభారంభం చేసింది. మాజీ కెప్టెన్ విజృంభించి ఆడి భారత్ కు విజయం తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఆటలో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) అద్భుతమైన ఆటతీరుతో ఓటమి నుంచి విజయ తీరాలకు చేర్చాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటిం గ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలు పొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు.…

Read More

మునుగోడులో ధర్మయుద్దం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయాలని మనుగోడు ప్రజలను కోరారు.  హైదరాబాద్ లోని నాగోల్ అనంతుల గార్డెన్స్ లో మనుగోడు ప్రజలతో బీజేపీ నిర్వహించిన ‘‘ఆత్మీయ సమ్మేళనం’’లో మాట్లాడుతూ   టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందని విమర్శించారు.  రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నయ్ అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందని ధ్వజమెత్తారు.  మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కడా పోటీ చేయడం లేదని, ప్రచారానికి వెళితే మహిళలు తలుపులు మూసుకునే పరిస్థితి…

Read More

లడఖ్‌, కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్‌తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్‌ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ, ప్రభుత్వంపై జిన్‌పింగ్‌ పట్టు సాధించడం ఈ దిశగా విస్పష్ట సంకేతాలు పంపిందని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. తైవాన్‌పై డ్రాగన్‌ దూకుడుగా వెళ్లినా అమెరికా కారణంగా అక్కడ చైనా సాధించేదేమీ లేదని ఆయన చెప్పారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి లడఖ్‌, కశ్మీర్‌ను వశం చేసుకునే లక్ష్యంతో ముందుకెళుతుందని హెచ్చరించారు. అదే జరిగితే అమెరికా మనకు ఎలాంటి సాయం చేయదని పేర్కొంటూ అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని, ఆత్మనిర్భర్‌ అంటూ స్వామి ట్వీట్‌ చేశారు. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా చైనా అధికారిక మ్యాప్‌లను విడుదల చేయడంపై స్వామి ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ మ్యాప్‌ల్లో లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లను చైనా…

Read More

దేశవిదేశాల్లో 7వ ఆయుర్వేద దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రజలందరికి ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలు తెలియజేసి ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని “హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరు వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ దాదాపు 25 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విదేశాంగ శాఖ సహకారంతో దేశం వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు, మిషన్లలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ 5000 కి పైగా కార్యక్రమాలు నిర్వహించింది. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి …

Read More

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిపి), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జిసిటి)కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించిన కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 2020లో హోం శాఖ ఏర్పాటు చేసిన అంతర్‌మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఎ లైసెన్సు తప్పనిసరి. ఈ ట్రస్టులకు సంబంధించిన ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణీ (పిఎంఎల్‌ఎ) వంటి నేరాలను మంత్రిత్వకమిటీ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం జులై 2020లో ఏర్పాటు చేసింది. ఆదాయపన్ను, పీఎంఎల్‌ఎ, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు రావడంతో…

Read More

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు మునుగోడు లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నెల 31 న మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు  జెపి నడ్డా పాల్గొంటున్నారు.  అంతకు ముందు రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ జరుగనున్నది. పైగా, ఆ మరుసటి రోజు,  నవంబర్ 1 ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. దానితో ఈ బహిరంగ సభ ద్వారా బిజెపి బాల  ప్రదర్శనకు దిగనున్నది. అప్పులపాలైన తెలంగాణను గాడిన పెట్టాలంటే బీజేపీతోనే సాధ్యం అని పేర్కొంటూ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ చెప్పారు. ప్రజల బతుకులు మారాలంటే సీఎం కేసీఆర్​ను గద్దె దింపాలని, టీఆర్ఎస్​ను బొంద పెట్టాలని ఆయన పిలుపిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది…

Read More