రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలు వారం పాటు సస్పెండ్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా నిరసనలు, ఆందోళనలతో అడ్డుపడుతున్నారనే కారణంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎంపీలు సభను వీడక నిరసన తెలుపుతుండడంతో సమావేశాలను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాజ్యసభ నాయకుడు, మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, భారమైన హృదయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా చైర్మన్ విజ్ఞప్తులను వీళ్లు పట్టించుకోలేదని తెలిపారు. ఆర్థిక మంత్రి…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణతో పోలిస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువేనని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువేనని తెలిపారు. తెలంగాణ ద్రవ్యలోటు 4.13 ఉంటే, ఏపీది 3 శాతం మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. 2014-15లో ఏపీ ద్రవ్యలోటు రూ.20,745 వేల కోట్లుగా ఉంటే, 2021-22 నాటికి రూ.25,195 కోట్లకు చేరిందని తెలిపారు. ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ద్రవ్యలోటు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని బుగ్గన స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే తక్కువ అప్పులే చేశామని చెప్పారు. ఎంతో నిబద్దతతో తాము పాలన కొనసాగిస్తున్నామని పేర్కొంటూ 2014-19 మధ్య కాలంలో టీడీపీ బాధ్యత లేకుండా…
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను ఆయా రాజకీయ పార్టీలే నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవి ఇస్తాం.. ఇవి ఇస్తామంటూ ఉచిత హామీలు ఇవ్వడాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇలాంటి హామీలు ప్రమాదకరంగా అభివర్ణించింది. వీటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఉచితాల కోసం రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జనవరి 25వ తేదీన సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం దీనిపై విచారణ జరిపింది. హామీలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయనే విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది.ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…
టీఆర్‌ఎస్, కాంగెర్స్ పార్టీ లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించాయిరు. ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ లోని సహచరులతో తనకు 20 ఏళ్ళ అనుబంధం అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తమ పంచాయితీ కేసీఆర్‌తో మాత్రమేనని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని తాను కాస్త ముందుగా ఎదిరించానని, అదే బాటలో నడిచేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చాలామంది ఇప్పుడే బహిర్గతం కాలేకపోతున్నారని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా, ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానంలో…
అన్నాడీఎంకే నాయకత్వంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయంను కైవసం చేసుకొని, ప్రత్యర్థి పన్నీర్ సెల్వంను పార్టీ నుండి బహిష్కరించడంతో విజయం సాధించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ఇప్పుడు అధికారమలో ఉన్నప్పుడు రహదారుల నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఈ విషయమై నమోదై మూడేళ్ళుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు రహదారుల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సమీప బంధువులకు ఆ కాంట్రాక్టులను అప్పగించారన్న ఆరోపణలు వచ్చాయి. వాటిపై సీబీఐతో పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అలాగే, రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు కూడా ఆయన ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టింది. ఈ విచారణలో మొత్తం రూ.4,800 కోట్ల మేర అవినీతి జరిగినట్టు గుర్తించింది. అదేసమయంలో…
మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం దేశం లోని నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష అమలు చేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని ప్రకటించింది. ఉరిశిక్ష పడిన వారిలో అంగ్‌సాన్ సూకీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ మాజీ చట్టసభ సభ్యుడితో పాటు ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్‌ఎల్‌ఎ పోయో జియా థావ్, ప్రజాస్వామ్య ఉద్యమకారులు కో జిమ్మీ, హలా మియా అంగ్, అంగ్ తురా జా ఉరి కంబం ఎక్కారు. గత ఏబై ఏళ్లలో మయన్మార్‌లో ఇదే మొదటి ఉరిశిక్షకావడం గమనార్హం. తన భర్తను ఉరి తీసినట్టు తనకు తెలియదని పోయో జియో థావ్ భార్య అక్కడి ప్రముఖ వార్తా పత్రికకు తెలిపారు. అంగ్‌సాన్ సూకీ పార్టీలో పోయో థావ్ కీలక నేతగా ఉండేవారు. ఈ నలుగురికీ జూన్ లోనే మరణ శిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటించింది.…
రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాళ్ల ముఠాను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అనేక చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో నింందితులుగా మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్ బంద్‌గర్, కర్నాటకలోని బెల్గామ్‌కు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూర, మొహమ్మద్ ఐజాజ్ ఖాన్‌లను నిందితులుగా సిబిఐ తన చార్జీషీట్‌లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. తనను తాను సీనియర్ సిబిఐ అధికారిగా చెప్పుకున్న బంద్‌గర్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో తనకు సంబంధాలు ఉన్నాయని, భారీ డబ్బు ముట్టచెబితే ఎటువంటి పనినైనా తాను చేయించగలనని బూర, అరోరా, ఖాన్, నాయక్‌ల వద్ద నమ్మబలికాడడని సిబిఐ ఆరోపించింది. దీంతో వీరంతా ముఠాగా ఏర్పడి రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు, వివిధ ప్రభుత్వ సంస్థలలో చైర్మన్ పదవులు,…
ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల మొత్తం వరకు లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి ముందు స్పీకర్ ఓం బిర్లా వారిని సత్ప్రవర్తనతో ప్రవర్తించాలని, నిరసన తెలియజేయాలనుకుంటే సభ వెలుపల ప్లకార్డులు పట్టుకోవాలని హెచ్చరించారు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, జోతిమణి, రమ్య హరిదాస్, టిఎన్ ప్రతాపన్. స్పీకర్ చర్య అనంతరం నలుగురు పార్లమెంటు మైదానంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. తమ ఎంపీల్లో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తేందుకు మా ఎంపీలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, మైదా, మజ్జిగ తదితర వస్తువులపై జీఎస్‌టీ విధింపు తదితర అంశాలను లేవనెత్తుతూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ…
దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించా రు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రెండో మహిళా రాష్ట్రపతి కాగా.. తొలి గిరిజన రాష్ట్రపతి కావడం విశేషం. దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య…
దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ హెచ్చరించారు. తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై వివరిస్తూ బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామని వెల్లడించాయిరు. ‘మన యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీని తరిమికొడతాం. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తాం. చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తాం. చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, మన విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోంది’ అని స్పష్టం చేశారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా మద్దతుగా నిలుస్తోందని, తైవాన్‌తో సహా పొరుగువారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. అప్పులు…