Author: Editor's Desk, Tattva News

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరుగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీలో విచారణ జరిగితే తమకు న్యాయం అందదని, అందుకని మరో రాష్ట్రానికి కేసు విచారణను బదిలీ చేయాలని సునీతారెడ్డి సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితిలు లేవని ఆమె నివేదించారు. సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సునీత ఆరోపించారు. అదే సమయంలో సాక్షులను బెదిరిస్తున్నారని, కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె తన పిటిషన్ లో వివరించారు. అందుకే ఈ కేసు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు పరిధిలో కాకుండా, తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సునీతారెడ్డి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు…

Read More

2024 ఎన్నికలలో బిజెపి ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకై కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సంబంధం లేకుండా, ముఖ్యంగా దేశంలోనే పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో ఆ పార్టీని కట్టడి చేయడం ద్వారా పార్లమెంట్ లో సొంతంగా ఆధిక్యత సంప్రదించకుండా చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ దిశలో ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన జేసియు, ఆర్జేడీ, సమాజ్ వాద్ పార్టీల నేతలు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం సాధించి, తమకు తిరుగులేదని బిజెపి ధీమాగా ఉన్న ఉత్తర ప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఈ రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలలో బిజెపి 65 స్థానాలలో గెలుపొందింది. ఆ సంఖ్యను సగంకుపైగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉత్తర…

Read More

తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్‌ను గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆదివారం కలిసి తన భర్త రాజాసింగ్‌పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకుని తన భర్త జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఉషాబాయ్ ఓ లేఖను అందజేశారు. ఇక ఉషాబాయి మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకుని నిరాధార ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడితో తన భర్తపై అనేకసార్లు కేసులు బుక్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు విధానాలను ప్రశ్నిస్తున్నందుకు.. పోలీసులు రాజాసింగ్ పై తప్పుడు కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు.  ఇప్పటికే ఆ కేసులపై తాను న్యాయస్థానంలో పోరాడుతున్నానని చెప్పారు.తన భర్తపై…

Read More

పంజాబ్‌లోని ప్రైవేటు యూనివర్శిటీలో ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిందనే ఆరోపణలపై మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీ శనివారం రాత్రి అట్టుడికింది. విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేరే యూనివర్శిటీకి చెందిన స్నేహితుడికి ఆమె పంపిందని, వాటిని అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడన్న వార్త దావానలంలా వ్యాపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ విషయం బయటకు తెలియడంతో మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్టు వార్తలు రావడంతో దుమారం రేగింది. అయితే ఈ వార్తలను పోలీసులు, యూనివర్శిటీ వర్గాలు ఖండించాయి. అవన్నీ అవాస్తవాలని కొట్టిపడేశారు. ఒక విద్యార్థి తన సొంత వీడియో క్లిప్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ విద్యార్థిని అదుపు లోకి తీసుకోవడంతో పాటు, షిమ్లాకు చెందిన ఆమె స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డిఎస్‌పి…

Read More

తెలుగు రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యక్రలాపాలను చేబడుతున్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన పలువురిపై రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం, ఏపీలోని 2 చోట్ల సోదాలు చేసినట్లు ఎన్ఐఎ వెల్లడించింది. ఈ సందర్భంగా, రూ.8.31 లక్షల నగదు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. గతంలో పీఎఫ్ఐ నేతలు అబ్దుల్ ఖాదర్, షేక్ షహదుల్ల, మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మొబిన్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ కేసును ఆధారంగా చేసుకుని ఆగస్టు 26న ఎఫ్ఐఆర్ ను ఎన్ఐఏ నమోదు చేసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్ ఫారంలో షేక్ ముఖిద్ ఇంట్లో జరిపిన సోదాలలో బ్యాంక్ అకౌంట్, లావాదేవీలపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పాస్ పోర్టు సీజ్ చేసిన…

Read More

తూర్పు లడఖ్‌లోని అధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాలనుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాలని ఇటీవల భారత్ చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. ఈ అంగీకారానికి అనుగుణంగా చైనా బలగాలు తూర్పు లడఖ్‌లోని గోగ్రాహాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు ఆవలి వైపున తాము ఆక్రమించుకున్న ప్రాంతాలనుంచి చైనా బలగాలు దాదాపు 3 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు ఎన్డీ టీవీ సంపాదించిన తాజా ఉపగ్రహ చిత్రాలనుంచి స్పష్టమవుతోంది. ఇరు బలగాలు వెనక్కి తగ్గే ప్రక్రియలో భాగంగా ఈ ఉపసంహరణ జరిగింది. దీంతో 2020లో భారత సైన్యం గస్తీ నిర్వహిస్తూ ఉండిన ఈ ప్రాంతం నుంచి చైనా ఆర్మీకి చెందిన ఓ ప్రధాన బేస్ పూర్తిగా నిష్క్రమించి నట్లయింది. శాటిలైట్ చిత్రాలను తీయడంలో స్పెషలిస్టులైన మాక్సార్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన ఈ చిత్రాల్లో వాస్తవాధీన రేఖకు ఆవలి వైపు చైనా బలగాల ఉపసంహరణకు…

Read More

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శామీర్ పేటలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూసిన విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తూ, ఈటల కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఈటల నివాసానికి వచ్చారు. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి 25 నిమిషాల పాటు గడిపారు. సుమారు 15 నిమిషాలపాటు అమిత్ షా.. ఈటలతో ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు.. మునుగోడు, పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అమిత్‌షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

ఏపిలో మూడు రాజధాను అంశాన్ని తేల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. అమరావతే రాజధాని ఉండాలంటూ హైకోర్టు తీర్పునివ్వడం శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ తీర్పుపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెహఫూజ్ నజ్కీ పిటిషన్ దాఖలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పిటిషన్‌లో పేర్కొంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపింది. సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని…

Read More

అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తన పుట్టిన రోజున ప్రారంభించారు. నమీబియా లోని విండ్‌హాక్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లలో కునే నేషనల్ పార్కుకు వీటిని శనివారం ఉదయం తీసుకొచ్చారు. ఈ 8 చీతాలను ప్రత్యేక ప్రత్యేక క్వారంటైన్ ఎన్‌క్లోజర్ లోకి విడుదల చేశారు. అనంతరం ఆయనే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫోటపోలు తీశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఎనిమిది చిరుతలు మన అతిధులని, కునో నేషనల్ పార్కు వీటి ఇల్లని, వీటిని తీసుకురాడానికి ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని చెప్పారు. దీని వెనుక…

Read More

అక్టోబర్‌ 1 నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకేనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సైబర్‌ నేరగాళ్ల భారినపడి కార్డుదారులు మోసపోతున్నారు. కార్డుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు వివరాలను స్టోర్‌ చేస్తున్నారు.  భవిష్యత్‌ చెల్లింపుల సమయంలో కార్డు వివరాలన్నీ ఇవ్వకుండానే సీవీవీ నెంబర్‌తో లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. ఇక నుంచి కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరంలేకుండా కార్డు టోకేనైజేషన్‌ విధానం ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనదని ఆర్బీఐ తెలిపింది. టోకెన్‌ ద్వారా చెల్లింపుల విధానంలో కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదు. కార్డు జారీ చేసిన సంస్థ వినియోగదారుడికి ఒక నెంబర్‌ కేటాయిస్తుంది. దీన్ని ఉపయోగించి లావాదేవీలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఏదైనా వస్తువులు కొని, ఆన్‌లైన్‌లోనే చెల్లించే సమయంలో కార్డు వివరాలన్నీ పూర్తిగా ఇస్తున్నారు. ఈ వివరాలను ఆయా ఇ- కామర్స్‌ వెబ్‌సైట్లు భద్రపరుస్తున్నాయి. మొబైల్‌ కంపెనీలు కూడా యాప్‌ ద్వారా చేసే చెల్లింపుల సమయంలో కార్డు వివరాలను సేవ్‌…

Read More