హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో కాల్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసిపి నాయకత్వం ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. ఈ వ్యవహారాన్నిముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి విషయంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఎంపీగా ఉన్న మాధవ్ ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించినట్లున్న వీడియో కాల్ వైరల్ అయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ తప్పు తేలితే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని చెబుతూ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని చెప్పారు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ…
Author: Editor's Desk, Tattva News
హర్యానాకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుక బిష్ణోయ్‌తో కలసి గురువారం బిజెపిలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడైన కుల్దీప్ బిష్ణోయ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన భార్య రేణుక కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో బిష్ణోయ్ దంపతులు కాషాయ కండువా కప్పుకున్నారు. బిష్ణోయ్ రాక రాష్ట్రంలో తమ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తుందని ముఖ్యమంత్రి ఖట్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిష్ణోయ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, బిజెపిని బలపరిచారని ఆయన తెలిపారు. దేశం గురించి, పేదల సంక్షేమం గురించి ఎల్లప్పుడూ ఆలోచించే నరేంద్ర మోదీని భారతదేశ అత్యుత్తమ ప్రధానిగా చెప్పడంలో తప్పు లేదని ఈ సందర్భంగా బిష్ణోయ్ కీర్తించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్‌కు…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ పార్టీనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం చేసిన వినతిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్ ను ఆదేశించింది. ఏక్‌నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా లేదా అన్న అంశంపై వచ్చే సోమవారం నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. శివసేన పార్టీ తమదేనని, పార్టీ నియంత్రణ, ‘విల్లు-బాణం’ ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని షిండే ఎన్నికల సంఘం (ఇసి)ని కోరారు. దీంతో పార్టీ గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను ఈ నెల 8 కల్లా సమర్పించాలని షిండే, ఉద్ధవ్ వర్గాలను ఇసి సూచించింది. శివసేన శాసనసభా…
స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గురువారం హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యగా 1,000 అత్యాధునిక సిసి కెమెరాలను ఎర్రకోట పరిసరాలలో ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను అలెర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉగ్రదాడులు జరిగే అవకాశాలపై 10 పేజీల రహస్య నివేదికను పంపింది. స్వాతంత్ర్య దినోత్సవం జరిగే రెడ్ ఫోర్టు ప్రాంతంలో ప్రజల ప్రవేశాన్ని కట్టుదిట్టం చేయాలని ఐబీ సూచించింది.ఇటీవల జపాన్ దేశంలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షింజోఅబేపై జరిపిన కాల్పులు, ఉదయపూర్, అమరావతి నగరాల్లో జరిగిన దాడుల ఘటనలను ఇంటెలిజెన్స్ ఉదాహరించింది. ఢిల్లీ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది.జనసమ్మర్ధ ప్రదేశాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది.ప్రధాన ప్రాంతాల్లో కీలక నాయకులపై దాడులు చేయాలని పాక్ ఐఎస్ఐ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులను కోరినట్లు సమాచారం…
తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందనే తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో ప్రశాంతంగా ఒక రోజు పర్యటనను పూర్తిచేసుకొని వెనుతిరగడంతో చైనా చిందులేసింది. ఆమె తైవాన్ లో ఉండగానే తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ప్రకటించింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను కూడా ఆపేస్తున్నట్టు వెల్లడించింది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాల దిగుమతులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఈ పండ్లలో పురుగుల మందు (పెస్టిసైడ్స్ ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయని, ప్యాకింగ్‌పై పరీక్షలు చేయగా, కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంది. పదేపదే ఈ తరహా ఆనవాళ్లు గుర్తించిన తరువాత ఈ చర్యలు తీసుకున్నట్టు కారణంగా చూపింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను నిలిపివేతను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేక ప్రకటనలో నిర్ధారించింది. తన భూభాగంగా చైనా…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమ మంత్రివర్గాన్ని బుధవారం భారీ స్థాయిలో ప్రక్షాళించారు. కొత్తగా తొమ్మండుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారిలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేసిన బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు. ఆయన గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ అంతకు ముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్ టిఎంసిలో దుమారం రేపింది. పార్థాను బర్తరఫ్ చేశారు. తదుపరి తక్షణ ఆపరేషన్‌గా మమత బెనర్జీ మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. బుధవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బాబుల్ సుప్రియో, స్నేహాషిష్ చక్రవర్తి, పార్థా భౌమిక్, ఉదయన్ గుహ, ప్రదీప్ మజుందార్, బిర్భా హన్స్‌డా, బిప్లబ్ రాయ్, తజ్ముల్ హోస్సెయిన్, సత్యజిత్‌బర్మన్ మంత్రులు అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ కొత్త మంత్రులతో గవర్నర్ ఎల్ గణేశన్ ప్రమాణం చేయించారు. మంత్రులు అయిన వారిలో…
“నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి” అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. `కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్’ నేమ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ.. మీరు అని మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తాను స్పందించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఏది ఉన్నా రాజగోపాల్ రెడ్డినే అడగాలంటూ మీడియాకు తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి తనకు ఇష్టమున్న పార్టీలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆర్తి కోసం తాను 34 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని వెంకట్ రెడ్డి తెలిపారు. “‘మీరు’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా…
విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు 2022–23 బడ్జెట్‌లో రూ.592.5కోట్లు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ.1953కోట్లు కాగా, మార్చి 2022 వరకు రూ.831 కోట్లు ఖర్చు చేశారని నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. భారతీ రైల్వే సామర్థ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన ప్రాజెక్టు విజయవాడ– కాజీపేట 3వ రైల్వే లైన్ పురోగతి ప్రాజెక్టు పనులు నెమ్మదించడంపై ఎంపీ ఆరా తీశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు 2022–23 కేంద్ర బడ్జెట్‌లో రూ.592.5కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి భూసేకరణ, అటవీ క్లియరెన్స్‌లు, వివిధ అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు వంటి అనేక అంశాలు రైల్వే ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడంపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి తెలిపారు. 2014నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఏపీ ఇన్‌ఫ్రా…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇడి షాకిచ్చింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్‌లో బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ తెవరకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హెరాల్డ్ హౌస్ సీల్‌కు సంబంధించి ఇడి నుండి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి వుంది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుండి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాలు ఉన్నాయి. అలాగే 10 జన్‌ఫథ్‌లోని సోనియా గాంధీ నివాసం, ఎఐసిసి ప్రధాన కార్యాలయాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లను ఇడి విచారించిన సంగతి తెలిసిందే. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు…
ఎస్ బ్యాంక్‌డిహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంకు రుణాల అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. మహారాష్ట్ర బిల్డర్లు అవినాష్ భోసలే , సంజయ్ ఛాబ్రియా నుంచి రూ. 415 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ బుధవారం జప్తు చేసింది. గత జూన్‌లో ఈ ఇద్దరు బిల్డర్లను గత జూన్ లో ఈడీ కస్టడీ లోకి తీసుకోగా, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. భోసలేకు చెందిన రూ. 164 కోట్ల ఆస్తులు, ఛాబ్రియాకు చెందిన రూ.251 కోట్ల ఆస్తులు జప్తు చేసేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ను ఈడీ మంగళవారం జారీ చేసింది. ఛాబ్రియా నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో శాంతాక్రూజ్‌లో రూ. 116 కోట్ల విలువ చేసే ఒక ప్లాట్, ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద చాబ్రియాకు చెందిన హోటల్ ప్రాఫిట్ రూపం లోని రూ.13.67 కోట్లు, రూ. 3.10…