బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3)ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెషన్ కౌన్సిల్ ఆయనను బ్రిటన్ రాజుగా ప్రకటించింది. మొన్నటిదాకా బ్రిటన్ రాణిగా కొనసాగిన ఎలిజబెత్- 2 గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడిగా ఉన్న చార్లెస్- 3ని బ్రిటన్ రాజుగా కౌన్సిల్ ప్రకటించింది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న చార్లెస్- 3 బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన వారిగా రికార్డులకు ఎక్కారు. బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన వెంట సతీమణి కెమిల్లా, కుమారుడు విలియంలు సహా అతి కొద్ది మంది అతిథులు ఉన్నారు. ఇదిలా ఉంటే, బ్రిటన్…
Author: Editor's Desk, Tattva News
దేశంలో ఆయా చట్టవిరుద్ధమైన రుణ యాప్‌లు వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా బలహీనమైన & తక్కువ-ఆదాయ వర్గాలకు అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్/దాచిన ఛార్జీలు, బ్లాక్‌మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులు మొదలైన దోపిడీ రికవరీ పద్ధతులపై రుణాలు/సూక్ష్మ క్రెడిట్‌లను అందిస్తున్న సందర్భాలు పెరుగుతుండటం పట్ల ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల వెలుపల “అక్రమ రుణ యాప్‌ల”కి సంబంధించిన వివిధ సమస్యలను చర్చించడానికి ఆమె అధ్యక్షతన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు (అదనపు ఛార్జ్) కార్యదర్శి; ఆర్ధిక సేవల శాఖ కార్యదర్శి; ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి; ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్; ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మనీలాండరింగ్, పన్ను ఎగవేతలు, డేటా ఉల్లంఘన/గోప్యత, అటువంటి చర్యలకు పాల్పడినందుకు క్రమబద్ధీకరించని చెల్లింపు అగ్రిగేటర్లు, షెల్ కంపెనీలు, పనికిరాని ఎన్‌బీఎఫ్‌సీలు మొదలైన వాటి దుర్వినియోగం వంటి…
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు అవుతోన్న సందర్భంగా ఈ నెల 12నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. శాంతిభద్రతల కారణాలతో అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించినా హైకోర్టు అనుమతి ఇవ్వడంతో యాత్రకు అడ్డులేక పోయింది. హైకోర్టు అనుమతినివ్వడంతో ఉత్సాహంగా ఉన్న రైతులు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం సిద్ధం చేశారు. ఈ నెల 12న వేకువ జామున 5 గంటలకు ముందుగా వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీ, జనసేన,…
గ్రేటర్ హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం రంగరంగ వైభవంగా, ప్రశాంతంగా ముగిసింది. ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సుమారు 6 లక్షలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారు. నిమజ్జనాన్ని చూడ్డానికి లక్షలాది మంది తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు,ఎన్‌టీఆర్ మార్గ్ ప్రాం తాల్లో ఇసుకెేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. దీంతోపాటు లడ్డు వేలంలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డు అత్యధికంగా రూ 24.60 లక్షల రేటు పలికింది. ఈసారి గచ్చిబౌలిలోని మైహోం భుజాలో సైతం లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి, నిమజ్జనం ఒకెత్తయితే ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి మరో ఎత్తు. ఈసారి 50 అడుగుల్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాత్రి 7 గంటలకే నిమజ్జనాన్ని పూర్తి చేశారు. గ్రేటర్‌వాసులు, తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన అశేష జనవాహిని నడుమ పంచముఖ మహాలక్ష్మి గణపతికి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం…
సుదీర్ఘకాలం బ్రిటన్‌ను పాలించి, గురువారం కన్నుమూసిన మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్ అబెలో అశేష జనవాహిని మధ్యలో ఈ నెల 19న జరగనున్నాయి. ఆమె మరణించిన స్కాటిష్ ఎస్టేట్‌లోనే రాయల్ స్టాండర్డ్ పతాకాన్ని కప్పిన శవపేటికలో ఆమె భౌతిక కాయాన్ని వుంచారు. ఆ తర్వాత రాణి వయస్సు 96 సంవత్సరాలకు గుర్తుగా 96 రౌండ్లు తుపాకులను గాల్లోకి పేల్చారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమానికి ప్రధాని లిజ్‌ట్రస్, ఇతర సీనియర్ మంత్రులు హాజరై నివాళులర్పించారు. శనివారం ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను రాజుగా ప్రకటించిన తర్వాత, ఆదివారం రాణి భౌతిక కాయాన్ని వుంచిన శవపేటికను బాల్మోరల్ నుంచి ఆమె అధికార స్కాటిష్ నివాసమైన హౌలీరూడ్‌హౌస్ ప్యాలెస్‌కి తరలిస్తారు. ప్రజలు నివాళి అర్పించేందుకు వీలుగా రోడ్డు పై నుండి అంతిమయాత్ర సాగుతుంది. అక్కడ మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్ధం వుంచుతారు. అనంతరం తండ్రి జార్జి-4, తల్లి ఎలిజబెత్,…
ఢిల్లీలో రాజ్ పథ్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చిన ‘కర్తవ్య పథ్ ‘ పేరు భారతీయత ఉట్టిపడే పేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు. ‘కర్తవ్య పథ్ ‘లో నేతాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్లు గడచినా వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా ఉన్న చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధాని మోదీ అభినందనీయులు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే, ఆపై రాజ్ పాథ్ గా మారి, ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించిందని పవన్ కల్యాణ్ వివరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో, వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు, చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారని సంతోషం ప్రకటించారు. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయం అని ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం ఉండే వీధిని రేస్ కోర్స్ రోడ్ గా…
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఒక ద్రోణిగా కొనసాగుతోందని దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ సూచించింది. హైదరాబాద్‌లో నాలుగు రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తుండడంతో లోతట్టు ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహిదీపట్నం, ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.…
ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 10 12 మిలియన్ ఎకరాల మేర తగ్గనున్న నేపథ్యలో రిటైల్ ధరలు పెరగకుండా చూడడంతో పాటుగా దేశీయంగా సరఫరాలు పెంచడం కోసం కేంద్రం బియ్యం నూకల ఎగుమతులను శుక్రవారం నిషేధించింది. అలాగే ఉప్పుడు బియ్యం తప్ప బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూకల ఎగుమతులు అనూహ్యమైన రీతిలో గణనీయంగా పెరగడంతో పాటుగా పశువుల దాణాతో పాటుగా ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి తృణధాన్యాల నూకలు తగిన మోతాదులో అందుబాటులో లేని కారణంగా నూకల ఎగుమతులను నిషేధించినట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ప్రభుత్వం ఈ ఆంక్షలనుంచి ఉపశమనం కల్పించింది. ఈ నెల 15 వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరుకున్న నిల్వల ఎగుమతులను కూడా…
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉప ఎన్నిక టికెట్ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులు పోటీ పడ్డారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ…
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు తాజాగా ప్రకటించాయి. 70 ఏళ్ల పాటు బ్రిటన్ రాజ్యాధినేత్రిగా కొనసాగిన ఆమె సుదీర్ఘకాలంపాటు బ్రిటన్‌ను పరిపాలించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. 1926 ఏప్రిల్ 21న లండన్‌లో జన్మించిన ఎలిజబెత్-2 తన 22 యేండ్ల వయస్సులోనే 1952లో రాణిగా బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1947లో ఆమె ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహమాడారు. కాగా.. ప్రిన్స్ ఫిలిప్ గతేడాది కన్నుమూశారు. రాణి 76 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్‌లో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఎలిజబెత్-2 ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్ గ్రీస్ యువరాజు,…