Author: Editor's Desk, Tattva News

అర్థంపర్థంలేని ఎన్నికల హామీలు ఇచ్చే ఇచ్చే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమీషన్ ఝలక్‌ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీలు చేసే రాజకీయ పార్టీలు వాటికి నిధులు ఎలా సమకూరుస్తాయో కూడా తెలియజేయాలన్న ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనతో ఓటర్లకు హామీలు ఇచ్చే పార్టీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని తెలిపింది. అక్టోబర్‌ 19లోగా ఈ ప్రతిపాదనపై స్పందించాలని, మార్పులు సూచించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో పేర్కొంది. ఏ వాగ్దానాల అమలు సాధ్యమవుతుందో అవే ఓటర్ల విశ్వాసం పొందాలని తాము భావిస్తున్నామని ఆలేఖలో పేర్కొంది. మానిఫెస్టోలను రూపొందించడం రాజకీయ పార్టీల హక్కు అనే వాదనతో తాము ఏకీభవిస్తున్నప్పటికీ.. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించడం అత్యవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై తమకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను…

Read More

జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే దేశంలోనే ఒక భాష మాట్లాడే వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి కానుంది. ఇది జరగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి. జస్టిస్ శర్మన్ కమిషన్ గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని, అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. “ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్‌ శర్మ కమిషన్‌ సూచించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం చర్చలు ముగిశాక రిజర్వేషన్లు కల్పిస్తాం” అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎస్టీ కోటా కింద గుజర్లు, బకర్వాల్‌లు రిజర్వేషన్లు పొందుతున్నారు. పహాడీలకు…

Read More

రిలయన్స్ జియో 5 జీ సేవలు నేటి నుండి అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమైంది. ఈ 5 జీ సేవలను కూడా లిమిటెడ్‌ యూజర్లకు మాత్రమే అందిస్తుండటం విశేషం. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్‌ జియో సంస్థ తెలిపింది. జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5 జీ సేవలు అందుబాటులోకి రావని పేర్కొంది. ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్‌కం ఆఫర్‌’ అంటూ ఇన్విటేషన్‌ పంపించారు. ఈ 5 జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్‌గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5 జీ సేవలు అందుతాయి.  ర్యాండ్‌మెగా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్‌సెట్‌,…

Read More

జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. జమ్మూలోని తన ఇంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతుండడంతో తన స్నేహితుడైన రాజీవ్ ఖజురియా ఇంట్లో హేమంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. హేమంత్ హత్య తర్వాత ఆయన ఇంట్లో పనిచేసే సహాయకుడు అదృశ్యమయ్యాడని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముకేశ్ సింగ్ తెలిపారు. కనిపించకుండా పోయిన ఆ సహాయకుడిని యాసిర్‌గా గుర్తించినట్టు తెలిపారు. అతడిది జమ్మూకశ్మీర్‌లోని రాంబాన్ జిల్లా అని పేర్కొన్నారు. అతడి కోసం వేట మొదలుపెట్టినట్టు చెప్పారు. 57 ఏళ్ల లోహియా 1992 ఐపీఎస్ అధికారి. నిన్న ఆయన తన ఉడాయివాలా…

Read More

దుబాయ్ లో కొత్త హిందూ దేవాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జబెల్ అలీలోని దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్ లో నిర్మించిన ఈ ఆలయాన్ని దసరా సందర్భంగా ఓపెన్ చేయాలని నిర్వాహకులు భావించారు. ఈ నేపథ్యంలో నేడు ఈ గుడిని తెరవనున్నారు. అయితే ఈ రోజు ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే అని, అక్టోబర్ 5 అంటే రేపు, దసరా రోజులన వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఇంతకు మునుపే నిర్వాహకులు ప్రకటించారు. మరింత సమాచారం కోసం http://hindutempledubai.com ను సందర్శించవచ్చని తెలిపింది. ఈ ఆలయంలో మొత్తం 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఆలయంలో వివాహాలు, ప్రైవేటు ఈవెంట్లు చేయడానికి తగిన సౌకర్యాలనూ నిర్వాహకులు కల్పించారు. వీటితో పాటు ఈ హిందూ దేవాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు ఎల్సీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ఆలయ తలుపులను…

Read More

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్‌లోని మొకామ, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), హర్యానాలోని ఆదంపూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్, ఒడిశలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 7న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 6న వోట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. సిట్టింగ్ శాసనసభ్యులు మరణించడంతో అంధేరి(తూర్పు), గోలా గోరఖ్‌నాథ్, గోపాల్‌గంజ్, ధామ్‌నగర్ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక కేసులో దోషిగా తేలిన దరిమిలా సిట్టింగ్ ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడడంతో మొకామ స్థానానికి ఖాళీ ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేయడంతో ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి…

Read More

స్వీడిష్ జ‌న్యుశాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్య‌రంగంలో నోబెల్ బ‌హుమ‌తి ల‌భించింది. నోబెల్ ప్రైజ్ క‌మిటీ సోమవారం ఆయ‌న‌కు నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. అంత‌రించిన మాన‌వ‌జాతుల విశ్వ‌జ‌న్యురాశిపైన‌, మాన‌వ ప‌రిణామంపైన చేసిన విశేష పరిశోధ‌న‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న‌ను ఈ అత్యున్న‌త పుర‌స్కారం వ‌రించింది. స్వాంటే తండ్రి సూనే బెర్గ్‌స్ట్రామ్‌కు 1982లో వైద్య‌రంగంలో నోబెల్ బ‌హుమ‌తి ల‌భించింది. వైద్యరంగ నోబెల్ బ‌హుమ‌తిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుగా ప‌రిగ‌ణిస్తారు. స్వీడ‌న్‌లోని క‌రోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఈ అవార్డు విజేత‌ను ఎంపిక చేస్తుంది. ప్ర‌తి ఏడాది డిసెంబ‌ర్ 10న ఈ అవార్డును ప్ర‌దానం చేస్తారు. ఈ అవార్డు విలువ 10 మిలియ‌న్ స్వీడిష్ క్రోన్‌లు. అంటే 9,00,357 అమెరిక‌న్ డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో సుమారుగా 7.20 కోట్లు. స్వాంటే పాబో ప‌రిశోధ‌న‌లు పూర్తిగా నూత‌న శాస్త్రీయ క్ర‌మ‌శిక్ష‌ణ వేగాన్ని పెంచాయి. అంతరించిన మాన‌వ‌జాతులకు, ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచ మాన‌వాళికి మ‌ధ్య‌గ‌ల జ‌న్యుప‌ర‌మైన బేధాల‌ను ఆయ‌న త‌న…

Read More

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌)  ‘ప్రచండ్‌’ను భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ  దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. ఎల్‌సీహెచ్‌ ఇండక్షన్‌కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదని పేర్కొన్నారు. మొదటగా, 15 హెలికాప్టర్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయగా పది ఐఏఎఫ్‌కు, మరో ఐదు భారత సైన్యం కోసం కేటాయించనుని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీ, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఇతర సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత  నాలుగు హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని ‘ప్రచండ్‌’ ఎల్‌సీహెచ్‌లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు.    ‘ప్రచండ్‌’…

Read More

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ చిన్నగోపురం వద్ద ముఖ్యమంత్రి తలకు పరివేష్టాన్ని అధికారులు చుట్టారు. తొలుత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. పంచెకట్టులో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను జగన్మోహన్‌రెడ్డి సమర్పించారు. అనంతరం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, లక్షలాది మంది యాత్రికులు దర్శనానికి రావడంతో అధికారులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుండే దర్శనానికి అవకాశం కల్పించారు. పట్టువస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి వస్తే దర్శనాలను 15 నిమిషాల పాటు నిలిపివేస్తుంటారు.…

Read More

కరోనా కారణంగా, ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలనా వచ్చిన కారణంగా భారత్ లో చదువుతున్న ఆఫ్ఘానిస్తాన్ విద్యార్థుల విశాలకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వారికి భరోసా కల్పించారు. ఈ విషయంలో భారత్‌పై పూర్తి నమ్మకం ఉంచాలని ఆయన వారికి సూచించారు. భారత్‌లో విద్య కోసం విద్యార్థుకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తారా? అనే ప్రశ్నకు జైశంకర్‌ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వడోదరలో ‘రైజింగ్‌ ఇండియా అండ్‌ ది వరల్డ్‌’ అనే అనే కార్యక్రమంలో జైశంకర్‌ను వీసాల కోసం అలీ ఇర్ఫాన్‌ అనే ఆఫ్ఘనిస్తాన్‌ విద్యార్థి ప్రశ్నించారు. కరోనా కారణంగా కళాశాలను మూసివేడంతో భారత్‌లో చదువుకుంటున్న సుమారు 2,500 మంది ఆఫ్ఘనిస్తాన్‌ విద్యార్థులు స్వదేశం వెళ్లారని, అయితే అక్కడ తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పాటుకావడంతో తిరిగి భారత్‌కు మళ్లీ రాలేకపోతున్నారని చెప్పారు. వీళ్ల వీసాలను రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి జైశంకర్‌ సమాధానం ఇస్తూ ‘మేం ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో రాయబార…

Read More