ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందని పేర్కొంటూ, ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ.. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని విచారం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని, కానీ,…
Author: Editor's Desk, Tattva News
ఎంఐఎం కనుసన్నల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ. పీఎఫ్ఐతో టీఆర్ఎస్ కు సంబంధముందని, టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.టిఆర్ఎస్ అండదండలతోనే తెలంగాణాలో ఈ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింప చేసుకోగలుగుతుందని ఆరోపించారు. ప్రజా సంగ్రామం పాదయాత్ర ప్రారంభమై వంద రోజులు పూర్తయిన సందర్భంగా నాగోల్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందని తెలిపారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి కేసీఆర్ సర్కార్ కు సోయి లేదని సంజయ్ ద్వజమెత్తారు. ఎంఐఎం ఆగడాలను బీజేపీ మాత్రమే అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలనే కుట్ర ఇటీవల బిహార్‌లో బయటపడిందని, ఇది పీఎఫ్ ఐ లాంటి సంస్థల పనేనని స్పష్టం చేస్తూ ఎంఐఎం కనుసన్నల్లో పీఎ్‌ఫఐ…
తెలుగు వారికే గౌరవం తెచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఇంతలా అవమానిస్తే, తెలుగువారు అన్నవారు ఎవరు కూడా మన పార్టీకి (వైసీపీకి) ఓటు వేయరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. టిడిపిని అభిమానించని వారు కూడా, రాజకీయాలకతీతంగా ఎన్టీ రామారావు అభిమానిస్తారని ఆయన గుర్తు చేశారు. “మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్ అభిమానే”నని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అయ్యిందేదో… అయ్యింది, ప్రజా నిర్ణయం మేరకు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించాలని ఆయన హితవు చెప్పారు. లేకపోతే 175 స్థానాలకు 175 స్థానాలలో ఓటమి చెందడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులను అప్పు పేరిట కొట్టివేసిన తమ ప్రభుత్వం, ఇప్పుడు ఆయన పేరును కూడా కొట్టివేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో…
సుప్రీంకోర్టు కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనున్నది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఫుల్ కోర్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లోనే సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీం కోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారు…
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్‌పై సావర్కర్ ఫొటో ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రింటింగ్ పొరపాటుగా కాంగ్రెస్ పేర్కొంది. అనంతరం సావర్కర్ ఫొటో స్థానంలో గాంధీ ఫొటోను అంటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘భారత్ జోడో’ పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 15వ రోజుకు చేరింది. అయితే కేరళలోని ఎర్నాకులం జిల్లాకు ర్యాలీగా వెళ్లిన నేతలకు ఊహించని షాక్ ఎదురైంది. ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్‌లో ముద్రించిన స్వాతంత్ర్య సమరయోధులలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సిద్ధాంత కర్త సావర్కర్ ఫొటో కూడా ఉంది. చెంగ్మనాడ్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ను ఎల్‌డీఎఫ్‌కు మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్‌మొదటగా గుర్తించారు. ఆ పోస్టర్‌తో కూడిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానితో ఉలిక్కిపడిన కాంగ్రెస్ నేతలు జరిగిన ”పొరపాటును” వెంటనే…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అయ్యింది. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైస్సార్ పేరు పెట్టింది జగన్ సర్కార్. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. సభలో మంత్రి రజనీ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మీద జగన్ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని, దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైస్సార్ పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి వంద యూనివర్సిటీలకు అయినా వైస్సార్ పేరు పెట్టాలని మంత్రి రజని పేర్కొన్నారు. వైద్యరంగంలో సంస్కరణల కర్త వైఎస్ఆర్ అని…
వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేసుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో తన కార్యాలయంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి మంగళవారం ఈ విధానాన్ని పరిశీలించారు. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డు కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తుంది. భక్తులు బస్టాండ్ లో దిగి సీఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా…
ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు గ్రీన్ ఫైనాన్స్ ఇవ్వడంతోపాటు మారుమూల ప్రాంతాలకు సేవలు అందేలా చూడాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడాన్ని గ్రీన్ఫైనాన్స్ అంటారు. “సస్టైనబుల్(సుస్థిర) ఆర్థిక వాతావరణంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఫిన్‌టెక్ సెక్టార్ భారతదేశంలోని భారీ జనాభా నుంచి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు” అని సీతారామన్ ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ పరిశ్రమపై ఇక నుంచి రెగ్యులేటరీ ఏజెన్సీలు మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతాయని ఆమె ప్రకటించారు. ఫిన్‌టెక్‌లు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా డిజిటల్ లెండర్లు అందరూ నవంబర్ చివరి నాటికి తన నిబంధనలను పాటించాలని ఆర్బీఐ కోరిన నేపథ్యంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇన్నోవేషన్లు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య బ్యాలన్స్‌ను సాధించడానికి…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత పేరుతో ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ఉండడం కోసమే బీహార్ లో బిజెపితో పొత్తు తెంచుకున్నట్లు భావిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ ఇప్పటికే తనకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. మరోవంక, ఉత్తర ప్రదేశ్ నుండి లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, పూల్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని వస్తున్న వార్తలను సహితం ఆయన తోసిపుచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతపైనే తాను దృష్టి కేంద్రీకరించానని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. యూపీలో ఏ స్ధానం నుంచి పోటీ చేసినా తాము మద్దతిస్తామని యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నితీష్ కుమార్‌కు ఆఫర్ చేసినట్టు ఊహాగానాలు సాగాయి. పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాలని ఆ నియోజకవర్గానికి చెందిన…
గత కొన్నెండ్లుగా ఉగ్రవాదంతో, తుపాకీ కాల్పులతో మగ్గిపోతున్న కాశ్మీర్ లోయలో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత అక్కడ సినిమా హాళ్లు తెరుచుకోవడమే కాకుండా, లోయలో మొట్టమొదటి సారిగా శ్రీనగర్‌లోని సోన్‌మార్గ్‌లో తొలి మల్టీప్లెక్స్సినిమా హాల్ ను స్వయంగా లెఫ్టునెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కశ్మీర్‌లో మొదటి మల్టీప్లెక్స్‌లో మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా హాల్స్ ఉండగా.. స్థానిక వంటకాలను ప్రోత్సహించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. మల్టీపెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మనోజ్ సిన్హా దిగవంగత నటుడు షమ్మీ కపూర్‌కు నివాళులర్పించారు. మల్టీపెక్స్‌లో అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా చిత్రం ప్రత్యేక ప్రదర్శనతో మల్టీపెక్స్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 నుంచి హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద చిత్రం ప్రదర్శనతో రెగ్యులర్ షోలు ప్రారంభంకానున్నాయి. వికాస్ ధర్ కంపెనీ టాక్సల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి…