Author: Editor's Desk, Tattva News

పొరుగుదేశం పాకిస్థాన్ కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం నెలకొనడం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాక్ కు ఆహార సాయం అందించడంపై కేంద్రంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జాతీయ మీడియా పేర్కొంది.  పాక్ లో 2005లో భారీ భూకంపం సంభవించినప్పుడు, 2010లో వరదలు వచ్చినప్పుడు ఆ దేశానికి భారత్ సాయం చేసింది. కాగా, పాకిస్థాన్ లో భారీ వరదలకు బలైన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. పాక్ ప్రజలు ఈ కష్టకాలం నుంచి త్వరగా…

Read More

ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తన వెంట నడిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అధికారంలో ఉంది వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రముఖ గాంధేయవాది, సామజిక ఉద్యమకారుడు అన్నాహజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు పరుషమైన పదజాలంతో ఓ లేఖను వ్రాస్తూ “మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది” అంటూ తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్‌ సర్కార్‌ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటూ ఉండడం పట్ల కేజ్రీవాల్‌పై అన్నా హజారే ఓ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి” అని గుర్తు చేశారు. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోందని…

Read More

130 కోట్లకు మించిన జనాభాకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో ప్రయాణీకుల రవాణాలో సీట్లు మరియు బెర్త్‌లకు చాలా ఎక్కువ గిరాకీ ఉంది. భారతీయ రైల్వేలు సామర్థ్యం పెంచినప్పటికీ గిరాకీ సరఫరా అంతరం సంవత్సరాలుగా పెరుగుతునే వుంది. ఈ డిమాండ్ – సరఫరా అంతరంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనేక మంది మోసగాళ్లు దోపిడీకి తెరతీశారు. వారు రిజర్వ్ చేసిన సీట్లను కైవసం చేసుకోవడానికి, వాటిని అధిక ధరపై పేదలకు విక్రయించడానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ధృవీకరించబడిన రైల్వే రిజర్వేషన్‌లను కైవసం చేసుకోవడానికి చట్టవిరుద్ధమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంతో సామాన్యులకు ధృవీకరించబడిన రిజర్వేషన్‌ టిక్కెట్లు దొరకటం కష్టమయ్యింది. అక్రమ వ్యాపారం (రైల్వే టిక్కెట్ల సేకరణ & సరఫరా వ్యాపారాన్ని అనధికారికంగా నిర్వహించడం)లో పాల్గొన్న వ్యక్తులపై ఆర్ పి ఎఫ్ “ఆపరేషన్ ఉపలబ్ద్” కోడ్ పేరుతో ఉద్యమ బాణీ లో తీవ్రమైన మరియు నిరంతర కొనసాగే చర్యలను చేపట్టింది. మానవ మేధ, ఆర్‌పిఎఫ్ బృందం అందించిన ఖచ్చితమైన…

Read More

నందమూరి బాలకృష్ణ నటించిన వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే అనుష్క కీలక పాత్ర పోషించిన రుద్రమదేవి కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేట్లు తగ్గించలేదని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పన్ను రాయితీ పొందిన మేర డబ్బును ప్రభుత్వాల నుంచి తిరిగి రాబట్టాలని ఆ పిటిషన్ లో కోరారు. రుద్రమదేవికి తెలంగాణలో రాయితీ ఇవ్వగా, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయితీ ఇచ్చారని పిటిషన్ లో వెల్లడించారు. కానీ ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు. ఈ పిటిషన్ ను డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం, బాలకృష్ణకు,…

Read More

దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన తొమ్మిది మంది ప్రొఫెషనల్స్‌లో అత్యధిక శాతం మంది రోజువారీ కూలీలే ఉన్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) వెల్లడించింది. 2021లో 1,64,033 ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో ప్రతి నలుగురిలో ఒకరు డైలీ లేబర్‌ అని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) స్పష్టం చేసింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం భారత్ లో జరిగిన రోడ్ ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో అధిక శాతం మరణాలు దినసరి వేతన కూలీలవే. గతేడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడగా, వారిలో 25.6శాతం అనగా, 42,004 మంది వేతన కూలీలని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బి కేటగిరీలో తొమ్మిది ప్రొఫెషనల్‌ గ్రూపులు – విద్యార్థులు, ప్రొఫెన ల్‌ లేదా వేతన ఉద్యోగులు, దినసరి కూలీలు, రిటైర్డ్‌ వ్యక్తులు, నిరుద్యోగులు, సెల్ఫ్‌ ఎంప్లాయీస్‌, గృహిణులు, వ్యవసాయరంగం, ఇతరులను చేర్చింది. ఒక్క 2021లోనే కాకుండా 2020లో సైతం ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో దినసరి కూలీల సంఖ్యే…

Read More

ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ తర్వాత క్రమంగా 2023 డిసెంబర్ వరకు దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, జిల్లాలు, మండలాలకు జియో 5జీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సాధారణ సమావేశం సందర్బంగా ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ మెటావర్స్ టెక్నాలజీ ద్వారా వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ..జియో 5జీ సేవలపై ప్రకటన చేశారు. జియో స్టాండలోన్ 5జి అని పిలువబడే 5జి తాజా వెర్షన్‌ను అమలు చేస్తుందని చెప్పారు. 5జీ మౌలిక సదుపాయాలపై రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన 5జీ వేలం పాటలో ప్రభుత్వానికి…

Read More

హైదరాబాద్ ఐకియా స్టోర్‌లో జాత్యంహకార వివక్ష ఘటన కలకలంరేపుతుంది. హైదరాబాద్ అంటే దేశ ప్రజలకే కాదు విదేశాల ప్రజలకు కూడా ఎంతోమక్కువ. ఏడాదికి ఒకసారైనా హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి అందాలను చూడాలని , కొన్ని రోజుల పాటు ఇక్కడ గడపాలని అనుకుంటున్నారు. అలాంటిది హైదరాబాద్ లో జాత్యంహకార వివక్ష ఘటన వార్తల్లో నిలిచేలా చేసింది. నితిన్ సేథి అనే జర్నలిస్ట్ భార్య హైదరాబాద్‌లో ఉన్న ఐకియా స్టోర్‌లో కలిసి షాపింగ్ చేశారు. అయితే తమను మాత్రమే సెక్యూరిటీ పేరుతో ఇబ్బంది పెట్టి అవమానించారని నితిన్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కొనుగోలు చేసిన వస్తువులను సిబ్బంది తనిఖీ చేశారని, అంతకు ముందు, ఆ తర్వాత కొనుగోలు చేసిన కస్టమర్లను మాత్రం చెక్ చేయలేదని ఆరోపించాడు. దీనికి కారణం కేవలం జాతి వివక్షేనని.. సూపర్‌వైజరీ స్టాఫ్ కూడా ఈ చర్యకు మద్దతుగా నిలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటర్నేషనల్ స్టోర్…

Read More

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కశ్మీరుకు చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో మాజీ డిప్యుటీ స్పీకర్ గులాం హైదర్ మాలిక్ ఉన్నారు. కతువా జిల్లాకు చెందిన బనీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన మాలిక్‌తో పాటు ఇద్దరు మాజీ ఎంఎల్‌సిలు తమ రాజీనామా లేఖలను పార్టీ అధిష్టానానికి పంపారు. ఆజాద్‌కు మద్దతుగా ఈ ముగ్గురు నాయకుల నుంచి తమకు లేఖలు అందాయని ఆజాద్ సన్నిహితుడు, మాజీ మంత్రి జిఎం సరూరి తెలిపారు. ఇలా ఉండగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల మజీద్ వాని, మనోహర్ లాల్ శర్మ, ఘరూ రాం, మాజీ ఎంఎల్‌ఎ బల్వాన్ సింగ్ సోమవారం ఢిల్లీలో ఆజాద్‌ను కాలిశారు. వీరు కూడా మంగళవారం ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి…

Read More

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియ చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఈ విచారణను సెప్టెంబర్ 5 వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో వాయిదా కోరిన కొందరు పిటిషనర్లను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఇలాంటి ‘ఫోరం షాపింగ్ ’ను అనుమతించమని పేర్కొంది.ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీరే కోరారు. మళ్లీ వాయిదా అడిగారు. ఆపై మళ్లీ విచారణకు కోరారు. ఇప్పుడు మళ్లీ వాయిదా అడుగుతున్నారు. ఇలాంటి వాటికి ఇక్కడ అనుమతి లేదు.. వాదనలు వింటాం అని పేర్కొంటూ సెప్టెంబర్‌ 5వ తేదీన వాదనలు ఉంటాయని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం లోని…

Read More

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనం లోకి తీసుకోవడం, బ్రాహ్మణేతరులను ఆలయ అర్చకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు. తమిళనాడులో డీఎంకె అధికారం లోకి రాగానే ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చకులుగా నియమిస్తామని మాటిచ్చారు. ఈమేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటేడాది ఆగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు…

Read More