వీర మహిళలు, జనసైనికులు, నాయకులు సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి అవి పరిష్కారం అయ్యేలా పని చెయ్యాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో నాగబాబు మాట్లాడారు. స్థానికంగా, సామాజికంగా పలు సమస్యలు నాగబాబు దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ.. జనసైనికులుగా మనమంతా పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. మన లక్ష్య సాధన దిశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వకూడదని చెప్పారు. చాలా ఇబ్బందులను, అన్ని అవరోధాలను దాటుకొని మనం ఈ స్థితికి వచ్చామని, మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అలసిపోని గుండె ధైర్యంతో పని చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ భావజాలం మన ఆయుధమని, జనసేన గెలుపు కోసం రానున్న ఎన్నికల…
Author: Editor's Desk, Tattva News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. నేషనల్ లెవల్ షూటర్ సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ (35) 2015, సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్ మాత్రమే కాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. పైగా ఛండీగఢ్ మాజీ సీజే ఎస్‌ఎస్ సిద్ధూ మనవడు. రిలేషన్‌షిప్ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్ సెక్టార్ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు. జాతీయ షూటర్, పైగా హైఫ్రొఫైల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు పంజాబ్ గవర్నర్ జోక్యంతో 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ…
ఈ నెలాఖరులో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం జరగనుంది. గోదావరి నదిలో కేవలం 493. 5 టీఎంసీలనే ఏపీ వినియోగించుకునేలా కట్టడి చేయాలని తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖను కోరిన నేపథ్యంలో త్వరలో జరగనున్న జీఆర్‌ఎంబీ సమావేశానికి ప్రాధా న్యత ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి రోజు 1.7టీఎం సీల చొప్పున మొత్తం 449.78 టీఎంసీలను మాత్రమే తీసుకునేందుకు సీడబ్ల్యూసీ అనుమతించిందని కొద్ది రోజుల క్రితం కేంద్ర జలశక్తిశాఖకు తెలంగాణ నీటిపారు దల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ వ్రాసారు. అయితే ఏపీ అక్రమంగా రోజుకు ఆ టీఎంసీల నీటిని తరలించేందుకు కాలువల విస్తరణ పనులు చేపడుతుండడంపై జీఆర్‌ఎంబీ ఎదుట తెలంగాణ అభ్యంతరాల ను వ్యక్తం చేయనుంది. నికర జలాల కేటాయింపులు లేకుండానే గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఏపీ… అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల ఆధారంగా…
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాగలవని ప్రచారం జరుగుతూ ఉండడంతో వచ్చే ఎన్నికలలో పోటీకి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సిద్దపడుతున్నారు. తన పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఒక వంక కసరత్తు చేస్తూ, తాను స్వయంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యంగా ఉన్న పాలేరు నుండి షర్మిల పోటీపడనున్నట్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో ఈ నెల 19 న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని సుధీర్ బాబు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్‌కే పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు…
త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కుల వేలం పాట ద్వారా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కి రూ.48,390 కోట్ల ఆదాయం లభించనుంది. ఇదే సమయంలో ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్ గా ఐపిఎల్ నిలిచింది. మూడు రోజుల పాట కొనసాగిన ఈ వేలం పాటలో ఈసారి కూడా టివి ప్రసార హక్కులను డిస్నీ స్టార్ (స్టార్ నెట్‌వర్క్) సొంతం చేసుకుంది. సోమవారం రెండో రోజు వేలం పాట ముగిసే సమయానికి సోనీ నెట్‌వర్క్ ముందంజలో నిలిచింది. అయితే మంగళవారం చివరి రోజు అనూహ్యంగా స్టార్ నెట్‌వర్క్ టివి ప్రసార హక్కులను దక్కించుకుంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్‌వర్క్ భారీ…
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతామని పేర్కొంటూ, రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి ఎంపిక గురించి కొద్దీ రోజులపాటు హడావుడి చేసిన టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంకు హాజరు కారాదని నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల వేళ … అభ్యర్థి ఎంపికపై నేడు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కావడానికి పలువురు విపక్షాల ముఖ్యమంత్రులు, పలు పార్టీలకు ఆహ్వానం అందింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు సిఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. సిఎం మమతా బెనర్జీ ఆహ్వానంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌లో సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఆ సమావేశానికి ఆహ్వానించడంపై టిఆర్‌ఎస్ అసంతఅప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమవైఖరిని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. బిజెపి, కాంగ్రెస్‌కు సమదూరం పాటించాలని…
ఏపీలో కొద్ది రోజుల క్రితం రాజకీయ దుమారం రేపిన పెగాసస్ స్పై వేర్ కొనుగోలు వ్యవహారంపై మూడు నెలల క్రితం నియమించిన సభాసంఘం తొలి సమావేశం మంగళవారం జరిగింది. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారని వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వివాదం చెలరేగింది. దీనిపై ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై స్పైవేర్‌ను ఎలా ఉపయోగించిందనే దానిపై సమగ్ర విచారణ జరిపేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని వైసీపీ కోరింది. ఈ నేపథ్యంలోనే పెగాసస్ వివాదంపై సమగ్ర విచారణకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మార్చి 21న అసెంబ్లీలో ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ కమిటీని కూడా నియమించారు. పెగాసస్ అంశంలో ఏర్పాటైన హౌస్…
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడుగుతోంది న్యాయంగా పరిహారం ఇవ్వమంటే లాఠీలతో, పైపులతో పోలీసుల ద్వారా కొట్టిస్తవా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. కొట్టుకుంటూ నిర్వాసితులను పోలీసులను ఈడ్చుకుంటూ పోతారా? అసలు నిర్వాసితులు, ఆ గ్రామస్తులు చేసిన పాపమేంది? టీఆర్ఎస్ గూండాలను రైతులపైకి ఉసిగొల్పుతావా? ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ రాజ్యమా? అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వారి పట్ల పగబట్టినట్లు వ్యవహరిస్తోంది మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చట్టపరంగా అందాల్సిన పరిహారం ఇవ్వకుండా వాళ్లపై దాడి చేయించడం దారుణం అంటూ ధ్వజమెత్తారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులని చూడకుండా గత 3 రోజులుగా వేటాడి వెంటాడి కొడతారా? మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావా?……
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారిగా ఓ దర్యాప్తు సంస్థ ముందు హాజరై, సోమవారం 10 గంటలకు పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంగళవారం కూడా హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో తమ కుటుంబానికి చెందిన కంపెనీ వ్యవహారాలలో భారీ ఎత్తున ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ చేసిన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రాహుల్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనాయకులు అందరు వెంట నడచి రావడం,ఢిల్లీలో ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోవలసి వచ్చింది. తమ కుటుంభం అక్రమంగా సంపాదించుకున్న సుమారు రూ 2,000 కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కోసం మొత్తం పార్టీని ఉపయోగించుకొంటున్నారని ఈ సందర్భంగా బిజెపితో పాటు కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాజస్థాన్, చ్చతిస్ ఘడ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు అధీర్ రంజన్ చౌధురి, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, పి.చిదంబరం, హరీశ్…