అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా వాంతులు, వికారంతో చాలామంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి వైద్యం అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. హాస్పటల్స్ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బి షిఫ్ట్‌లో పని చేసేందుకు ఫ్యాక్టరీకి 4 వేల మంది కార్మికులు వచ్చారు. మధ్యాహ్నం సమయంలోనే గ్యాస్ లీక్ అవుతున్నట్లు కొంత మంది ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడి సిబ్బంది ఆ వార్తలను కొట్టి పడేసినట్లు తెలుస్తోంది. సమయం గడిచే కొద్ది వాయువు గాఢత పెరిగి పలువురు మహిళలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. వెంటనే అక్కడి సిబ్బంది మహిళలందరినీ…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తప్పుడు డిజైన్లతో, ఎటువంటు అనుమతుల్లేకుండా నిర్మించారని, అందుకనే ఈ మధ్య వరదలకు ముంపుకు గురయినదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మంగళవారం పవిత్ర క్షేత్రం యాదాద్రి వద్ద నుండి జెండా ఊపి ప్రారంభిస్తూ అందుకనే ఆ ప్రాజెక్ట్ కు తమ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేక పోయినదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన మూడు ఆనకట్టలు మునిగిపోయాయబం అండర్ గ్రౌండ్ లో ఉన్న పంప్ హౌస్ మునిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుడు డిజైన్ తో నిర్మించారని, ఇంజినీరింగ్ లోపముందని పేర్కొంటూ సరైన ప్లానింగ్ లేకపోవడంవల్ల ప్రాజెక్టు ముంపుకి గురైందని స్పష్టం చేశారు. కేసీఆర్ అక్రమ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారని చెబుతూ అదెలా సాధ్యం? అని ప్రశ్నించారు. జాతీయ హోదా ఇస్తే…
చైనా బెదిరింపులను ఖాతరు చేయకుండా, తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ అడుగుపెట్టారు. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత అడుగుపెట్టడం ఇదే కావడంతో అమెరికా – చైనా మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్నాయి. రెండు దేశాలు తమ సేనలను మోహరిస్తున్నాయి. దానితో చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో ఆమె …
ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించాయిరు. మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం సాయంత్రం ప్రకటించారు. మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే తాను ఈ పోరాటం చేయనున్నట్లు చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ “మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై…
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలపై డిస్‌ప్లే పిక్చర్ల(డిపి)ను జాతీయ పతాకంతో మార్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాక వేడుకలను సమష్టిగా జరుపుకోవడానికి ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాలపై డిపిలను జాతీయ జెండాతో మార్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా.. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా ఇతర సీనియర్ బిజెపి నాయకులు కూడా ప్రధాని పిలుపునకు స్పందించి తమ డిపిలను మార్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్‌తోపాటు పలువురు బిజెపి నాయకులు తమ ట్విట్టర్‌పై ప్రొఫైల్ పిక్చర్లను జాతీయ పతాకంతో మార్చారు. ఆగస్టు 2వ తేదీ ఎంతో ప్రత్యేకమైనదని, మన త్రివర్ణ పతాక వేడుకలను జరుపుకునేందుకు ఒక సమష్టి ఉద్యమం ప్రారంభమైందని, హర్ ఘర్ తిరంగ నిర్వహించేందుకు యావద్దేశం సంసిద్ధమైందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు…
దేశంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఢిల్లీలో తాజాగా మరో కేసు నమోదవగా, మొత్తం అక్కడ కేసుల సంఖ్య మూడుకు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8 కేసులు నమోదవగా..అందులో ఢిల్లీలో మూడు, కేరళలో ఐదు కేసులు ఉన్నాయి. కాగా రోగ నిర్ధారణ, వ్యాక్సిన్ ల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారతదేశంలో మొదటి కేసు జూలై 14న కేరళలో నమోదవగా, అంతకుముందు మే 1న కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనుమానిత కేసుల నుండి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు పంపుతున్నట్లు వెల్లడించారు మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కొనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో…
పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో అరెస్ట్ అయి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కలసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా చటర్జీపై అంటాలా ప్రాంతంలో ఒక మహిళ చెప్పు విసిరింది. అయితే ఆమె విసిరిన చెప్పు చటర్జీని తాకకుండా పక్కన పడింది. చటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీకి చెందిన రెండు అపార్ట్‌మెంట్లలో ఇటీవల రూ. 50 కోట్ల నగదు, భారీ మొత్తంలో బంగారు నగలను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అవినీతికి పాల్పడిన చటర్జీపై ఆగ్రహంతోనే తానీ చర్యకు పాల్పడినట్లు మధ్యవయస్కురాలైన శుభ గౌరీ అనే మహిళ విలేకరులకు తెలిపింది. చటర్జీని చెప్పుతో కొట్టాలనే తాను ఇక్కడకు వచ్చానని, ఉద్యోగం లేకుండా ప్రజలు రోడ్ల మీద తిరుగుతుంటే పార్థా చటర్జీ మాత్రం అపార్ట్‌మెంట్ తర్వాత అపార్ట్‌మెంట్ కట్టుకుంటూ భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవడాన్ని తాను…
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట నుండి మంగళవారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటగా, ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. యాదగిరిగుట్టకు బయల్దేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, యాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభ సూచికగా, స్థానిక వంగపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి నుంచి జనగామ జిల్లా మీదుగా వరంగల్‌కు చేరుకుంటుంది. వరంగల్‌లోని భద్రకాళిని దర్శించుకుని యాత్రను ముగిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. తొలిరోజు బండి సంజయ్ 10.5 కి.మీ. మేర పాదయాత్ర చేస్తారు. యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట…
అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్న అమెరికా బలగాలు, ఎట్టకేలకు గురిచూసి అతడు కాబూల్‌లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రపంచంలోనే `మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్’గా ముద్రపడిన అతడిని తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోనే, నేరుగా గురిచూసి డ్రోన్ తో మట్టుబెట్టడం గమనార్హం. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు కొన్ని నెలల ముందు నుంచి సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్‌ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య…
కరోనా మహమ్మారి, కరోనా రెండో దశ, ఒమిక్రాన్, రష్యాాఉక్రెయిన్ వంటి సమస్యలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణాన్ని 7 శాతం లేదా దాని కంటే దిగువకే ఉంచామని, దీనిని అందరూ గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవు చెప్పారు. సోమవారం రాత్రి లోక్‌సభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం లేదని భరోసా ఇచ్చారు. అయితే, మంత్రి సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని కాంగ్రెస్ సభ్యులు మంత్రి ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉంది. యుపిఎ పాలనలో 2004 నుంచి 2014 వరకూ కాలంలో ద్రవ్యోల్బణం రెండెంకెలకు వెళ్లింది. వరసగా 22 నెలల పాటు 9 శాతానికి పైగానే ఉంది’ అని మంత్రి గుర్తు చేశారు. ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం ఎక్కుగా ఉందని ఆమె అంగీకరించారు. అయితే, ప్రపంచంలో…