Author: Editor's Desk, Tattva News

`పెద్దల సభ’గా భావించే రాజ్యసభకు ఒకప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయంగా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసే వారు. అయితే రానురాను రాజకీయ పార్టీలు వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతలకు, లేదా పలుకుబడి కలిగిన వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించడం మొదలు పెట్టాయి. దీంతో ఇప్పడు రాజ్యసభలో కూడా రాజకీయ నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. రాజ్యసభ సిట్టింగ్ ఎంపిలలో 39 మందిపై ప్రకటించిన క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాగే వారి సగటు ఆస్తుల విలువ రూ.79.54 కోట్లుగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్( ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ కలిసి రూపొందించిన నివేదిక వెల్లడించింది. రాజ్యసభలోని మొత్త 233 మంది సభ్యుల్లో 222 మంది సభ్యులు ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన నేరాలు, ఆర్థిక స్థితిగతులు, ఇతర వివరాలను ఈ సంస్థలు విశ్లేషించాయి. ప్రస్తుత రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, ఇద్దరు సభ్యుల అఫిడవిట్‌లు అందుబాటులో లేకపోవడంతో విశ్లేషించలేదని, జమ్మూ, కశ్మీర్‌కు…

Read More

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాకరమైన రాయదుర్గంలో నిర్మించిన టీహబ్ కొత్త ఫెసిలిటీ (టీ-హబ్ 2.0) సెంటర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించారు. ప్ర‌పంచంలో యువ భార‌త్ సామ‌ర్థ్యాన్ని తెలుపాల‌ని టీ హ‌బ్ ప్రారంభించిన‌ట్లు ఆయన చెప్పారు. 2015లో మొద‌టి ద‌శ టీ హ‌బ్‌ను ప్రారంభించామ‌ని గుర్తు చేశారు. ఏడేళ్ల త‌ర్వాత టీ హ‌బ్‌ రెండో ద‌శ ప్రారంభించ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని తెలిపారు. ఏడేళ‌ల్లో టీహ‌బ్ ద్వారా 1200 అంకురాల‌కు స‌హ‌కారం అందించిన‌ట్లు చెప్పారు. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అంకురాలు దోహ‌దం చేస్తాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. టీ హ‌బ్‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారుల‌ను అభినందించారు. హైద‌రాబాద్‌ను స్టార్ట‌ప్ క్యాపిట‌ల్‌గా రూపొందించ‌డ‌మే తమ ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌పంచంలో హైద‌రాబాద్ ఉత్త‌మ న‌గ‌ర‌మ‌ని పేర్కొంటూ తెలంగాణ.. స్టార్ట‌ప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉండ‌బోతుంద‌ని పేర్కొన్నారు. యువ వ్యాపార‌వేత్త‌ల‌ను త‌యారుచేయ‌డమే టీ హ‌బ్ ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. స్టార్ట‌ప్‌ల‌కు ప్ర‌భుత్వ‌మే…

Read More

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అడ్లూరి లక్షణ్ పిటిషన్ను విచారణ చేపట్టేందుకు కోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ విజేతగా నిలిచారు. అయితే, ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు ప్రకటించారని అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకెక్కారు.  ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని, ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కొప్పుల ఈశ్వర్త న ఎన్నిక చెల్లదని చెప్పేందుకు అడ్లూరి లక్ష్మణ్ తగిన…

Read More

వారం రోజులకు పైగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడానికి బిజెపి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఎకనాథ్ షిండేతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఫడ్నవీస్ నివాసంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబట్టేలా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోందని తెలుస్తోంది. మరోవైపు ఏక్ నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేతలను ఆయన కలువనున్నారని సమాచారం. అనంతరం ముంబాయికి వెళ్లి నేరుగా గవర్నర్ ను కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు బలం నిరూపించుకొనేలా…

Read More

జులై 2, 3 తేదీలలో హెచ్‌ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, 3 వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా భద్రతలో భాగంగా కనీసం ఐదువేల మంది పోలీసులను మోహరింప చేస్తున్నారు. సమావేశ వేదిక వెలుపల రాష్ట్ర పోలీసులు మూడంచెల భద్రతా విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఎస్‌పీజీ కమాండోలు, కేంద్ర భద్రతా సిబ్బంది హెచ్‌ఐఐసీ, నోవాటెల్‌ మైదానాల్లో కాపలాగా ఉంటారు. ఎస్‌పీజీలు, ఇతర కేంద్ర బలగాలతో కమ్యూనికేట్‌ చేయడానికి, భద్రతా సంస్థలతో సమన్వయం చేయడానికి, పరిమిత సంఖ్యలో ఐపీఎస్‌ అధికారులను మాత్రమే సమావేశ మందిరం లోపల అనుమతించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం, ఎస్‌పీజీ సీనియర్‌ అధికారులు తెలంగాణ పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా చర్యల గురించి మరింత తెలుసుకున్నారు. ప్రధానమంత్రి మినిట్‌…

Read More

కొత్త కొత్త పంథాలలో సైబర్ నేరగాళ్లు జనాలకు వల విసురుతున్నారు. కేవలం సామన్యులకే కాదు రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులకు సైబర్ నేరగాళ్లతో సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు.. ఈ సారి ఏకంగా తెలంగాణ డీజీపీ పేరు, ఫొటో కూడా వాడుకున్నారు. 97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన కేటుగాళ్లు కొందరిని డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులులు కూడా ఉన్నారట. సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్…

Read More

ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండదండలు అందిస్తామని ఆర్థికంగా అభివృద్ధి చెందిన జి 7 సదస్సు సభ్య దేశాలు సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వీడియా ద్వారా మరోసారి తమ నిబద్ధతను స్పష్టం చేశాయి. రష్యా చమురు ధరలపై పరిమితి కొనసాగిస్తామని, రష్యా నుంచి దిగుమతులపై టారిఫ్‌ను పెంచుతామని, మరికొన్ని ఆంక్షలు విధిస్తామని తదితర సుదీర్ఘ ప్రణాళికలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకు దేశాల ప్రతినిధులు వివరించారు. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు అత్యంత ఆధునిక ఉపరితల గగన క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోసం కొనుగోలు చేసి కీవ్‌కు అందించడానికి అమెరికా సిద్ధమౌతోంది. ఇంధన ధరలు, అత్యవసరాల ధరలు ప్రపంచంలో అత్యధికంగా పెరగడంతో పశ్చిమ దేశాలు యుద్ధంలో సహాయం చేయడానికి అలసి పోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడంతో జి7 దేశాలు స్పందించి ఉక్రెయిన్‌కు కొత్తగా ఆర్థిక సాయంతోపాటు ఆయుధాలు, క్షిపణులు అందించడానికి సిద్దమవుతున్నాయి. వైట్ హౌస్ పరిసరాలతో పాటు రాజధాని…

Read More

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయింది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు పోలీసులు. బాధితురాలిని పోలీసులు చంచల్గూడ జైలుకు తీసుకెళ్లగా..న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలు నిందితుడు సాదుద్దీన్ ను గుర్తుపట్టింది. ఆ తర్వాత సైదాబాద్ లోని జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను బాధితురాలు గుర్తించింది. జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్య అత్యాచార నిందితులను ఉంచగా..బాధితురాలు వారిని గుర్తించింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. మరోవంక, ఆరుగురు నిందితుల డీఎన్ఏ సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఐదుగురు మైనర్లతోపాటు ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ డీఎన్ఏ సేకరణకు జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనుమతించింది. ఒకటి రెండు రోజుల్లో నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇన్నోవా కారులో సేకరించిన…

Read More

ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే రష్యా.. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి విదేశీ రుణాలను (సావరీన్ డెట్) చెల్లించలేక పోయింది. అయితే, తమ దగ్గర చెల్లింపులకు తగినన్ని నిల్వలు ఉన్నాయంటూ రష్యా ప్రకటన విడుదల చేసింది.  పాశ్చాత్య ప్రపంచం తన చెల్లింపు మార్గాలను నిలిపివేసి బలవంతంగా అడ్డుకోవడం వల్ల చెల్లింపులు సాధ్యపడలేదని వివరణ ఇచ్చింది. ‘‘మా దగ్గర డబ్బులు ఉన్నాయి. చెల్లించేందుకూ సిద్ధమే’’ అని ప్రకటించింది. మే 27న 100 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సిన రష్యా.. ఆ మొత్తాన్ని యూరోక్లియర్ అనే బ్యాంకుకు పంపించినట్టు తెలిపింది. బ్యాంకు రుణదాతలకు పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొంది. అక్కడ డబ్బులు చిక్కుకుపోయినట్లు తెలిపింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో రష్యా అనుసంధానం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక స్నేహ…

Read More

చినజీయర్ ఆధ్వర్యంలోని సమతామూర్తి ఆశ్రమానికి సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీని ముద్రించలేదంటూ ఓ వ్యక్తి తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు. ప్యాకెట్‌పై పేర్కొన్న బరువుకు, లోపలి ప్రసాదం బరువుకు మధ్య తేడా ఉందంటూ వినయ్ వంగాల ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టి మెట్రాలజీ చట్టం 2009లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చట్టంలోని సెక్షన్లు 10,11,12తో పాటూ 8/25 నిబంధన కింద కేసు నమోదైనట్టు వినయ్ వంగాల తెలిపారు. అయితే అధికార యంత్రాంగం ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించి కేసు దాఖలు చేయడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, చినజీయర్‌కు మధ్య విబేధాలున్నట్టు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ హాజరైన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్…

Read More