లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ నిర్మాత సాజిద్‌ఖాన్‌ను బిగ్‌బాస్ నుంచి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. అయితే, అప్పటి నుంచి రేప్ చేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. సాజిద్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ నుంచి బెదిరింపులకు దిగుతూ తమను తమ పని చేయకుండా ఆపాలనుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలంటూ ఆమె ట్వీట్ చేశారు. మీటూ ఉద్యమం సందర్భంగా పది మంది మహిళలు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను గతంలో చేశారు. ఈ క్రమంలోనే సాజాద్ ఖాన్‌పై వచ్చిన ఫిర్యాదులు, అతని అసహ్యకరమైన మనస్తత్వాన్ని చూపుతుందని, తప్పుడు వ్యక్తికి బిగ్‌బాస్‌లో చోటు కల్పించారని పేర్కొంటూ అతన్ని…
Author: Editor's Desk, Tattva News
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓ విద్యార్థిని మాదిరిగా పరిశోధన చేసి, ఆ పరిశోధనా పత్రాన్నిఉస్మానియా వర్సిటీకి సమర్పించి పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన సీతక్క ఆ అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. పొలిటికల్ సైన్స్‌లో ఆమె పూర్తి చేసిన ఈ పరిశోధనకే ఆమెకు వర్సిటీ అధికారులు మంగళవారం పీహెచ్‌డీ పట్టాను అందించారు. ఈ సందర్భంగా తన పిహెచ్‌డి పట్టా సమర్పించి డాక్టరేట్ అందుకున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలతో, అభిమానులతో పంచుకున్నారు. ‘తుపాకీ పట్టి అడవిలో నక్సలైట్ లా తిరుగుతా అని ఎప్పుడూ అనుకోలేదు.. నక్సలైట్ గా ఉన్నప్పుడు లా చదివాను. లా పూర్తి చేసి లాయర్ అవుతా అని కూడా అనుకోలేదు. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఉద్యమ ప్రతినిధిగా ఉండిపోతా అనుకున్నా. కానీ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా ప్రతినిధిని చేశారు. ప్రజల సమస్యల…
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం వేగంగా దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రెండో ప్రపంచ జియో స్పేషియ ల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని వర్చువల్ గా పాల్గొని ప్రసంగిస్తూ పర్యాటకం , అతిథ్యం, సాంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే హైదరాబాద్‌లో సదస్సులు జరగడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. జియోస్పేషియల్‌తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతూ మనమంతా జియోస్పేషియల్‌లో చేరామని, ఈ సెక్టారులో సమ్మిళిత అభివృద్ది కనిపిస్తోందని చెప్పారు. డ్రోన్ల ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తిస్తున్నామని తెలిపారు. పిఎం గతి శక్తి ద్వారా అత్యాధునిక మౌలిక సదుఉపాయాలు కల్పించాలని సంకల్పించామని వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారానే దీన్ని చేయబోతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజి , ఎర్త్‌సైన్స్ శాఖల మంత్రి డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇండియా జియోస్పేషియల్ రంగంలో 2025నాటకి 12.8శాతం ఆదాయ వృద్ధితో 63100కోట్లకు చేరుకోగలదని…
విశాఖ భూ దోపిడీలో గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ పోటీపడుతున్నాయని పేర్కొంటూ ఈ సమస్యకు న్యాయపోరాటం ద్వారా పరిష్కారం తీసుకొచ్చేలా కేసులు వేసే విషయంపై అధ్యయనం చేస్తున్నట్టు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు వెల్లడించారు. దస్పల్లా భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఆ భూములున్నాయని ప్రభుత్వం ఓవైపు చెబుతూనే వాటిని ప్రైవేట్ భూములుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విస్మయం వ్యక్తం చేశారు. నిజానికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చాయంటే అవి ప్రైవేట్ భూములు ఎలా అవుతాయని ప్రశ్నించారు. తమవారికి దోచిపెట్టడం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ సైతం ఇలాగే వ్యవహరించిందని, ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మరీ తమవారికి భూములు పంచిందని విమర్శించారు. విశాఖ భూ దోపిడీపై తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక సిట్, ప్రస్తుత వైస్సార్సీపీ హయాంలో ఒక సిట్ ఏర్పాటయ్యాయని, ఈ…
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ చెప్పుకుంటున్న తెలంగాణ గడ్డ మీద ఒక్కో ఎంపీటీసీ పరిధిలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. మునుగోడులో ప్రస్తుతమున్న పరిస్థితిని చూసి గొర్ల మందల మీద తోడేళ్లు పడ్డట్టు అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో మునుగోడు ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ‘‘టీఆర్ఎస్ కు వంతపాడే విష పుత్రికలు హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో 6 నెలల పాటు దుష్ప్రచారం చేశాయి. మునుగోడులో మరో 20 రోజులు ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆ మీడియా సంస్థలు కొనసాగించే అవకాశం ఉంది. మునుగోడు ప్రజలు తప్పుడు ప్రచారాన్ని…
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాలు మరింత తీవ్రం కావచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిపుణులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యుఎన్‌డిపి) అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అంచనా ప్రకారం ప్రపంచ పేదల్లో సగానికి పైగా నివసిస్తున్న 54 దేశాలకు పేదరికాన్ని ఎదుర్కొనేందుకు తక్షణమే రుణ ఉపశమనం కలిగించాలని పేర్కొంది. పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన సాయం అందించాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని, మరింత అధ్వాన్నంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.శ్రీలంక, పాకిస్థాన్, చాద్, ఇథియోపియా, జాంబియాలు రుణసంక్షోభాల్లో కూరుకుపోవడంతో ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్‌లో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఇదే సమయంలో యుఎన్‌డిపి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. రుణాలను రద్దు చేయడం, చాలా…
ఆదిపురుష్ చిత్ర బృందానికి, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవలే విడుదల కాగా, పలు వర్గాలు టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఆ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోరింది. తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు హీరో ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ చిత్ర బఅందానికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆదిపురుష్ టీజర్ విడుదలయినప్పటి నుండి విపరీతంగా ట్రోల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే…
రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త పేర్లను కేటాయించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును కేటాయించింది. ఠాక్రే నేతృత్వంలోని సేనకు ఎన్నికల సంఘం పార్టీ చిహ్నంగా కాగడ (మషాల్) ను కేటాయించింది. అయితే షిండే వర్గానికి మాత్రం పార్టీ గుర్తును ఇంకా కేటాయించలేదు. దానికి బదులుగా మంగళవారం ఉదయం 10 గంటలలోపు మూడు తాజా ఆప్షన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని కోరింది. అంతకుముందు, రెండు వర్గాలు ప్రతిపాదించిన గదా, త్రిశూలం మతపరమైన చిహ్నాలు కావడంతో ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించింది. రాజకీయ పార్టీలకు మతపరమైన చిహ్నాలను కేటాయించడాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించింది. ముంబైలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నిక కోసం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవలసిందిగా భారత ఎన్నికల సంఘం ఠాక్రే,…
ఆసరా పింఛన్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా కోతపెడుతోందని, వివిధ కారణాలను చూపుతూ పింఛన్ పొందేందుకు అనర్హులంటూ ఫించన్ పంపిణీ ఆపేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పేద ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. ఆసరా పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని మళ్లీ తీసేస్తున్నరని ఆమె మండిపడ్డారు. అప్లికేషన్లు తీసుకున్న మూడున్నరేండ్ల తర్వాత ఇటీవల పింఛన్లు శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులకే అనర్హులున్నారని కట్ చేస్తుండడంతో ఏం చేయాలో లబ్ధిదారులకు తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నరని ఆమె తెలిపారు. మూడెకరాల భూమి, సొంత కారు ఉన్న వారి వివరాలను సీసీఎల్ఏ, ఆర్టీఏ ఆఫీసుల నుంచి తీసుకున్న అధికారులు ఏరివేత ప్రక్రియ చేపట్టారు. అయితే క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా తొలగిస్తుండడంతో అర్హులైన వారు కూడా పింఛన్లు కోల్పోతున్నరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో గతంలో మొత్తం 1,23,006 మంది ‘ఆసరా’ లబ్ధిదారులున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత…
పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్లు మలేషియా ప్రధాని ఇస్మాయిల్ సబ్రి యాకుబ్ సోమవారం ప్రకటించారు. పార్లమెంట్ గడువు ముగియడానికి ఇంకా తొమ్మిది నెలలు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంట్ రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నవంబర్‌లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ నేతృత్వంలోని యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్(యుఎంఎన్‌ఓ) ఇతర పార్టీలతో కలసి ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే తన భాగస్వామ్య పక్షాలతో పొసగని కారణంగా ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో తన సత్తా చాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యుఎంఎన్‌ఓ ఆలోచిస్తోంది. ఆదివారం మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్లాన్ అహ్మద్ షాను కలుసుకున్న ఇస్మాయిల్ పార్లమెంట్ రద్దుకు ఆమోదాన్ని కోరారు. 2018 ఎన్నికల తర్వాత ఏర్పడిన మూడవ ప్రభుత్వం చట్టబద్ధతపై విమర్శలు వస్తున్న దృష్టా తాజాగా ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతించాలని ప్రధాని ఇస్మాయిల్ సుల్తాన్‌ను కోరినట్లు తెలుస్తోంది. దేశంలో సుస్థిర,…