వంట నూనెల తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులకు, ఉష్ణోగ్రత లేకుండా పరిమాణంలో వంట నూనెలు మొదలైన వాటిపై నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్రం సూచించింది. ఉత్పత్తి బరువుతో పాటు ఉష్ణోగ్రతను పేర్కొనకుండా నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించే లేబులింగ్‌ను, ఆదేశాలు జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలలలోపు అంటే జనవరి 15, 2023 వరకు సరిచేయాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం వారికి సూచించింది. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారం, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా అన్ని ప్రీ-ప్యాకేజ్ చేయబడిన వస్తువులపై ఇతర ప్రకటనలతో పాటూ ప్రామాణిక యూనిట్లలో బరువు లేదా కొలతల పరంగా నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించడం తప్పనిసరి కాగలదు. నియమాల ప్రకారం రూపొందించిన నిబంధనలను అనుసరించి, నికర పరిమాణంలో వంట నూనెలు, వనస్పతి నెయ్యి మొదలైన వాటిని బరువు లేదా ద్రవ్యరాశి పరిమాణంలో ప్రకటించాలి. అలాగే ద్రవ్యరాశి లో ప్రకటిస్తే, ఆ వస్తువు సమానమైన బరువును తప్పనిసరిగా ప్రకటించాలి. ద్రవ్యరాశిలో నికర పరిమాణాన్ని ప్రకటించేటప్పుడు పరిశ్రమలు ముందుగానే ఉష్ణోగ్రత గురించి ప్రస్తావించడం గమనించవచ్చు.…
Author: Editor's Desk, Tattva News
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో మూడు రోజుల అడ్డంకుల తర్వాత శుక్రవారం ఉదయం నుండి తిరిగి ప్రారంభమయింది. మంగళవారం రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చి, అడ్డుకున్న నేపథ్యంలో బండి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు చివరి సయమంలో అనుమతి నిరాకరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. వర్ధన్ పేట్ ఎసిపి ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం శనివారం హనుమకొండలో యాత్రను భారీ బహిరంగసభతో ముగింపనున్నారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించనున్నారు. హైకోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించిన సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని దుయ్యబట్టారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసే…
టిక్‌టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ తొలుత భావించినట్లు గోవాలో సహజ మరణం పొందలేదని, హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. మృతదేహా పరీక్షలో గాయాలున్నట్లు గుర్తించడంతో సహజ మరణంగా కేసు నమోదు చేసిన గోవా పోలీసులు ఇప్పుడు హత్యా కేసుగా నమోదు చేశారు. ఫోగట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోనాలీ మృతదేహానికి గురువారం గోవా మెడికల్ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర…
ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే సమయంలో భద్రతా ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాలపౖౖె విచారణ చేపట్టిన కమిటీ పంజాబ్ పోలీసుల వైఖరిలో లోపాలున్నాయని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. శాంతి, భద్రతలు పరిరక్షించడంలో ఫిరోజ్‌పూర్ సీనియర్ ఎస్‌పి విఫలమయ్యారని మాజీ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తెలిందని చెప్పింది. తగినంత భద్రత సిబ్బంది అందుబాటులోకి ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఆ మార్గంలో వెళతారని రెండు గంటల ముందు తెలియజేసినప్పటికీ, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ నివేదికను కేంద్రానికి పంపుతామని పేర్కొంది. జనవరి 5న ఎన్నికల ర్యాలీ కోసం ఫిరోజ్‌పూర్‌కు వెళుతున్న ప్రధాని మోడీకి అన్నదాతల నుండి నిరసన సెగ ఎదురైంది. హుస్సేనివాలా…
29 ఫోన్లను పరీక్షించగా, ఐదు ఫోన్లలో మాల్‌వేర్ ఉన్నట్లు గుర్తించామని, అయితే అది పెగాసస్ స్పైవేర్ అని నిర్ధారణకు రాలేకపోతున్నామని ఓ నివేదిక తేల్చినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పెగాసస్ వ్యవహారంపై భారత ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ చెప్పిందని కూడా పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి రవీందన్ నేతృత్వంలోని కమిటీని గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగా, తాజాగా ఈ రిపోర్టును ఇచ్చింది. దీనిలోని కొన్ని ముఖ్యాంశాలను జస్టిస్ ఎన్‌వి రమణ గురువారం కోర్టులో వెల్లడించారు. పెగాసస్ వ్యవహారంలో నివేదికను మూడు భాగాలుగా సమర్పించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. టెక్నికల్ కమిటీ రెండు నివేదికలు, రవీంద్రన్ పర్యవేక్షణ కమిటీ ఓ నివేదిక ఇచ్చినట్లు పేర్కొంది. నివేదికలో ఓ భాగాన్ని తమ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, పిటిషనర్లలో కొందరు నివేదికలోని మొదటి రెండు భాగాల కాపీని కోరగా డిమాండ్‌ను కోర్టు…
తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా ఎమ్మెల్యేపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి ఎమ్యెల్యే రాజాసింగ్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 101 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాల కథనం. రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో 18 మతపరమైన కేసులే. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. పాత కేసులన్నీ తిరగబెడుతూ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో రాజాసింగ్ ఏడాది వరకు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నగరంలో మునావర్ ఫారూఖీ ప్రోగ్రామ్ జరగటానికి కారణం…
కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం… తానే హింసకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో, ఈడీ దాడులలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని చర్చ జరుగుతోందని, ఆ చర్చను పక్కదోవ పట్టించేందుకే ఈ కుట్ర చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోందని స్పష్టం చేశారు. మునావర్ ఫారుఖీ అనే వ్యక్తి సీతమ్మ వారినీ, హిందూ దేవతలని కించపరిచేలా మాట్లాడాడని, అనేక రాష్ట్రాలు అతని షోను నిషేధించాయని గుర్తు చేశారు. సరిగా ఈ సమయంలో ఆ మునావర్ ఫారూఖీ ని రాష్ట్రానికి మళ్లీ ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫారూఖ్ ఆహ్వానంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించి మునావర్ ఫారూఖీ షో నిర్వహించడం వెనుక ఉన్న…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ, శాంతి భద్రతల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తమిళిసై వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పర్యవసానంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య తలెత్తిన వివాదాల అంశాన్నీ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్, పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలనూ అమిత్‌షా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టిందని, ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర పోలీసులకు…
గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నామని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు. మొహాలిలో హోమీ భాభా క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చి సెంటర్‌ను ప్రధాని ప్రారంభించారు. మొహాలి లోని ముల్లన్‌పూర్‌లో కేంద్ర అణువిద్యుత్ విభాగం ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ సెంటర్ సహాయంతో రూ. 660 కోట్లతో ఈ 300 పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభ సభలో ప్రధాని ప్రసంగించారు. క్యాన్సర్ గురించి భయపడ వలసిన పనిలేదని, చాలామంది దీన్ని ఓడించారని ప్రధాని పేర్కొన్నారు. ఎంఆర్‌ఐ, మమోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ, బ్రాకీ థెరపీ, తదితర అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల క్యాన్సర్ ను నయం చేసే సౌకర్యాలు ఈ ఆస్పత్రిలో కల్పించారు. ఈ ఆస్పత్రి ఒక్క పంజాబ్ లోనే కాక, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్…
కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను బాలసాహిత్య పురస్కారాలకు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్ కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే ఏపీలోని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పల్లిపట్టు నాగరాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. పత్తిపాక.. బాలల తాత బాపూజీకవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోషహన్ నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత సి.నారాయణరెడ్డి శిష్యుడైన పత్తిపాక మోహన్ రాసిన బాలల తాత బాపూజీ (కవిత్వం) కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ పిల్లల కోసం అనేక రచనలు చేశారు. పురస్కారానికి ఎంపికైన బాలల తాత బాపూజీతోపాటు.. పిలల…