విశాఖపట్నంలో అగ్నివీర్ ల నియామకం ప్రారంభమయింది. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 18 రోజుల పాటు ఈనెల 31వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ జరుగుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే ఉత్సహంతో ఉన్న ఏపీలోని శ్రీకాకుళం, ఎన్టీఆర్‌జిల్లాలకు చెందిన వారితోపాటు, యానాంకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో శనివారం రాత్రే విశాఖ చేరుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన తేదీల వారీగా హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో తొలిరోజు రిక్రూట్‌మెంట్ కోసం స్టేడియానికి చేరుకున్నారు. రాత్రంతా స్టేడియం పరిసరాల్లోనే అభ్యర్థులు నిద్రపోయారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పగడ్బంధీగా నిర్వహించేందుకు 300 మందికి పైగా ఆర్మీ అధికారులు, సిబ్బందితో పాటు 500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరీక్షలు జరిగే స్టేడియం లోపల, అభ్యర్థులు వచ్చే మార్గాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం ఎక్కడికక్కడ సమాచారం తెలిపే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. వీటికి తోడు జిల్లా అధికారులు…
Author: Editor's Desk, Tattva News
వైవిధ్యభరితమైన భారత దేశం వైపు యావత్తు ప్రపంచం చూస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచం వైరుద్ధ్యాలతో నిండి ఉందన్నారు. ద్వంద్వాలను నిభాయించే సామర్థ్యం భారత దేశం నుంచే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘భారత్@2047 : నా దార్శనికత, నా చర్య’ అనే కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ వైవిద్ధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నిభాయించడం గురించి ప్రస్తావనకు వచ్చినపుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుందని చెప్పారు. ప్రపంచం వైరుద్ధ్యాలతో నిండిపోయిందని పేర్కొంటూ ద్వంద్వాలను నిభాయించడాన్ని కేవలం భారత దేశం నుంచి మాత్రమే తెలుసుకోగలమని ఆయన తెలిపారు. మనకు చెప్పని, సరైన రీతిలో బోధించని చారిత్రక సంఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు, సంస్కృత వ్యాకరణం జన్మస్థలం భారత దేశం కాదన్నారని చెబుతూ ఎందుకు? అని మనం ఎన్నడైనా అడిగామా? అని ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణం మనం మన జ్ఞానం, విజ్ఞానాలను మర్చిపోవడమేనని డా. భగవత్ చెప్పారు. మరోవైపు…
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ఆయన వయసు 62సంవత్సరాలు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఝున్‌ఝున్‌వాలా ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన 1985లో స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. ఆయన పెట్టుబడిదారుడిగానే కాకుండా ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. జూలై 5,1960లో మధ్యతరగతి కుటుంబంలో హైదరాబాద్ లో జన్మించిన రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఓ వైపు సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో…
మన జాతీయ జెండా వెనుక ఎంతో చరిత్ర ఉంది. ‘1857–సిపాయిల తిరుగుబాటు’ తర్వాత దేశమంతటికీ ఒకే జెండా ఉండాలని అప్పటి బ్రిటిష్ పాలకులు భావించారు. అందులో భాగంగా తయారు చేసిందే బ్రిటిష్ వలస కాలనీ జెండా. దీన్నే ‘బ్రిటిష్ ఇండియా జెండా’ అని కూడా అంటారు. ఆంగ్లేయుల పాలనలో ఉన్న మిగిలిన దేశాల్లోని జెండా మాదిరిగానే ఇదీ ఉండేది. ఎరుపు రంగులోని ఈ పతాకంలో ఎడమ వైపు బ్రిటిష్ ‘యూనియన్ జాక్’ సింబల్ ఉండేది. పతాకం కుడివైపు మధ్యలో స్టార్ గుర్తు చుట్టూ బ్రిటిష్ క్రౌన్ చిహ్నం ఉండేది.1904లో చేసిన మరో పతాకంలో చుట్టూ ఎరుపు రంగు బార్డర్ ఉండేది. అయితే, ఈ జెండాను బ్రిటిష్ ప్రభుత్వం ఓకే చేయలేదు. వందేమాతరం ఉద్యమం అప్పుడు ఒక పతాకాన్ని 1906 ఆగస్టు 7న స్వాతంత్య్ర సమరయోధుడు శచీంద్ర ప్రసాద్ తయారుచేశారు. దీన్ని ‘వందేమాతరం జెండా’, ‘కలకత్తా ఫ్లాగ్’ అని పిలిచేవాళ్లు. ఈ జెండా మూడు…
75వ స్వాతంత్య్ర భారతదేశ వజ్రోత్సవాల వేళ భారత్‌కు అంతరిక్షం నుంచి శుభాకాంక్షల సందేశాన్ని వ్యోమగామి సమంత క్రిస్టోఫొరెట్టి పంపారు. అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పని చేస్తున్న సమంత క్రిస్టోఫొరెట్టి ఓ వీడియో సందేశంలో భారత దేశానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భారతదేశాన్ని అభినందించడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు చాలా దశాబ్దాలుగా అనేక రోదసి, సైన్స్ మిషన్స్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి పని చేస్తున్నాయని ఆమె తెలిపారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న రెండు పెద్ద ప్రాజెక్టుల గురించి సమంత ప్రస్తావించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విపత్తులను గుర్తించడానికి దోహదపడే నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్‌ను అభివృద్ధిపరచడం కోసం ఇస్రో కృషి చేస్తోందని ఆమె చెప్పారు. నేటికీ సహకారం కొనసాగుతోందని సమంత క్రిస్టోఫొరెట్టి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగం వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం…
భారత దేశం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోకుండా శ్రీలంక అనుమతి ఇవ్వడంతో చైనా నిఘా కోసం ఉద్దేశించిన యుద్ధనౌక యువాన్ వాంగ్ 5 షిప్ వచ్చేవారం శ్రీలంక తీరంకు చేరుకోనుంది. చైనా స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఒక రీసెర్చ్, సర్వే షిప్ అని ఇంటర్నేషనల్ షిప్పింగ్, అనలిటిక్ సైట్లు స్పష్టం చేస్తున్నాయి. చైనా స్పై షిప్ ఆగస్టు 11నే శ్రీలంకకు రావాల్సిఉంది. అయితే భారత్ అనుమతులు ఇవ్వొద్దని సూచించడంతో లంక మొదట్లో అనుమతి నిరాకరించింది. తాజాగా ఈ యుద్ధ నౌకకు శ్రీలంక అనుమతిచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా వెల్లడించారు. స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఆగస్టు 16 నుంచి 22 మధ్య రావడానికి అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నౌకను హ్యాండిల్ చేయడానికి స్థానిక ఏజెంట్లతోనూ మాట్లాడుతామని వెల్లడించారు. ప్రస్తుతం చైనా షిప్ పోర్టు నుంచి ఆగ్నేయం వైపుగా సుమారు 1000 కి. మీ దూరంలో…
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నట్లు పలు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 40 మంది మహిళలు ఉద్యోగ హక్కుతోపాటు రాజకీయ భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ కాబుల్‌లోని విద్యాశాఖ భవనం ముందు ప్రదర్శన నిర్వహించారు. ‘ఆగస్టు 15 బ్లాక్ డే’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని.. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. అజ్ఞానంతో విసిగిపోయాం.. న్యాయం కావాలంటూ ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సమీపంలోని దుకాణాల్లో తలదాచుకున్న కొంతమంది మహిళా నిరసనకారులను వెంబడించి.. దాడులు చేశారు. అక్కడున్న కొంతమంది జర్నలిస్టులపైనా దాడికి దిగారు. దేశంలో ఇప్పటికే వేల మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. మహిళలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించారు. దూర ప్రయాణం చేయాలనుకునే మహిళలకు.. తోడుగా దగ్గరి మగ బంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం కల్పించబోమని స్పష్టం చేశారు.…
పోలీసు తుపాకిని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న ఆయన జనమంతా చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసు తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నా ఆయనను వారించకపోవడం గమనార్హం. పోలీసు తుపాకీతో కాల్పులు జరపడంతోనే ఆగిపోని శ్రీనివాస్ గౌడ్ ఆ ఫొటోలను ఎంచక్కా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరిట తెలంగాణ సర్కారు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా…
కామన్వెల్త్ లో మహిళల ప్రదర్శన అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బాక్సింగ్, జూడో, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారత మహిళలు ఆధిపత్యం చెలాయించారని ప్రశంసించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. అథ్లెట్ల కఠోర శ్రమ, స్ఫూర్తిదాయకమైన విజయాలతో దేశం ‘ఆజాదీ కా అమృత్ కాలంలోకి అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమని ప్రధాని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి నాలుగు కొత్త గేమ్‌లలో మెడల్స్ సాధించారని.. లాన్ బౌల్స్ నుండి అథ్లెటిక్స్ వరకు, అద్భుతమైన ప్రదర్శన చేశారని ప్రధాని చెప్పారు. ఈ ప్రదర్శనతో దేశంలో కొత్త క్రీడల పట్ల యువతలో ఆసక్తి చాలా పెరగనుందని పేర్కొన్నారు. కామన్వెల్త్ ద్వారా త్రివర్ణ పతాకం శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాని ప్రశంసిస్తూ అథ్లెట్లు దేశానికి పతకాలు సాధించడమే కాకుండా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని…
ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం కొరడా ఝళిపించింది. నలుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. వీరిలో టెర్రర్ ఫండింగ్ నిందితుడు బిట్టా కరాటే భార్య అస్సాబా అర్జూమండ్ ఖాన్ ఒకరు. జేకేఎల్ఎఫ్ టాప్ టెర్రరిస్టులో ఒరైన ఫరూఖ్ అహ్మద్ డర్ అలియాస్ బిట్టాకరాటే 2011 బ్యాచ్ జేకేఏఎస్ ఆఫీసర్. కాగా, ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన వారిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైయద్ సలావుద్దీన్ కుమారుడు సైయద్ అబ్దుల్ ముయీద్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖలోని సమాచార, సాంకేతిక విభాగం మేనేజర్‌గా ముయూద్ ఉన్నాడు. ఈ నలుగురు ఉద్యోగులను రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ కింద సర్వీసు నుంచి తొలగించారు. దర్యాప్తు లేకుండానే తమ ఉద్యోగులను తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ అధికరణ కల్పిస్తుంది. ఫరూక్ అమ్మద్ డర్ అలియాస్ బిట్టా కరాటే ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు…