Author: Editor's Desk, Tattva News

పశ్చిమబెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్యశాఖా మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేసింది. ఉపాధ్యా య రిక్రూట్‌మెంట్‌ స్కాంతో ముడిపడిన ఉన్న మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఛటర్జీని ఇడి అరెస్టు చేసింది. శుక్రవారం ఆయనకు ఆప్తురాలుగా భావిస్తున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో ఇడి అధికారులు రూ. 20 కోట్ల  నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు ఛటర్జీని శుక్రవారం రాత్రి విచారించారు. ఈ విచారణకు ఆయన సహకరించకపోవడంతో మంత్రిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ కుంభకోణం బయటపడినప్పుడు చట్టర్జీ విద్యామంత్రిగా ఉన్నారు.  ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 20 కోట్ల నగదు ‘ఎస్‌ఎస్‌సి’లోని నగదు అని ఇడి అధికారులు అంచనా వేశారు.  ఆమె ఇంట్లో మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే ఉన్నాయి. ఇరవైకి పైగా మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అర్పితతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్ముకుఊహించినదానికన్నా ఎక్కువ మెజారిటీతో ఆమె విజయం సాధించడం విశేషం. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి తమ ఓట్లు చీలిపోకుండా చూడడానికి గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలనుంచి దాదాపు 126 మంది ఎంఎల్‌ఎలు, 17 మంది ఎంపిలు ఆమెకు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అసోంలో ఏకంగా 25 మంది విపక్ష ఎంఎల్‌ఎలు ముర్ముకు అనుకూలంగా ఓటేశారు. అసోం అసెంబ్లీలో 126 మంది సభ్యులుండగా, ఎన్‌డిఎకు 79 మంది ఎంఎల్‌ఎలున్నారు. కానీ ఆ రాష్ట్రంనుంచి ముర్ముకు 104 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ విపక్ష ఎంఎల్‌లకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక మధ్య ప్రదేశ్‌లోనూ ముర్ముకు 16 ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఆ…

Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు మరోమారు కధనాలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్‌ షాలతో చర్చలు జరిపారని అంటున్నారు.  వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారని , ఈ సమావేశానికి జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్‌ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తున్నది. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా సూచించారని , దీనికి రాజగోపాల్‌ ఓకే చెప్పారని అంటున్నారు. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతూ వస్తున్న ఆయన  తాజాగా కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతానంటూ ఆ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.  “బీజేపీ నేతలు పిలుస్తున్నారు. కానీ..నేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తా” అని చెప్పారు. అమిత్ షాను కలిసింది నిజమేనని.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ప్రకటించారు. …

Read More

అర్హులైన ఉద్యోగాలు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ ప్రికాషన్ డోసులు సమకూర్చేందుకు వీలుగా అన్ని ఉద్యోగ ప్రదేశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించాలని కేంద్రం అన్ని శాఖలను ఆదేశించింది.ప్రికాషన్ డోసుకు అర్హులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ వారీగా విడివిడిగా రూపొందించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ తన తాజా ఉత్తర్వులో ఆదేశించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్‌ను ప్రారంభించింది. రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలలు(25 వారాలు) పూర్తి చేసుకున్న అర్హులైన ప్రజలందరికీ ప్రికాషన్ డోసును ఉచితంగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు 75 రోజుల్లోపల అన్ని ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని అన్ని శాఖలను కేంద్రం ఆదేశించింది. కేరళలో మూడో మంకీపాక్స్…

Read More

శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా దేశ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన దినేశ్ గుణవర్ధనే నియమితులయ్యారు. దేశ నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘె ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో 18 మంది సభ్యులతో శుక్రవారం నూతన మంత్రివర్గం ఏర్పాటు చేశారు.  ప్రధానమంత్రి బాధ్యతలను సీనియర్ నాయకుడు దినేశ్ గుణవర్ధనేకు అప్పగించారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుణవర్ధనె గతంలో విదేశాంగ, విద్యాశాక మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి అద్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయనను హోంమంత్రిగా నియమించారు.  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో రాజపక్స కుటుంబం గద్దె దిగాల్సి వచ్చింది. మొదట ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా తన పదవికి రాజీనామా చేసి సింగపూర్‌కు పారిపోయారు.  దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ్ సింఘెను మెజారిటీ పార్లమెంటు సభ్యులు అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో…

Read More

దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సిద్దమయింది బిలియనీర్‌, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్‌వర్క్‌లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్‌లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించించారు. ఇప్పటికే తొలి బోయింగ్‌ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉంది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737…

Read More

శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ ఫోటో ఎంపికైంది. అలాగే నాట్యం సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ కొరియోగ్రఫర్ గా సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ గా టీవీ రాంబాబుకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘అల వైకుంఠపురం’ సినిమాకుగానూ తమన్ కు అవార్డు దక్కింది.  2020లో వచ్చిన కలర్ ఫోటో  సినిమా భారీ విజయాన్ని అందుకుంది.   కలర్‌ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందని సినిమా హీరో సుహాస్‌ తెలిపారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని చెప్పారు. సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సూరయై పొట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా’ సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.  అదే సినిమాలో హీరోయిన్‌గా…

Read More

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాత్కాలిక ప్రధానిగా, అధ్యక్షునిగా నిరసనకారుల పట్ల కొంతమేరకు ఉదాసీనంగా వ్యవహరించిన రణీల్‌ విక్రమ సింఘే అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నిరసనకారుల పట్ల ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. అధ్యక్షుడి సెక్రెటేరియట్‌ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనులు చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే.. తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్‌ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు కొత్త అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని…

Read More

భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. ఈ నెల 25వ తేదీన ఆమె అధికారికంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలసి స్వయంగా ముర్ము వద్దకు వెళ్లి ఆమెను అభినందించారు. గిరిజన సమాజానికి చెందిన బిడ్డ.. అత్యున్నత పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. ద్రౌపది ముర్ము గెలుపు ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని…

Read More

‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్‌ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తోనే ముంపునకు గురయ్యాయని పేర్కొంటూ ఇరిగేషన్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి రీడిజైన్‌ పేరు తో రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. గురు వారం సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి నుంచి బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్‌ ర్యాలీని సంజయ్‌ బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల బాధలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘దేశ్‌ కీ నేత.. దిన్‌ బర్‌ పీతా.. మోదీపే రోతా.. ఫాంహౌస్‌ మే సోతా.. అమాస పున్నానికి ఆతా..’ అంటూ ఎద్దేవా…

Read More