Author: Editor's Desk, Tattva News

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడైజ్ మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌యింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్ర‌శేఖర్‌తో స్నేహం, అత‌డి నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను అందుకుంది. ఈ కేసులో త‌మ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల‌కు అనుగుణంగానే జాక్వెలిన్ బుధ‌వారం ఢిల్లీలోని ఎక‌న‌మిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాల‌యానికి చేరుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా జాక్వెలిన్‌కు సంధించాల్సిన ప్ర‌శ్నావ‌ళిని ముందుగానే సిద్ధం చేసిన ఢిల్లీ పోలీసులు ఆమెను రాత్రి 8 గంట‌ల దాకా విచారించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా గురువారం, శుక్ర‌వారం కూడా జాక్వెలిన్‌ను పోలీసులు విచారించ‌నున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని పోలీసులు జాక్వెలిన్‌కు సూచించారు. ఈ విచార‌ణ‌కు జాక్వెలిన్‌తో పాటు ఆమెను సుఖేశ్‌కు ప‌రిచ‌యం చేసిన పింకీ ఇరానీ కూడా…

Read More

ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకు నుంచి 42 కోట్ల 79 లక్షలు లోన్ తీసుకుని దారి మళ్లించారని ఆమె పై కేసు నమోదు చేశారు 2015 లో నమోదైన ఈ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు అప్పీల్ కు వెళ్లారు కొత్తపల్లి గీత. వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అధికారులు. మరోవైపు ఈ కేసులో బ్యాంకు అధికారులు, విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకి అధికారులు తరలించారు. .2015 లో నమోదైన కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఆమెకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె భర్త రామకోటేశ్వరావుకు…

Read More

గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కమలం పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లను బలోపేతం చేసేందుకే బీజేపీలో చేరామని మైఖేల్ లోబో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్కు 11 మంది సభ్యులున్నారు. 2019 జులైలోనూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే వార్తలు వచ్చినా..అధిష్టానం చర్యలతో అది సద్దుమణిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో…

Read More

రక్షణ దళాల్లోకి ‘అగ్నిపథ్’ పథకం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పంజాబ్‌లో స్థానిక అధికార యంత్రాంగం సహకరించడం లేదని భారత సైన్యం ఆరోపించింది. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో ఎంపిక ప్రక్రియను నిలిపేసి, పొరుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీకే జంజువా, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఉపాధి సృష్టి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ) కుమార్ రాహుల్‌లకు సెప్టెంబరు 8న జలంధర్‌లోని జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ మేజర్ జనరల్ శరద్ బిక్రమ్ సింగ్ ఓ లేఖ రాశారు. అగ్నిపథ్ పథకంలో నియామకాల కోసం స్థానిక అధికార యంత్రాంగం నుంచి తమకు సహకారం లభించడం లేదని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని, నిధులు లేవని స్థానిక అధికారులు చెప్తున్నారని తెలిపారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీస్ నిర్వహించడానికి పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం తప్పనిసరిగా సహకరించాలని,…

Read More

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని పది రోజుల్లో విడుదల చేయకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేన హెచ్చరించింది. రాజాసింగ్ అరెస్ట్ పై కర్ణాటకకు చెందిన అఖిల భారత శ్రీరామ్ సేన తీవ్రంగా స్పందించింది. ఈ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ ను కలవడానికి జైలుకు వెళ్తే అనుమతించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజాసింగ్ ఏమైనా ఉగ్రవాదా? ఎందుకు కలవనివ్వడం లేదు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే పై అక్రమ పి డి యాక్ట్ నమోదు చేసి, అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజాసింగ్ కు జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ కు ఏమైనా జరిగితే కేసీఆరే బాధ్యత వహింపవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ నడుం బిగించింది. ఈ క్రమంలో ఈ నెల 27న ఉదయం గం. 11.00కు రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను సమావేశానికి హాజరు కావాల్సిందిగా సూచిస్తూ లేఖలు పంపించింది. సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్టు ఎజెండాలో పేర్కొంది. ఇందులో 7 అంశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించినవి కాగా, మిగతా 7 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపర్చిన హామీలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజనలో నెలకొన్న వివాదాల పరిష్కారం మొదటి అంశంగా పేర్కొనగా, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థ విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలసీర్, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థల విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు…

Read More

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఖంగుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రకటించారు. తద్వారా అమిత్ షా సమక్షంలో హైదరాబాద్ లో కేంద్రం నిర్వహించి అధికారిక ఉత్సవాలకు గైరాజరు కావచ్చని పధకం వేశారు. అయితే, ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో బిజెపి ప్రచారం చేసుకొనేందుకు అవకాశం లేకుండా చేయడం కోసం నగరంలోని మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సులపై స్థలాన్ని ముందుగానే టిఆర్ఎస్ రిజర్వ్ చేసుకోంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్రచారం చేసేలా యాడ్ ఏజెన్సీల ద్వారా ఏర్పాట్లు చేసింది. దీంతో బీజేపీ ప్రచారానికి అవకాశం లేదంటూ యాడ్ ఏజెన్సీలు తిరస్కరించాయి. దీంతో టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్స్ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమకు అవకాశం ఇవ్వకుండా పిల్లర్లు, ఆర్టీసీని టీఆర్ఎస్ బుక్ చేసుకుందని సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ‘‘తెలంగాణ విమోచన దినోత్సవం…

Read More

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన హింసకు గురై దేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించాలని కోరుతూ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన 220 పిటిషన్లను అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్‌, జైన్‌, పార్సీకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన 2019 సవరించిన చట్టం ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, ఇతర వ్యక్తుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. విచారణ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లలో పలు అంశాలు లేవనెత్తినట్లు తెలిపారు. ‘కొన్ని సవరణలు, సవాలుకు సంబంధించిన కేంద్ర…

Read More

జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. రనిటైడిన్‌ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్‌ అయిన రనిటైడిన్‌ను తొలగించడంతో ఇకపై జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో ఉండవు. జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు చెప్పారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. ఎండోక్రైన్‌ మందులు, ఇన్సులిన్‌ గ్లార్గిన్‌, ఐవర్‌మెక్టిన్‌ వంటి 34 రకాల ఔషధాలను…

Read More

తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంగళవారం రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మరమనిషి అన్నారని, స్పీకర్‌ కు ఆయన క్షమాపణ చెప్పాలని టిఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. అయితే క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో ఈటల రాజేందర్‌పై సస్పెండ్‌ వేటు పడింది.ఈ సందర్భంగా శాసనసభలో టిఆర్‌ఎస్‌ సభ్యులు, ఈటల రాజేందర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. సభాగౌరవాన్ని పాటించకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభ నుంచి ఈటలను సస్పెండ్‌ చేయాలంటూ టిఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ను ‘మర మనిషి’ అంటూ ఈటల సంబోధించారని, సభకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ కోరారు. సభలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మరో సభ్యుడు బాల్క సుమన్‌ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈటల క్షమాపణలు చెప్పిన తరువాతే చర్చలో పాల్గొనాలని కోరారు. ఈటల…

Read More