త్వరలో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటుపరం కానుంది. ఇందుకు అనుగుణంగా ప్రాథమిక బిడ్‌ల ఆహ్వాన ప్రక్రియ ప్రారంభించేందుకు డిపార్టమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎం) నిర్ణయించింది. ఈ మేరకు ఐడిబిఐ బ్యాంక్‌లో తన వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ఆసక్తి గల వారి అభిప్రాయాలను తీసుకుంటుందని, త్వరలో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడిదారుల నుండి ప్రాథమిక బిడ్‌లను ఆహ్వానిస్తామని డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఇటీవలి ఒక సమావేశంలో తెలిపారు. ఐడిబిఐలో వాటాను విక్రయించడానికి ప్రభుత్వం 2016 బడ్జెట్‌లో ప్రకటించింది. ఐడిబిఐ బ్యాంక్ మే 2017 నుండి మార్చి 2021 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిఎసి) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంది. బ్యాంక్ ఫ్రేమ్‌వర్క్ నుండి నిష్క్రమించిన రెండు నెలల తరువాత మే 2021లో ఐడిబిఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్…
Author: Editor's Desk, Tattva News
ఓటు బ్యాంకు రాజకీయాలు, రజాకార్ల భయంతో మిగిలిన రాజకీయ పార్టీలు ఇంకా తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరుపుకోకుండా వెనుకంజ చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ సర్దార్ పటేల్ లేకపోతే, హైదరాబాద్‌కు విముక్తికి చాలా ఏళ్లు పట్టేదని, నిజాం రజాకార్లను ఓడించనంత కాలం ‘అఖండ భారత్’ కల నెరవేరేది కాదని స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో చాలా మంది విమోచన దినోత్సవం జరుపుకుంటామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనుకంజవేశారు’’ అంటూ పరోక్షంగా కేసీఆర్ ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరినదని చెప్పారు. అయితే ఇతర పార్టీలు వివిధ పేర్లతో ఈ రోజును జరుపుకోవడం పట్ల విస్మయం…
విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలోజాతీయ జెండాను ఎగురవేస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు స్కూల్స్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవు ప్రకటించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించిన, అనంతరం సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భాంగా సంజయ్ మాట్లాడుతూ..’స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. ఏడాదిపాటు నరకయాతన భరించారు. మహిళలపై వారు చేసిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవి. సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభిస్తే 17వ తేదీన విముక్తి లభించిందని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మరుసటి ఏడాది వచ్చిందని అన్నారు. అప్పటి నిజాం…
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో రెండోస్థానాన్ని ఆక్రమించారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను, ఫ్రాన్స్ లగ్జరీ రిటైల్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అదానీ అధిగమించారు. అయితే శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలో అదానీ గ్రూప్ షేర్లు పెరగడంతో కేవలం రెండు గంటలపాటే ద్వితీయస్థానంలో ఉన్న అదానీ ముగింపులో తిరిగి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. అదానీ గ్రూప్‌లో లిస్టయిన ఏడు కంపెనీల షేర్లతో పాటు ఆ గ్రూప్ టేకోవర్ చేసిన సిమెంటు సంస్థలు ఏసీసీ, అంబూజా సిమెంట్స్ సైతం 1-5 శాతం మధ్య నష్టాలతో ముగిసాయి. ఈ క్రమంలో ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం తొలుత 155.7 బిలియన్ డాలర్లకు చేరిన గౌతమ్ అదానీ సంపద తదుపరి 152.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 153.5 బిలియన్ డాలర్ల సంపదతో రెండోస్థానానికి వచ్చారు. పారిస్‌లో లిస్టయిన బెర్నార్డ్ సంస్థ…
భారత దేశాన్ని ప్రపంచంలోనే ‘తయారీ హబ్’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార, ఇంధన సంక్షోభాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉజ్బెకిస్థాన్ లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్ సివో) సదస్సులో మోదీ ప్రసంగిస్తూ ఆహార, ఇంధన సరఫరాలో ఆటంకాలను తొలగించి, మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎస్‌సివో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి చైనా ఈ సందర్భంగా పూర్తి మద్దతు ప్రకటించింది. వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు చైనా అధ్యక్షుడు…
కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులు అర్పించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ సంతాప సభలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 1998లో తాను కృష్ణంరాజును తొలిసారి కలిశానని, అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారని చెప్పారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యానని అంటూ కృష్ణంరాజుతనకు ఆత్మీయ మిత్రుడు అని చెప్పారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు అని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసేందుకు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు. “చాలా బాగా నాతో మాట్లాడారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను’’ అని తెలిపారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా తనను అన్నగారు అని పిలిచేవారని,. వివాదాలకు ఎప్పుడు…
వచ్చే ఏడాదిలో మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ”పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో ఏకకాలంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయని.. రేట్ల పెంపుతో రుణాలను మరింత భారంగా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ.. ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రపంచంలోనే మూడు బలమైన ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, చైనా, యూరోప్ ల వృద్థి నెమ్మదించిందని తెలిపింది. ప్రపంచ వృద్థి రేటు శరవేగంగా పడిపోతుందని, మున్ముందు మరింత క్షీణిస్తే పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ హెచ్చరించారు. కరోనా ముందు నాటి స్థాయికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు సరిపోవని స్పష్టం చేశారు. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే 2023లో ప్రపంచ ద్రవ్యోల్బణం…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలకు కూడా ప్రమేయముందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నిర్వహించిన తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలోనూ ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఉదయం సుమారు గం. 7.00 కే ఈడీ అధికారులు మాగుంట నివాసానికి చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సహా ఇంట్లో పనిచేసే సిబ్బంది ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేశారు. సిబ్బంది మరెవరికీ ఫోన్ చేయడానికి వీల్లేకుండా ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు…
సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 2 నిజాం ప్రభుత్వంలో “ఉమూర్ మజహార్” అనే దెవాదాయ శాఖా ద్వారా “దీన్ దార్” అనే సంస్థకు నిధులందేవి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని “ఆసీఫ్ నగర్ “లో వుంది. దీన్ దార్ నాయకుడు సిద్దీఖీ దీన్ దార్. ఈయన తనకు తాను చెన్న బసవేశ్వరుడి అవతారుడుగా చెప్పుకొన్నాడు. 1929 లో లింగాయత్ సాంప్రదాయానికి ఆధునిక రూపమే ఇస్లాం అనే వాదన చేశాడు. హిందూ దేవతలను అవమాన పరుస్తూ, హిందువులంతా ఇస్లామ్ లోకి మారాలని ప్రచారం చేసేవాడు. మతమార్పిడులు చేసేవాడు. తాను కల్కి అవతారమని, వీర భోగ వసంత రాయడనని, నిజాం అవతార పురుషుడని, అతని ప్రస్తావన వేదాలు, ఖురాన్ లో వుందని వంచించే ప్రయత్నం చేశాడు. హిందూ దేవాలయాలు ధ్వంసం అవుతాయని, గాంధీ ఇస్లాం స్వీకరిస్తారని, నెహ్రూ మానసికంగా ముస్లిం అవుతాడని జోస్యం చెప్పాడు. హుబ్లీ, ధార్వాడ, గుల్బర్గా, బీదర్ లలో అనేక…
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లోని వైద్య కళాశాల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సడలింపులను అనుమతిస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడానికి సోమవారం వరకూ గడువు ఇవ్వాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ కేసు విచారించాల్సి ఉందని శుక్రవారమే ఉక్రెయిన్ విద్యార్థుల కేసు…