Author: Editor's Desk, Tattva News

అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25 లక్షలు ఇస్తామని వెల్లడించింది. దావుద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులు చోటాషకీల్‌పై రూ. 20 లక్షలు, హజి అనీసన్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తక్ అబ్దుల్ రజాక్ మేమన్ అలియాస్ టైగర్ మెమన్‌పై రూ. 15 లక్షల చొప్పున రివార్డు ప్రకటిస్తున్నట్టు ఎన్‌ఐఎ అధికారులు గురువారం వెల్లడించారు. వీరంతా 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎలాంటి సమాచారం తెలిసినా దర్యాప్తు సంస్థకు చేరవేయాలని అధికారులు తెలిపారు. దావుద్ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా “డి కంపెనీ”పై ఎన్‌ఐఎ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం,…

Read More

తెలుగు రాష్ట్రాలలో తిరిగి తెలుగు దేశం పార్టీతో పొత్తు ఏర్పర్చుకోవాలని బిజెపి నాయకత్వం నిర్ణయించిందని, త్వరలో ఎన్డీయే లోకి టిడిపి తిరిగి చేరబోతున్నదని కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తాకథనాలు బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ తోసిపుచ్చారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడంలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు అంశం వార్తలకే పరిమితమని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ తో కలసి పోటీ చేస్తుందని ప్రకటించారు, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ పెరుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు ఇలా ఉండగా, బిహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చకెళ్తున్నారని అంటూ కేసీఆర్ పదిసార్లు బతిమాలినా బిహార్ సీఎం నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని దయ్యబట్టారు.…

Read More

సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్‌ కేసులు కానిస్టేబుల్‌ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లోబర్చుకొని ఆమె నుంచి రూ.10 లక్షల నగదు, 30 తులాల బంగారం కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్‌మెంట్‌ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను…

Read More

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (68) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతులను ఎదుర్కొన్న యాదవ్‌ ఆరేసి ఫోర్లు, సిక్సర్లతో 68 పరుగులు పిండేశాడు.  తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(36), రోహిత్‌ శర్మ (21) త్వరగానే అవుట్‌ అయిన ఆతరువాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ(59) తనదైన శైలిలో బ్యాటిగ్‌ చేసి స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు.  కోహ్లీకి జత కలిసిన మరో బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ హాంకాంగ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో 68 పరుగులు చేసి ఔరా అనిపించాడు. హాంకాంగ్‌ బౌలింగ్‌లో హరూన్‌ అర్షద్‌ కేవలం 3 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు.  మరో బౌలర్‌ ఆయుశ్‌ శుక్లా 4 ఓవర్లు వేసి ఓ వికెట్‌ తీశాడు.…

Read More

కోట్లాది రూపాయల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ నేర చరిత్ర గురించి బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ముందే తెలుసునని, దర్యాప్తు నుండి బయటపడేందుకు కట్టుకథ అల్లుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చార్జీషీట్‌లో పేర్కొంది.  సుఖేష్‌పై నమోదైన కేసుల గురించి తనకేమీ తెలియదని జాక్వెలిన్‌ చేస్తోన్న వాదన అబద్ధమని ఇడి చెబుతోంది. సుఖేష్‌ నేర చరిత్ర గురించి, ఆయన భార్య లీనా గురించి 2021 ఫిబ్రవరిలోనే ఆమెకు తెలుసునని చార్జీషీట్‌లో పేర్కొంది. జాక్వెలిన్‌ హెయిర్‌ స్టైలిస్‌ షాన్‌.. సుఖేష్‌ గురించి అన్ని వివరాలను చెప్పాడని, అన్ని తెలిసే.. అతనితో ఆర్థిక లావాదేవీలను కొనసాగించారని తెలిపింది.  అతడి నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందారని, ఆ ఆదాయమంతా వివిధ నేరాల ద్వారా వచ్చినదేనని పేర్కొంది. రూ. 200 కోట్ల దోపిడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఇడి.. గత నెలలో చార్జీషీట్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరును నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా…

Read More

బీహార్ లోని ఓ మంత్రిపై కిడ్నప్ కేసు నమోదు కావడంతో ముఖ్యమంత్రి ఆయన మంత్రిత్వ శాఖను మార్చారు. దానితో మంత్రి మాధవికే రాజీనామా చేశారు. పంజాబ్ లో స్పీకర్ తో పాటు మరో ఇద్దరు మంత్రులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2014 నాటి కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జెడి నేత, బీహార్‌ మంత్రి కార్తీకేయ సింగ్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. కార్తీక్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఆయన పదవి వీడక తప్పలేదు. కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో బీహార్‌ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కార్తీక్‌ను తొలుత చక్కర శాఖకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్చారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో శాఖ మార్చిన కొద్దీ గంటలకే రాజీనామా చేశారు. కాగా, ఆయన రాజీనామాను ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది పంజాబ్ లో ఓ కేసులో ఆ రాష్ట్ర శాసనసభ…

Read More

సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్‌ (91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి.  సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచెప్ ప్రచ్ఛన్నయుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. ఏడేళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు. సోవియట్ యూనియన్‌ అధ్యక్షుడిగా 1985-1991 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపర్చిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.  ఈ సందర్భంగా గోర్బచేవ్ ఉపయోగించిన రెండు రష్యన్ పదాలో మొత్తం ప్రపంచంలోనే విశేష ప్రాచుర్యం పొందాయి. దేశానికి “పెరెస్ట్రోయికా” లేదా పునర్నిర్మాణం అవసరమని, దానితో వ్యవహరించడానికి తన సాధనం “గ్లాస్నోస్ట్” – ఓపెన్‌నెస్ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. వీటితోపాటు “ప్రజాస్వామ్యం” అంటూ పార్టీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేటట్లు చేశారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా…

Read More

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుకు సంబంధించి ఆమె సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌లను విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎం కె స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్‌ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. జయలలిత 2016 డిసెంబర్‌ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సందర్భంగా పలు వివాదాలు చెలరేగడం, పలు అనుమానాలు వ్యక్తం కావడం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ రెండు, మూడు రోజుల క్రితమే సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోనే వీరిపై తదుపరి…

Read More

జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా మైనింగ్ లీజ్ సంపాదించారంటూ బిజెపి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదును గవర్నర్ ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపించడంతో సోరేన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇసి సిఫార్సు చేసింది. అయితే ఇసి సిఫార్సు చేసినా గవర్నర్ రమేశ్ బైస్ ఆయనపై చర్య తీసుకోలేదు. కానీ ఏ క్షణంలోనైనా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి తమ ఎంఎల్‌ఎలను తమ వైపునకు తిప్పుకోవచ్చని భయపడుతున్న సోరేన్ పభుత్వాన్ని కాపాడుకునేందుకు కూటమిలోని ఎంఎల్‌ఎలను తన వెంటే తిప్పుకొంటున్నారు. ఇన్నాళ్లూ జార్ఖండ్ రాజధాని రాంచీలోనే ఎంఎల్‌ఎలను తన వద్దే ఉంచుకున్న సోరేన్ తాజాగా అధికార యుపిఎ కూటమిలోని ఎంఎల్‌ఎలను చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు తరలించారు. 81 మంది సభ్యులుండే…

Read More

గత కొన్నేళ్ల క్రితం గౌతమ్ అదానీ పేరును భారతదేశం బయట పెద్దగా తెలియదు. అయితే బొగ్గు రంగానికి వెళ్లడానికి ముందు కాలేజీతో చదువు ముగించిన భారతీయ వ్యాపారవేత్త అదానీ మొదటిసారి వజ్రాల వ్యాపారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా మారారు. ఒక ఆసియన్ తొలిసారిగా ప్రపంచంలో టాప్3 స్థానానికి వెళ్లారు. ఇంతకుముందు దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా వంటివారు కూడా ఇప్పటివరకు మూడో స్థానానికి వెళ్లలేదు.  137.4 బిలియన్ డాలర్ల నికర విలువతో అదానీ ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్‌ను వెనక్కినెట్టి ముందుకు వెళ్లారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇక అదానీకి ముందు స్థానాల్లో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు మాత్రమే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా అదానీ(60) తన బొగ్గు నుంచి ఓడరేవుల వరకు వివిధ వ్యాపారాలను విస్తరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత డేటా…

Read More