Author: Editor's Desk, Tattva News

తన మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండరు. అయితే ఆయనతో రాజకీయంగా కొంతకాలంగా తలబడుతున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మాత్రం తాను `ప్రజల మనిషి’ని అని చెప్పుకొంటూ, ప్రజలకు రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెబుతున్నారు.  కేసీఆర్ ప్రభుత్వంకు అయిష్టంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్న పంతం బట్టి `ప్రజా దర్భార్’లకు తెరదింపారు. శుక్రవారం మొదటిసారి `మహిళా దర్భార్’ జరపడం ద్వారా, తెలంగాణాలో,  ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి వెలుగులోకి తెస్తూ, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేపట్టిన్నట్లు సంకేతం ఇచ్చారు.  ఆమె వ్యవహారం చూస్తున్న వారందరికీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన కాంగ్రెస్ నేత  కుముద్ బెన్ జోషి గుర్తుకు వస్తున్నది. ఆమె బాటలోనే డా. తమిళసై నడిచే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.  రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న కుముందు బెన్ జోషిని రాజీవ్ గాంధీ…

Read More

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కావడంతో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయమై చొరవ తీసుకొని ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాంగ్రెసేతర అభ్యర్థి ఎంపికకు ఆమె ప్రతిపాదించారు. అయితే బిజెపి తన అభ్యర్థిని ప్రకటించే వరకు ప్రతిపక్షాలు వేచి ఉండే అవకాశం ఉంది.  డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌, ఎన్సీపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సోనియా గాంధీ మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయమై ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు.  ఎన్డీయే యేతర, యుపిఎ యేతర పార్టీల ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనేదానిపై వారి అభిప్రాయాలు కోరుతున్నారు. ఖర్గే ప్రతిపక్ష ఫ్లోర్‌ లీడర్లతో బాటు, , వైసిపి, టిఆర్‌ఎస్‌,…

Read More

చైనా వైమానిక దళం భారత భూభాగానికి సమీపంలో ఉన్న ప్రధాన స్థావరం వద్ద యుద్ధ విమానాల మోహరింపును రెట్టింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులో ఫైటర్ జెట్లు దిగేందుకు వీలుగా చైనా ఎయిర్బేస్లను నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ ఫ్లిన్ విడుదల చేశారు. చైనా వైమానిక దళం హోటాన్‌లోని ప్రధాన స్థావరం నుండి పనిచేస్తోంది. వారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 యుద్ధ విమానాలను మోహరించారు. ఇంతకు ముందు ఉంచిన దానికంటే ఇది చాలా ఎక్కువ అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.  తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌కు సమీపంలో ఉండే హోటన్ ఎయిర్‌ బేస్‌లో 25 ప్రధాన శ్రేణి యుద్ధ విమానాలను మోహరించింది. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం.. చైనీస్ ఎయిర్‌ఫోర్స్ 25 ప్రధాన శ్రేణి ఫైటర్ జెట్స్‌ని హోటన్ ఎయిర్ బేస్‌లో సిద్ధంగా ఉంచింది. విమానాల్లో జే-11, జే-20 ఫైటర్లు వంటి అధునాతన…

Read More

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈరోజు క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని, కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు, పూడికతీత, గట్లు- పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ధ్వజమెత్తారు.  రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరని, ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారని వివరించారు.  క్రాప్‌ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని చెబుతూ  2011లో ఒకసారి దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని, ఆనాడు గోదావరి జిల్లాల రైతుల…

Read More

నిత్యం సొంత పార్టీ, ప్రభుత్వంపై ఘాటైన విమ‌ర్శ‌లతో వార్తలలో నిలుస్తుంటే `తిరుగుబాటు’  వైసీపీ  ఎంపీ రఘురామ కృష్ణంరాజు  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 60కి మించి సీట్లు దక్కబోవని జోస్యం చెప్పారు. పైగా, పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా దొరకడం కష్టమే అని తేల్చి చెప్పారు.  ప్రతిపక్ష టీడీపీకి 115 స్థానాలు దక్కుతాయని వెల్లడించారు.  పైగా,  తమ పార్టీ అధికారికంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఈ విష‌యం వెల్లడైంద‌ని తేల్చి చెప్పారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబరులో శాసనసభను రద్దు చేస్తే.. మార్చి- ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగొచ్చని కూడా రఘురామ పేర్కొన్నారు.  రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చుతానని తమ పార్టీ అధినేత, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అంటున్నారని పేర్కొంటూ వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్యెల్యేలలో  దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు టికెట్‌ అడిగే పరిస్థితి లేదని…

Read More

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు చర్చంతా రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు మారుతున్నది. ఈ ఎన్నికలలో జగన్ మద్దతు నిర్ణయాత్మకం కానున్నది. బిజెపి అభ్యర్థి గెలుపొందడానికి జగన్ మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది. గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జగన్ ఈ విషయమై చర్చించి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమ అభ్యర్థిని సునాయాణంగా గెలిపించుకోవడానికి బిజెపికి సుమారు 20 వేల ఓట్లు తక్కువగా ఉండగా, వైసీపీకి సుమారు 46 వేల ఓట్లు ఉన్నాయి.    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించాక ఇది మూడో రాష్ట్రపతి ఎన్నిక. మొదటిసారి 2012లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వున్నప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంది. అప్పుడే కాంగ్రెస్‌పార్టీతో విభేదించి కొత్తగా పార్టీ పెట్టినా, ఆ ఎన్నికల్లో యుపిఎ బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇచ్చింది.  2014లో ఎన్‌డిఎ…

Read More

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. కోవిడ్‌ కేసులు సంఖ్య ఏడు వేలను దాటాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గురువారం 3,35,050 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా. 7,584 కొత్త కేసులు వెలుగుచూశాయి.  మూడు నెలల గరిష్టానికి కేసులు పెరిగాయి. ఏడు వేల కేసులు దాటడం వరుసగా ఇది రెండవ రోజు. మరో 24 మంది మరణించారు. మరణాల్లో నిన్నటి కన్నా మూడింతలు అదనం. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.32 కోట్లు దాటగా.. 5.24 లక్షల మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 36,267కు పెరిగాయి. అత్యధిక కేసులున్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో 2,813 కేసులు నమోదయ్యాయి, 24 గంటల్లో ఏ రాష్ట్రం చూసినా అత్యధికంగా పెరిగింది. మహారాష్ట్ర తర్వాత కేరళలో 2,193…

Read More

రాష్త్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తమ ఇష్టం వచ్చిన్నట్లు రహ్ట్రాలలో పనిచేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేంద్రంకు డెప్యూటేషన్ పై తీసుకు వచ్చేందుకు వీలు కల్పిస్తూ చేసిన ప్రతిపాదనలకు బిజిపేతర రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డడంతో కేంద్రం వెనుకడుగు వేయవలసి వచ్చింది. . అఖిల భారత సర్వీస్ అధికారుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న కేంద్రం 2021, డిసెంబరులో ఓ ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎ్‌ఫఓఎస్‌) అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చేందుకు కేంద్రానికి అధికారాలు దాఖలు కానున్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కేంద్రానికి అవసరంలేదు. తాజా ప్రతిపాదనను తెలంగాణతోపాటు మరో 7రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కాగా, కేంద్ర ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) తెలిపింది. అంతకు మించి వివరాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో, రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర సర్వీసుల అధికారులను డిప్యూటేషన్‌ పై కేంద్రానికి బదిలీచేసే…

Read More

మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్యెల్యేలను, ఆ తర్వాత ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ఎమ్యెల్యేలను గెలిపించుకున్న తర్వాత అకస్మాత్తుగా జాతీయస్థాయి నేతగా ఎదిగిన్నట్లయింది. అన్ని రాష్ట్రాలలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే, గత ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో అభ్యర్థులను నిలబెట్టి, ఎక్కడ తన ఉనికి చాటుకోలేక పోవడంతో ఒకింత నిరుత్సాహంకు గురయ్యారు. తాజాగా, ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్ లో 90మంది అభ్యర్థులను నిలబెట్టి, హడావుడి చేసినా ప్రయోజనం లేకపోయింది. దానితో ఇప్పుడు గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీతో చర్చలు ముగిసాయని, తొందరలోనే విలీన ప్రక్రియ ఉంటుందనే వాదనలూ…

Read More

భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు వేసేందుకు జూన్ 29, నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 తుదిగడువు నిర్ణయించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. జులై 21న రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కించనున్నారు. రహస్య బ్యాటెట్ పద్దతిలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐదేళ్ల పదవీకాలం జూలై 24న ముగియనున్నందున జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవి కాలం పూర్తయ్యేలోపు తదుపరి రాష్ట్రపతికి ఎన్నిక జరగాలి. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.2017లో రాష్ట్రపతి ఎన్నికలు జూలై 17న జరిగాయి. కౌంటింగ్ జూలై 20న జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను అభ్యర్థిగా నిలబెట్టాయి. పాలకవర్గం…

Read More