Author: Editor's Desk, Tattva News

తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకెలో వివాదం గురువారం తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన జనరల్‌ కౌన్సిల్  సమావేశంలో అన్నాడిఎంకె అధినేత ఒ.పన్నీర్‌సెల్వంపై ప్రత్యర్థి నేత ఎడప్పడి పళనిస్వామి (ఇపిఎస్‌) మద్దతుదారులు వాటర్‌బాటిల్స్‌తో దాడికి దిగారు.  అన్నాడిఎంకెకి ఒకే అధ్యక్షుడు ఉండాలన్న ప్రత్యర్థి ఎడప్పడి పళనిస్వామి డిమాండ్‌ను సీనియర్‌ నేతలు సమర్థిస్తూ.. నినాదాలు చేయడంతో పన్నీర్‌ సెల్వం వాకౌట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన ఇపిఎస్‌ అనుచరులు బాటిల్స్‌ విసిరికొట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఏక నాయకత్వం తీర్మానాన్ని ఆమోదించాలన్న పళనిస్వామి డిమాండ్‌ను పన్నీర్‌సెల్వం ఆమోదించలేదు.  పన్నీర్‌సెల్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అంగీకరించిన మొత్తం 23 ముసాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థి షణ్ముగం పేర్కొన్నారు. ఏక నాయకత్వమే తమ డిమాండ్‌ అని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో ఇరు వర్గాల మద్దతుదారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  పళనిస్వామి ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి  =హాజరైన…

Read More

రాష్ట్రప‌తి ఎన్నిక‌లలో అధికార ప‌క్షం ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఖ‌రారైన ద్రౌప‌ది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రేపు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ క్రమంలో నేడు ఆమె ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా త‌న‌ను ఎంపిక చేసినందుకు ఆమె వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను స్వాగతించారు. బీజేపీ సీనియర్‌ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల…

Read More

రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించక పోవడం, అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంటూ ఆ డబ్బును వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.  కేసీఆర్ కు వ్రాసిన ఓ బహిరంగ లేఖలో ఖరీఫ్‌ సీజను ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాకపోవడంతో డబ్బు కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థులు రైతులకు అప్పుల ఆశచూపి అధిక వడ్డీలు వసూళ్ళు చూస్తున్నారని చెప్పారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ.517.16 కోట్లు…

Read More

తనను గద్దె దింపడం కోసం `తిరుగుబాటు’ ఎమ్యెల్యేలు సూరత్, గౌహతిలకు వెళ్ళవలసిన అవసరం లేదని, తన ముందుకు వచ్చి అడిగితే తాను ఆనందంగా చేస్తానని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. గౌహతిలో మకాం వేసిన సీనియర్ పార్టీ నేత, తిరుగుబాటు నేత తనతో 40 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని ప్రకటించడం, తమదే నిజమైన శివసేన అంటూ గవర్నర్ కు 34 మంది ఎమ్యెల్యేలు లేఖ వ్రాయడంతో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత కొద్దీ సేపటికే అధికార నివాసం ఖాళీచేసి తన సొంత ఇల్లు `మాతృశ్రీ’కి చేరుకున్నారు. తన తర్వాత ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమని స్పష్టం చేస్తూ, శివసైనికులారా మోసం చేయవద్దని ఆయన సూచించారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. శివసేన అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సైతం తాను సిద్ధమని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు…

Read More

తన నియోజకవర్గంలోని భీమవరంలో వచ్చేనెల ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో తనను పాల్గొననీయకుండా చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు .ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారన్న ఆయన, తన సహచర ఎంపీలు ఎంతమంది తనని రాష్ట్రానికి వెళ్లవద్దని సూచించాని పేర్కొన్నారు.   “నా నియోజకవర్గానికి నేను వెళ్తానంటే, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి” అంటూ ప్రశ్నిచారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యులకు ఏపీ పోలీసులు రఘు రామ రాష్ట్రానికి వస్తే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్టు చేయవలసి వస్తుందని చెప్పారన్నారని విస్మయం వ్యక్తం చేశారు.  రాష్ట్ర పోలీసులు చేస్తున్న దారుణాలను, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేయాలనుకుంటున్న దురాగతాలను ప్రధానమంత్రి కార్యాలయ దృష్టికి, హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతాని స్పష్టం చేశారు.  విశాఖలో లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి,…

Read More

 ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ను నియమించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్టు పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన రుచితా ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్‌కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టిఎస్ తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు. రుచితా కాంబోజ్ 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. అంతేకాదు 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్ కూడా.  2002-2005 వరకు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా ఆమె నియామకం పొందారు. అక్కడ ఐరాస శాంతి పరిరక్షణకు , యూఎన్ భద్రతా మండలి సంస్కరణ మద్యప్రాచ్య సంక్షభం తదితర అంశాలపై పనిచేశారు. అనంతరం పలు పదవుల్లో సేవలందించిన ఆమె, ఇకపై ఐక్యరాజ్యసమితిలో భారత్ గళాన్ని…

Read More

హైదరాబాద్ లో 20 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల స్టీరింగ్ కమిటీ చైర్మన్, జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాట్లకు సంబంధించి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ పనిచేస్తోందని లక్ష్మణ్ తెలిపారు. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, సుమారు 10 లక్షల మంది ఈ సభకు వస్తారని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో వివిధ వర్గాల వారు ఉన్నారని..వారందరితో కలిపి ఒక సమ్మేళనం నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెబుతూ .రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలను పక్కనపెట్టి తెలంగాణ ద్రోహులను కేసీఆర్ పక్కనబెట్టుకున్నాడని లక్ష్మణ్ ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశం మొత్తం తిలకించేలా సాంస్కృతిక కార్యక్రమాలు…

Read More

ఇప్పటికే అశాంతి, ఆర్ధిక సంక్షోభంలో అల్లాడుతున్న తాలిబన్ పాలనలోని ఆఫ్ఘానిస్తాన్ తాజాగా భారీ భూకంపంతో వణికిపోతున్నది. వేయి మందికి పైగా మృతి చెందడంతో సహాయ చర్యలు చేపట్టడానికి అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షల కారణంగా మానవతా సహాయం అందించేవారు లేక అల్లలాడి పోతున్నారు. పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని ఖోస్త్‌, పక్టికా ప్రాంతాల్లో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిధిలాల్లో చిక్కివెయ్యిమందికి పైగా మరణించారు. మరెందరో శిధిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఆరువందలమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఖోస్త్‌కు 44 కి.మి. దూరంలోను, పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 450 కి.మి. దూరంలోను భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన ప్రాంతం పూర్తిగా పర్వతశ్రేణులు, వాటి మధ్య పల్లెలతో ఉండటంతో సహాయక చర్యలు కష్టసాధ్యమవుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పటిష్టంగా లేకపోవడంతో భూకంపం ధాటికి పేకమేడల్లా కూలిపోయాయి. తాలిబన్లు అధికారం…

Read More

ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లో 100మందికి పైగా వ్యక్తులను ఉరి తీశారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి మార్చి 20వతేదీల మధ్య మూడు నెలల్లో 105మందికి మరణ శిక్షలు అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది.  ఉరితీతకు గురైన వారిలో ఇరాన్ దేశంలో మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారు. జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల మండలిలో మానవ హక్కుల డిప్యూటీ చీఫ్ నాడా అల్-నషిఫ్ ఇరాన్‌పై తాజా నివేదికను విడుదల చేశారు.  2020వ సంవత్సరంలో 260 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించగా, 2021లో కనీసం 14 మంది మహిళలతో సహా 310 మంది వ్యక్తులను ఉరితీశారని అని నాడా అల్-నషిఫ్ చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ కొనసాగింది. జనవరి 1, మార్చి 20 తేదీల మధ్య 105 మందికి మరణశిక్ష విధించారు.  మాదకద్రవ్యాలకు సంబంధించిన…

Read More

తమిళనాడులో అన్నాడీఎంకే మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకొంది. పార్టీకి ఎవ్వరో ఒక్కరే నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాలు డిమాండ్ చేస్తుండడంతో గురువారం జరుగవలసిన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏవిధంగా మారనున్నాదో అన్న ఆసక్తి చెలరేగుతుంది. జూన్‌ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో బుధవారం జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్‌ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ భేటీకి ముందు పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గీయులు తమ తమ డిమాండ్‌లతో రచ్చకెక్కుతున్నారు. పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి…

Read More