Author: Editor's Desk, Tattva News

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల వారం రోజులుగా జరుపుతున్న ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా భారీ వర్షంలో గతరాత్రి వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. ఇప్పటికే నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం…

Read More

తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ నిరంకుశ పాల‌న‌ సాగుతోందని, ఏ ప‌థ‌కాన్ని స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేదనిధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారని రూపాయికి కిలో బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదని, రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోందని ఆమె విమర్శించారు.  సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర‌వ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రేషన్  దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా బియ్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె తెలిపారు. ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల ప్ర‌జ‌లే కాదు..డీల‌ర్లూ న‌ష్ట‌పోతున్నారని, రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీల‌ర్లు ఇబ్బందులు పడుతున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రతి నెలా 1 నుంచి…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి మహాత్మా గాంధీ  మానవుడు,  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తాజాగా నిరాకరించారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా కూడా తిరస్కరించారు.  దానితో ప్రతిపక్దాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన ముగ్గురు కూడా ఎన్నికలలో పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్హ్డిని ఎంపిక చేయవలసి ఉంది. ఈ విషయమై మంగళవారం ప్రతిపక్ష నేతలు శరద్ పవార్ నేతృత్వంలో సమావేశం  అవుతున్నారు.   ఈ సందర్భంగా గోపాలకృష్ణ గాంధీ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత పదవికి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి విపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ…

Read More

జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నూతన టిడిఎస్‌ (మూలం నుండి పన్ను మినహాయింపు) నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నూతన నిబంధనలతో సోషల్‌మీడియా మార్కెటింగ్‌, వైద్యులపై పన్ను భారం పడనుంది. సేల్స్‌ ప్రమోషన్‌ కోసం కొన్ని సంస్థలు ఆఫర్‌లను ప్రకటిస్తుంటాయి. వ్యాపారం నుండి పొందే ప్రయోజనాలపై (టిడిఎస్‌)ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన టిడిఎస్ నిబంధనలతో వీటిపై కూడా పన్ను విధించనున్నారు. సంవత్సరంలో రూ.20 వేల కంటే అధిక ప్రయోజనాన్ని అందించే ఏ వ్యక్తి అయినా పది శాతం టిడిఎస్‌కి అర్హులని ప్రకటించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) కొత్త నిబంధన వర్తింపుపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 కొత్త సెక్షన్‌, 194ఆర్‌ని కొత్తగా జత చేయడం ద్వారా టిడిఎస్‌ నిబంధనను ప్రవేశపెట్టింది. వ్యాపారం వృద్ధిలో భాగంగా కొన్ని కంపెనీలు వైద్యులకు అందించే ఉచిత మెడిసిన్‌ శాంపిల్స్‌తో పాటు…

Read More

తెలంగాణలోని ప్రతి పార్టీ కార్యకర్తను భాగస్వామిగా చేయడం ద్వారా జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జులై 3 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు.  రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారితోపాటు సామాన్య ప్రజలు కూడా బహిరంగ సభకు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  తెలిపారు.  జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హోటల్ నోవాటెల్ ను ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు సంజయ్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.  ఎన్ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తోపాటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్…

Read More

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారం చేపట్టగల అవకాశాలు గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపింది. ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుపనుంది.  ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలలో బిజెపి మాత్రమే రాజకీయ ప్రత్యామ్న్యాయం అనే సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నది. మరోవంక, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి, ఆదివారం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరింప చేస్తుకున్నది.  తెలంగాణాలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే నాయకత్వం మాత్రం అంతంత మాత్రంగా…

Read More

2025 నాటికి తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, ఈ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందుందని దేశ అత్యున్నత ప్రణాళిక సంస్థ నీతిఆయోగ్‌ ఓ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం దేశంలోని పట్టణజనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉండగా,  తెలంగాణ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 46.8 శాతంగా నమోదైందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. దేశంలో పట్టణీకరణ అధికంగా మూడు రాష్ట్రాలలో ఉంది. ఇందులో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే కేరళలో 47.23 శాతం నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. నగరాలను ఆర్ధిక వృద్ధి ఇంజన్‌లుగా పరిగణిస్తున్న నీతి ఆయోగ్‌ పట్టణ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాల ప్రభావం వాటి చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉపాధి ఆదాయ స్థాయిలలో బహుళ…

Read More

తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్త పుత్రుడను’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాఖ్యాలను తిప్పికొడుతూ తాను ప్రజలకు దత్తపుత్రిడిని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం ఖచ్చితంగా `సిబిఐకి దత్తపుత్రుడు’ అని తేల్చి చెప్పారు. భవిష్యత్లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదని జోస్యం చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పర్చూరులో పవన్ పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించారు. పర్చూరు బహిరంగ సభలో బాధితులకు ప్రకాశం జిల్లాకు చెందిన 80 రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతులను గుర్తించడం లేదని, కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు తప్ప…

Read More

సైన్యంలో అగ్నిపథ్‌ నియామకాలకు సోమవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్‌ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్‌ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అగ్నిపథ్‌ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్‌ అడ్మిరల్‌ (పర్సనల్‌) దినేష్‌ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్‌ త్రిపాఠి ఉద్ఘాటించారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లో…

Read More

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ అల్లర్లలో40కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆర్మీ అభ్యర్థులు వచ్చినట్లు  పోలీసులు తేల్చారు. అకాడమీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్లే అల్లర్లు జరిగినట్లు పోలీసులు కి నిర్ధారణకు వచ్చారు.  రైల్వేస్టేషన్ టార్గెట్‌గా 10 వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పడినట్లు గుర్తించారు.  వాట్సాప్ చాట్, వీడియోస్, సోషల్‌ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటి వరకు 200 మందిని పోలీసులు గుర్తించారు. విధ్వంసానికి కారణమైన వారిలో 52 మందిని శనివారం పోలీసులు గుర్తించారు. వారిలో 19 మంది గోపాలపురం పోలీసుల అదుపులో ఉండగా, మిగిలిన వారిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటుపై ఆరా తీసి నట్లు సమాచారం. విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని…

Read More