Author: Editor's Desk, Tattva News

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని, ఈ అవినీతి మూలాలు బయటపడుతున్నందున ఆయనకు సంకెళ్లు చేరువ కానున్నాయని బీజేపీ ఆదివారం ధ్వజమెత్తింది.  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా  పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ కరోనా బాధితులు కేజ్రీవాల్ సహాయం అర్థించిన సమయంలో ఆయన పూర్తిగా అవినీతి కుంభకోణంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు.  ఈ అవినీతి మూలాలు కేజ్రీవాల్ ముంగిటకు దారి తీసిందని పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కారని, అవినీతిపరులైన వారినెవరినీ ఉపేక్షించేది లేదని భాటియా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేష్ గుప్తా కూడా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినీతి మయమని రుజువైందని, ఈ స్కామ్ మొత్తానికి సూత్రధాని కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. అవినీతి లేనప్పుడు కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశింపగానే కొత్త ఎక్సైజ్ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారో ఆప్ ప్రభుత్వం 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని బాటియా సవాలు విసిరారు.…

Read More

రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట వాపోయారు. ఆదివారం బేగంపేటలో అమిత్ షా ఆదర్శ రైతులతో సమావేశమయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన 17 మంది ఆదర్శ రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయంవల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఫసల్ బీమా అమలు పథకంపైనా చర్చించారు.  దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు పరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ తనకు గతంలో 10 ఎకరాల…

Read More

టెలికాం రంగంలో నూతన విప్లవానికి తెరలేపుతున్న ఐదో తరం సెల్యులార్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ ‘5జీ ’భారత్‌ సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. నూతన 5జీ సాంకేతికత కారణంగా 2025 నాటికి దేశంలో రెండు కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ‘టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌’(టీఎస్‌ఎస్‌సీ) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌ ఇప్పటికే ఎమర్జింగ్‌ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఉంది. అదే తరహాలో 5జీ సాంకేతికత ఆధారంగా వచ్చే కొత్త ఉద్యోగాలను ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో…

Read More

మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మాత్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే భావన కేసీఆర్ లో కలిగినందువల్లే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోందని తెలిపారు. రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించారని చెబుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని విమర్శించారు.  ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అపోహలను తొలగించిందని డా. లక్ష్మణ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేంద్ర మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడం శోచనీయం అని విచారం వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్ర మంత్రి చెప్పని విషయాలను ఆయనకు ఆపాదించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.  మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎన్నో…

Read More

మద్యపానంను నిషేధించేందుకు లేదా వినియోగాన్ని నిరుత్సాహ పరచేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, మరొకొన్ని ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాల తోనే ఆధారపడుతున్నాయి. కానీ ప్రపంచంలో సంపన్న దేశాలలో ఒక్కటైనా జపాన్ ప్రభుత్వం మద్యపానంను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో పోటీలు పెడుతున్నది.  మద్యం తాగండని అంటూ ప్రభుత్వమే ప్రకటన విడుదల చేసింది. యువతను మద్యం వైపు ఏ విధంగా ఆకట్టుకోవాలి అంటూ కొన్ని చిట్కాలను సహితం సూచిస్తున్నది. కరోనా, ఇతర కారణాల వల్ల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జపాన్‌ ప్రభుత్వం మద్యం అమ్మకాలు మెరుగుపడేలా చేసి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది.  దీనికోసం జపాన్‌ ప్రభుత్వం అక్కడి యువతతో సాధ్యమైనంత ఎక్కువ మద్యాన్ని తాగించాని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్‌ ట్యాక్స్‌ ఏజెన్సీ ‘సేక్‌ వివా’ పేరుతో జాతీయ స్థాయిలో పోటీలను ప్రారంభించింది. ఈ పోటీలో 20-39ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపింది.  ఈ పోటీలో పాల్గొన్న యువత యూత్‌లో…

Read More

ఆర్టిమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి 2024 నాటికి వ్యోమగాములు చేరుకోడానికి వీలుగా చంద్రుని దక్షిణ ధ్రువంపై 13 ప్రాంతాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. దక్షిణ ధ్రువం అంతా కఠినమైన నేలతో, బిలాలతో నిండి ఉంటుంది. ఈ 13 ప్రాంతాలు ఒక్కొక్క దానిలో వ్యోమగాములు దిగడానికి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వ్యోమగాముల్లో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. ఇంతవరకు చంద్రుని ఉపరితలంపై మహిళలు ఎవరూ కాలు మోపలేదు.  అపోలో రాకెట్ ప్రయోగం తరువాత మానవ జాతి చంద్రుని పైకి వేసే ముందడుగుగా నాసా అభివర్ణించింది. ఇంతవరకు ఎవరూ పరిశోధించని ప్రాంతాలను ఇప్పుడు పరిశోధించనున్నారు. ఈ ప్రాంతాలు ఒక్కొక్కటి చంద్రుని దక్షిణ ద్రువానికి ఆరు డిగ్రీల అక్షాంశం పరిధిలో ఉన్నాయి. దక్షిణ ద్రువానికి అతిసామీప్యంలో ఉండడంతో శాస్త్రీయంగా చెప్పుకోతగినవి. ఈ ప్రాంతాలన్నీ శాశ్వతంగా నీడ కలిగి ఉంటాయి. మానవులు ఎవరూ ఇంతవరకు కనిపెట్టని ఈ ప్రాంతాల్లో ఖనిజాలు అపారం. …

Read More

సోషల్‌ మీడియాలో హిందుత్వ భావన గలవారు ‘బాయ్ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ చేయడంతో, ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది.  సోషల్‌మీడియాలో అమీర్‌ ఖాన్ కు కొంత  మంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్‌ ప్రచారం కావడంతో అమీర్‌ ఆర్థికంగా నష్టపోయాడు.  లాల్‌సింగ్‌ చడ్డా మూవీతో మొదలైన  బాయ్ కాట్‌ సెగ ఆ తర్వాత విడుదల  అయ్యే సినిమాలకూ తగులుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ‘లైగర్‌’ మూవీకి  బాయ్ కాట్‌  ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలుస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎవరి మద్దతు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి మద్దతిస్తున్నారు. కాగా, ఆగస్టు 25న లైగర్‌ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా విజయ్ శుక్రవారం బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో  బాయ్ కాట్‌ ట్రెండ్‌పై స్పందించాలని కోరగా  ఒక సినిమాను …

Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని, పేదల బద్ద వ్యతిరేకిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీతమ్మను నగ్నంగా చిత్రీకరించడంతోపాటు శ్రీరాముడ్ని కించపర్చిన మూర్ఖుడు మునావర్ ఫారుఖీని సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకురావడం సిగ్గు చేటని మండిపడాడ్రు.  ఈ కార్యక్రమం ద్వారా హిందువులకు ఏ సంకేతాలను పంపదల్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన హిందువులెవరూ మునావర్ ఫారుఖీ కార్యక్రమానికి వెళ్లొద్దని స్పష్టం చేస్తూ,ఆ కార్యక్రమానికి వెళ్లే వారంతా నకిలీ హిందువులేనని ధ్వజమెత్తారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న నారాయణ, చైతన్యసహా కార్పొరేట్ కళాశాలలను తక్షణమే మూసివేయించాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక్క కానిస్టేబుల్ ను కూడా నియమించలేని వ్యక్తి హోంమంత్రిగా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేని…

Read More

శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మహారాష్ట్ర నుండి హైడ్రోజన్ సెన్సింగ్ & అనాలిసిస్ టెక్నాలజీ యొక్క దేశీయ అభివృద్ధి కోసం ఒక హైడ్రోజన్ స్టార్టప్‌కు రూ. 3.29 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ స్టార్టప్ నిధులు గత సంవత్సరం భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రారంభించబడిన జాతీయ హైడ్రోజన్ మిషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. ఈ మిషన్ తన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంలో, భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా చేయడంలో ప్రభుత్వానికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇది 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మరియు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. డి ఎస్ టి కింద టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్, మహారాష్ట్రలోని మల్టీ…

Read More

అమెరికాలో గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే విగ్రహాన్ని రెండుసార్లు ధ్వంసం  చేశారు. న్యూయార్క్ నగరంలోని తులసీ మందిర్ వద్ద గాంధీ విగ్రహం ఉంది. ఈ నెల 16వ తేదీన దుండగులు ఈ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశారు.  అనంతరం అక్కడ విధ్వేష పదాలు రాశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల ఉందని, వారిని పట్టుకోవడానికి గాలింపులు చేస్తున్నట్లు  తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఖండించారు. నేరస్దులను త్వరితగతిన పట్టుకోవాలని, చట్ట ప్రకారం వారిని శిక్షించాలని కోరారు.…

Read More