Author: Editor's Desk, Tattva News

వచ్చే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని రాష్ట్రంలోని 175సీట్లను కూడా గెలుచుకుంటామని భరోసా వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్కలు తప్పుతున్నాయా? ఆయనే స్వయంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొంతమందితో సహా 27 మంది ఎమ్యెల్యేలు తిరిగి గెలుపొందే అవకాశం లేదని తేల్చి చెప్పేయడంతో పలువురు అధికార పక్ష నేతలు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. గెలుపొందగల అవకాశాలు గలవారికి మాత్రమే సీట్లు ఇస్తామని స్పష్టం చేస్తూ మంత్రులైనా, ఎంతటి ముఖ్యనేతలైనా పనితీరు బాగాలేని పక్షంలో సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని అంటూ ఓ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే సీటు ఎవ్వరికీ ఇవ్వడం లేదు చెబుతానని కూడా వెల్లడించారు. నవంబర్ లో మరోసారి సమీక్ష చేస్తానని చెబుతూ పనితీరు మెరుగు పరచుకోలేని పక్షంలో వారికి తిరిగి సీట్ ఇవ్వడం సాధ్యం కాదని అంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం సీట్లలో పాగా…

Read More

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. బిపిన్ రావత్ మరణంతో ఆర్మీలో దాదాపు 40ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన చౌహాన్ను కేంద్రం సీడీఎస్ గా నియమించింది. 2021లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా మండలి సలహాదారుడిగా కొనసాగుతున్నారు. అనిల్ చౌహన్ 1967 మే 18న జన్మించారు. 1981లో 11 గుర్ఖా రైఫిల్స్ లో చేరారు. 2019 సెప్టెంబర్ నుంచి ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రిటైర్ అయ్యే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులను నిరోధించడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. సైన్యంలో తన సేవలకు గానూ చౌహాన్ పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు పతకాలను అందుకున్నారు. త్రివిధ దళాలను ఏకతాటిపైకి తేవాలన్న…

Read More

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రారంభించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో లతా మంగేష్కర్ చౌరహాను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున రూ. 7.9 కోట్ల అంచనా వ్యయంతో ఒక కూడలిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కూడలి వద్ద 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో 14 టన్నుల బరువైన ఒక వీణను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడంతోపాటు తన గాత్రం ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించిన లతా మంగేష్కర్ ను నిరంతరం స్మరించుకోవాలన్న సత్సంకల్పంతోనే అయోధ్యలో ఈ వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. పాటలకు ప్రాణం పోయడం ద్వారా…

Read More

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఇదివరకే రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రద్దు ఆలోచన లేదని , అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నవి కేవలం పుకార్లేనని తెలిపారు. రైల్వే జోన్‌ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని, భూసేకరణ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. అయితే విశాఖ జోన్‌ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని ప్రకటించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారంగా చూస్తే ఇక త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయంపై బీజేపీ…

Read More

అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో సదుపాయాల మెరుగుదలకు, ప్రయాణికుల సౌలభ్యానికి ఏర్పాట్లు దిశలో చర్యలు చేపడుతారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునికంగా రూపొందించేందుకు డిజైన్ కూడా తయారు చేశారు. ఇప్పటికే దేశంలో 199 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు పనులు తలపెట్టారు. 47 స్టేషన్లకు సంబంధించి టెండర్లను పిలిచారు. 32 స్టేషన్లలో పనులు వేగంగా సాగుతున్నాయి, మాస్టర్ ప్లానింగ్, డిజైనింగ్ పనులు గురించి ఆలోచిస్తున్నారని కేబినెట్ భేటీ తరువాత రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతిస్టేషన్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన ఏర్పాట్లు గురించి నిర్ధేశించారు. విశాలమైన రూఫ్ ప్లాజా తప్పనిసరి. ఇందులో వివిధ స్టాల్స్‌కు వసతి ఉండాలి, కెఫెటెరియా, విశ్రాంతి వినోద సౌకర్యాలు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. నగరానికి ఇరువైపులా అనుసంధానం అయ్యేలా స్టేషన్ ఏర్పాటు ఉండాలి. రైల్వే ట్రాక్‌లకు ఇరు…

Read More

కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఉచిత రేషన్ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత గడువు సెప్టెంబరు 30తో ముగియనుండటంతో మరో మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణం, రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించాలని మోడీ సర్కారు నిర్ణయించింది. దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ. 44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది. డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పేద, మధ్యతరగతి…

Read More

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏపీఏ చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించినట్లు సమాచారం. సంస్థపై నిషేధం ఉండటంతో… పీఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ సంస్థ కార్యకలాపాలపై ఎన్‌ఐఐ దాడులు ఉద్ధృతం కావించడం తెలిసిందే. మంగళవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈడీతో కలిసి ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పిఎఫ్‌ఐతో సంబంధాలు ఉన్న 150 మందికి పైగా కార్యకర్తలను నిర్బంధించారు. గత వారం రోజులలో ఈ దాడుల్లో మూడోసారి కావడం గమనార్హం. మూడోసారి ఉత్తర…

Read More

ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని టీఆర్ఎస్ సర్కార్ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ ఆరోపించారు. మూతపడిన రామగుండం ఫెర్టిలైజర్ ను మోదీ ప్రభుత్వం పునరుద్ధరిస్తే అందులోని ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా టీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన డా. .లక్ష్మణ్. ‘‘ప్రజా గోస – బిజెపి భరోసా’’ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ లో బైక్ ర్యాలీలో పాల్గొని, హమాలీవాడలో బిజెపి జెండాను ఎగరేశారు. ఎన్టీఆర్ నగర్ లో వరద బాధితులను పరామర్శించారు. ఐబీ చౌరస్తా వద్ద బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పౌరసన్మానంలో ప్రసంగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాలకు ఒక్క ఎకరాకు అదనంగా నీరు రాలేదని, కానీ వరదల్లో మాత్రం ఈ చుట్టుపక్క ప్రాంతాలు…

Read More

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. ప్రస్తుతం యు ట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలో సొంత మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ సోమవారం తెలిపారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ సేన వర్సెస్ పేన కేసుపై జరిగింది. మహారాష్ట్రలో షిండే వర్గం తిరుగుబాటు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తర్వాత నెమ్మదిగా ఇతర ధర్మాసనాల విచారణలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాట్లు…

Read More

దివంగత జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు దేశ ప్రజలతో పాటుగా ప్రపంచ దేశాల నేతలు మంగళవారం ఘనంగా తుది వీడ్కోలు పలికారు. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, జపాన్ యువరాజు అకిషినో సహా ప్రపంచ దేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒక వ్యక్తి అబేను తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇపటికే అబే కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా మంగళవారం తుది వీడ్కోలు పలికింది. అబే సతీమణి చితాభస్మం ఉన్న కలశాన్ని టోక్యో హాలుకు తీసుకు రావడంతో అంత్యక్రియలు కార్యక్రమం మొదలైంది. అక్కడ వేలాది మంది ఆయనకు తుది నివాళి అర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని అందుకున్నారు. జపాన్‌లో అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకున్న రెండో నేతగా…

Read More