సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్‌లను ఏర్పాటు చేయనున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం జమ్మూలో నిర్వహించిన సాయుధ బలగా ల అమరవీరులకు నివాళి కార్యక్రమం ‘కార్గిల్ విజయ్ దివస్’లో పాల్గొంటూ దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో అమరులైన సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. కార్గిల్‌లో ఆపరేషన్ విజయ్‌లో చేపట్టిన సంయుక్త కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని జాయింట్ థియేటర్ కమాండ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే దేశంగా ఎదిగిందని తెలిపారు. మనదేశంపై చెడు దృష్టితో ఎవరు ఉన్నా వారికి తగిన సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి హెచ్చరించారు ఏ యుద్ధంలోనైనా భారత్ గెలుస్తుందని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం…
Author: Editor's Desk, Tattva News
భవిష్యత్ తరాల కోసం పర్యావరాణాన్ని రక్షించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 14వ రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా జాతిని ఉద్దేశించి కోవింద్ ప్రసంగించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న తమ మూలాలను యువత మనస్సులో ఉంచుకోవాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘దేశ ప్రథమ పౌరుడిగా నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వాల్సి వస్తే.. అది ఇదే’ అని రామ్‌నాథ్ పేర్కొన్నారు. తన ఐదేళ్ల పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, ఎస్.రాధాకృష్ణన్, ఎపిజె అబ్దుల్ కలాం వంటి గొప్ప రాష్ట్రపతులకు తగిన వారసునిగా ఉండటానికి తీవ్రంగా కృషి చేశానని తెలిపారు. తన ముందు పదవీలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని చెప్పారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని యువతరం మరింత ఉన్నత…
ఇటీవలి సంవత్సరాలలో, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ఇండియా స్టాక్ ద్వారా ఉత్ప్రేరకంగా ఆర్థిక చేరికలను మరింతగా పెంచడంలో భారతదేశం వేగవంతమైన పురోగతిని సాధించింది. ఏది ఏమైనప్పటికీ, క్రెడిట్ వ్యాప్తి అనేది ఒక విధానపరమైన సవాలుగా మిగిలిపోయింది. ముఖ్యంగా దేశంలోని 63 మిలియన్ లకు పైగా గల ఎంఎస్ఎంఇ లు జీడీపీలో 30 శాతం, ఉత్పాదక ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతులలో 40 శాతంకు దోహదపడుతున్నాయి. అదే సమయంలో జనాభాలో గణనీయమైన వర్గానికి ఉపాధిని కల్పిస్తుంది.గత కొన్ని సంవత్సరాలుగా, జన్ దన్-ఆధార్-మొబైల్ (జామ్) త్రిమూర్తులు, ఆధార్ ద్వారా ఉపయోగించిన డిజిటలైజేషన్ తో ఆర్థిక చేరిక భారతీయులకు వాస్తవంగా మారింది. ఇది అసాధారణమైన స్వీకరణను అందించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఇ) ద్వారా మాత్రమే సాధ్యమయింది. యుపిఇ అక్టోబర్ 2021లో రూ 7.7 ట్రిలియన్ల విలువైన 4.2 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. యుపిఇని సంభావితం చేయడంలో ప్రభుత్వం తీసుకున్న ప్లాట్‌ఫారమ్ విధానం…
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆ మేరకు పంచాయితీలలో తీర్మానాలు చేసిన ఈ గ్రామాలు, ఆ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా అందజేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఇప్పుడు ఐదు గ్రామాలు తెలంగాణ లో కలపాలంటూ విలీన గ్రామాల్లో రాస్తోరోకో లు చేయాలని పిలుపునివ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాస్తారోకో లను నిషేధించింది. వరదలు నేపథ్యంలో ఆందోళన చేయటానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేయడంతో విలీన గ్రామాల ప్రజలు భద్రాచలం సమీపంలో రాస్తా రోకో లు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య పాల్గొని మద్దతు పలికారు. ఇదిలా ఉంటె తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో గత వారం…
ఐదు నెలలుగా భీకరంగా పోరాడుతున్న రష్యా, ఉక్రెయిన్మధ్య శనివారం కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆహార సంక్షోభం నుంచి ఊరట కల్పిస్తూ రెండు దేశాలు ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి. అయితే, ఆ ఒప్పందాన్ని గంటల్లోనే రష్యా ఉల్లంఘించి బ్లాక్సీలోని ఉక్రెయిన్ కు చెందిన ఒడెసాపోర్టులో 20 మిలియన్‌టన్నుల ధాన్యంతో పాటు ఇతర ధాన్యం నిల్వలను రష్యా యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. ఈ ధాన్యాన్ని బ్లాక్‌సీ మీదుగా ఉక్రెయిన్రవాణా చేసేందుకు తాజా ఒప్పందం వీలు కల్పిస్తుంది. యుద్ధంవల్ల ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారని, రష్యా–ఉక్రెయిన్మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో ఆకలి సమస్య కొంతైనా తీరుతుందని యునైటెడ్నేషన్స్(యూఎన్) పేర్కొంది. ఈ ఒప్పందంతో ఇక గోధుమల ధరలు దిగి వస్తాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇస్తాంబుల్‌లోని డోల్మబాచి ప్యాలెస్‌లో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్…
ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితాలో తెలంగాణ కుర్రాడికి స్థానం దక్కింది. ఫోర్బ్స్ ఇండియా-గ్రూప్ ఎం-ఐఎన్‌సీఏ సంయుక్తంగా భారత టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాను విడుదల చేశాయి. ఇందులో గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్‌కు 32వ స్థానం లభించింది. డిజిటల్ స్టార్స్ ఎంపిక కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హాస్యం, అందం, ఫ్యాషన్, వ్యాపారం-ఆర్థికం, ఫిట్‌నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సామాజిక సేవ కేటగిరీల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వారిని దీనికి ఎంపిక చేశారు. ఈ జాబితాలో గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్‌కు 32వ స్థానం లభించింది. ఇదే కాలనీలో హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 2011లో తెలుగు ‘టెక్‌ట్యూట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్ ద్వారా కంప్యూటర్ కోర్సులు, మొబైల్ టెక్నాలజీ, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, జీమెయిల్ వాడకంలో ట్రిక్స్ చెబుతూ, సందేహాలు నివృత్తి చేస్తున్నాడు. అలాగే, అప్‌డేటెడ్ వెర్షన్లు, మార్కెట్లోకి వచ్చే మొబైల్…
ఆగష్టు 2 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మొత్తం దృష్టి అంతా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో జరిపే బహిరంగ సభపైననే బిజెపి శ్రేణులు సారిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్దీ నెలల క్రితం వరంగల్ లోనే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం గమనార్హం. ఆ సభలో పెద్ద ఎత్తున జనసమీకరణతో పాటు, పార్టీ నేతలు అందరూ ఉమ్మడిగా టి ఆర్ ఎస్ ను ఎదుర్కొని, తెలంగాణాలో అధికారంలో రావాలనే కసితో ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. కేసీఆర్ కు తామే ప్రత్యామ్న్యాయం అని ప్రచారం చేస్తున్న బిజెపి ఇప్పుడు ప్రతిష్టాకరంగా తీసుకొని వరంగల్ లో రాహుల్ ప్రసంగించిన వరంగల్‌లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే, అంతకన్నా రెంట్టింపు శాఖలో జనసమీకరణ జరిపి తమ ప్రాబల్యం చాటుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఎప్పటివలెనే ఈ ముగింపు సభలో కూడా కేంద్ర హోమ్…
గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమోషనల్ అయ్యారు. ’18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష‍్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది?’ అని ఆమె ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే తన కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తన కుమార్తె రాజకీయ నాయకురాలు కాదని, సాధారణ విద్యార్థిని మాటమే అని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ‘18 ఏళ్ల నా కూతురి…
శివసేన మాదంటే మాదేనని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఎన్నికల కమిషన్ చెంతకు చేరింది. అసలైన శివసేన వర్గం మాదేనని, పార్టీని పూర్తి స్థాయిలో తమకు అప్పగించాలని ఏక్‌నాథ్ వర్గం ఎన్నికల కమీషన్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ కోసం మెజార్టీ నిరూపించుకోవాలని, అందుకు సంబంధించిన పత్రాలను ఆగస్టు 8వ తేదీలోగా సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన షిండే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి, బిజెపి మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటు 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గం వైపుకు రాగా, 12 ఎంపిలు సైతం ఉద్ధవ్‌కు షాక్‌నిచ్చారు. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, అసలైన శివసేన తమదేనంటూ ఏక్‌నాథ్ షిండే వర్గం చెబుతూ వస్తోంది. తమదే అసలైన పార్టీగా…
జాతి ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగండని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తన వీడ్కోలు ప్రసంగంలో రాజకీయ పార్టీలను కోరారు. ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించండని సూచించారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయమని సంభోదించిన కోవింద్ సభలో చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని వినియోగించాలని కోరారు. పార్లమెంట్‌లో చర్చ, అసమ్మతి తెలియజేసే సమయంలో ఎంపిలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పెద్ద కుటుంబంలాంటిదని చెబుతూ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే అన్నా రు. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పార్టీలకు హితవు చెప్పారు. తమ వ్యతిరేకతను తెలపడానికి రాజకీయ పార్టీలు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాలు అనుసరించి లక్ష్యాలను సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు సభలో ఉన్న ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితరులు హర్షధ్వానాలు తెలిపారు. వివిధ ప్రభుత్వాలు చేసిన కృషి కారణంగా ఎంతో అభివృద్ధి జరిగిందని కోవింద్ చెప్పారు. తాను వర్షానికి…