Author: Editor's Desk, Tattva News

సెనెగల్ సర్వతోముఖాభివృద్ధిలో భారతదేశం మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా సెనెగల్ రాజధాని డకార్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారత బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి శ్రీమతి ఐసాటా తాల్ సాల్ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మొదటిసారి ఉన్నతస్థాయి భారతబృందం సెనెగల్‌లో పర్యటించింది. డకార్‌లో సెనెగల్ అధ్యక్షుడు మెకీ సాల్‌తో ఉపరాష్ట్రపతి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, యువత సంబంధిత అంశాల్లో సహకారం, దౌత్యవేత్తలు, అధికారులకు వీసా-ఫ్రీ రిజైమ్ అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. తద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు వీలుంటుందని ఇరుదేశాల ప్రతినిధులు ఆకాంక్షించారు.  భారత్ తరఫున కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సెనెగల్ తరఫున ఆ…

Read More

క్రిప్టో మార్కెట్‌ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గురువారం 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్‌కాయిన్‌, ఎథరమ్‌ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ఒకానొక దశలో శిబు ఇనూ, సోలానా, బిట్ కాయిన్ దాదాపు 13 శాతం మేరకు డ్రాప్ అయ్యాయి. కాయిన్‌ మార్కెట్‌ డేటా ప్రకారం బిట్‌కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్‌ కూడా మేజర్ డౌన్‌ట్రెండ్‌ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బిఎన్‌బి టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్‌ఆర్‌పి కూడా గత 24 గంటల్లో 5.98…

Read More

ప్రతిపక్షాలు ఎంతగా వత్తిడి తెస్తున్నా కులాల వారీగా జనాభా గణాంకాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుతం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈ విషయమై బిజెపి మిత్రపక్షం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలంగా వత్తిడి తెస్తున్నా లెక్కచేయడం లేదు. అయితే, తాజాగా బీహార్ బిజెపి విభాగం కేంద్ర ప్రభుత్వం వైఖరికి భిన్నంగా నితీష్ కుమార్ తో చేతులు కలిపి, రాష్ట్రంలో కుల జనాభా సేకరణకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ విషయమై నితీష్‌ కుమార్ బుధవారం జరిపిన అఖిల పక్ష సమావేశంలో బిజెపితో సహా రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు అన్ని పాల్గొన్నాయి. ఈ విషయమై నితీష్ కుమార్ కు బాసటగా నిలబడడానికి సిద్దపడ్డాయి. సమావేశం అనంతరం నితీష్‌ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కుల గణన చేయడం కుదరని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం సొంతంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి రాష్ట్రంలో శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది పార్టీలు కులగణన చేపట్టాలని నిర్ణయించాయని తెలిపారు. రాష్ట్ర…

Read More

గత పాలకుల అవినీతి, అక్రమాలతో అడుగంటిన భారత ప్రతిష్టను తన పాలనా దక్షతతో ఆకాశమంత ఎత్తున నిలిపిన ఘనత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. భారత్ ను విశ్వగురువుగా చేసేందుకు మోదీ చేస్తున్న క్రుషితో పాటు తన 8 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలతో విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు.  కరోనాతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిన సమయంలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు భేష్ అంటూ ప్రపంచ దేశాలే కొనియాడిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 80 కోట్ల మంది పేదల ఆకలి తీరుస్తున్న మానవతావాది నరేంద్రమోదీ అని, రైతును రారాజు చేసేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరువలేనివని కొనియాడారు.  దేశంలో ఇల్లులేని వాళ్లెవరూ ఉండకూడదనే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 20 కోట్ల ఇండ్లను నిర్మిస్తున్న నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.…

Read More

19 సంవత్సరాల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌‌ వేదిక కానుంది. జులై 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మదాపూర్‌‌‌‌ హైటెక్స్‌‌లోని హెచ్‌‌ఐసీసీ, నోవాటెల్‌‌ హోటల్‌‌ వేదికగా సమావేశాలు జరగనున్నాయి. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌తో కలిసి నోవాటెల్‌‌, తాజ్‌‌కృష్ణ హోటళ్లను సందర్శించారు. సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు మొత్తం 400 మంది హాజరు…

Read More

ఆఫ్రికాఖండ సర్వతోముఖాభివృద్ధిని భారతదేశం ఆకాంక్షిస్తోందని  ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.  ఆఫ్రికాతో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తోందని చెబుతూ ఆఫ్రికాలో వైద్య రంగంతో పాటు డిజిటల్, హరితాభివృద్ధి విషయంలో భారత్ అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.  గబాన్ లో ఉన్న భారతీయ సంతతి ప్రజలు, వ్యాపావేత్తలతో  వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా పురోగతిలో భారతదేశం తన పాత్రను సుస్పష్టంగా పోషిస్తుందని పేర్కొన్నారు.  ఇందుకోసం ఆఫ్రికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.2021-22 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలోనూ గబాన్-భారత్ మధ్య బిలియన్ డాలర్ వాణిజ్యం జరిగిందని చెబుతూ దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  గబాన్ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే విషయంలో భారతదేశం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని వెంకయ్య నాయుడు నాయుడు హామీ ఇచ్చారు.  వ్యవసాయ రంగంలోనూ అవసరమైన మద్దతు…

Read More

ఈ నెల 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికవుతుండగా, కేవలం కర్ణాటక, రాజస్థాన్ లలో మాత్రమే పోటీ ఏర్పడింది. తమ బలానికి మించి కాంగ్రెస్, బీజేపీ ఒకొక్క అభ్యర్థిని అదనంగా పోటీకి దింపడంతో ఈ రాష్ట్రాలలో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో సహితం పోటీ నెలకొంది.  దానితో తమ, తమ అభ్యర్థులు ఎన్నికయ్యేటట్లు చూడడం కోసం ఈ రెండు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీల నేతలు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సినీ నటుడు జగ్గేశ్‌, పారిశ్రామికవేత్త లెహర్‌సింగ్‌ బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్‌ తరపున జైరాం రమేష్‌, మన్సూర్‌ ఆలీఖాన్‌ బరిలో ఉన్నారు. జేడీఎస్‌ నుంచి మాజీ ఎంపీ కుపేంద్రరెడ్డి…

Read More

రాజస్థాన్ లో విశేష ప్రజాదరణ గల ఏకైక బిజెపి నాయకురాలిగా పేరొందిన, రెండు సార్లు పార్టీని ఎన్నికలలో గెలిపించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వసుంధర రాజేకు ఇక రాజకీయ గ్రహణం పట్టిన్నట్లు కనిపిస్తున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రోజెక్టు చేయబోమని ఇప్పటికే పార్టీ సంకేతం ఇచ్చింది. పైగా, ఆమెకు ప్రత్యర్థిగా పేరొందిన, గతంలో పార్టీ వ్యతిరేక ఆరోపణలు ఎదుర్కొని కాంగ్రెస్ లో కూడా చేరిన ఘనశ్యామ్ తివారీని రాజ్యసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం కేవలం ఆమెను పక్కన పెట్టడం కోసమే అని స్పష్టం అవుతున్నది. 75 ఏళ్ళు దాటినా వారికి పదవులు లేవంటున్న బిజెపి 75 ఏళ్ళ వయస్సులో ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పార్టీ వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది. బ్రాహ్మణులలో విశేష పలుకుబడి గలవారుగా భావిస్తున్న తివారి 2003లో మొదటి సారి వసుంధర రాజే ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆమెను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో రాజే…

Read More

ఒక వంక బిజెపికి చెందిన ముగ్గురు ముస్లిం రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండగా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తున్న 22 స్థానాలలో ఒక్కటి కూడా ముస్లిం అభ్యర్థులు ఎవ్వరికీ కేటాయించక పోవడంతో బిజెపి పార్లమెంటరీ పార్టీలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోతున్నది. బిజెపికి చెందిన ముగ్గురు ముస్లిం ఎంపీలు – కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మాజీ మంత్రి ఎంజే అక్బర్, పార్టీ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంల రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. అయితే, జూన్ 23న జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ ఉపఎన్నికల్లో ఒకదానిలో అభ్యర్థిగా లేదా మరో కీలక పదవిలో నఖ్వీకి త్వరలో స్థానం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తన రాంపూర్ లోక్సభ సీటుకు రాజీనామా చేశారు. రాంపూర్ లోక్ సభ నియోజకవర్గానికి జూన్ 23న ఉపఎన్నిక జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికలో గెలిస్తే లోక్ సభలో బీజేపీ తరఫున ఉన్న ఏకైక ముస్లిం నేత…

Read More

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని, అధికార మదంతో రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం పతనం చేస్తోందని, ఈ పరిస్థితులలో జనసేన లాంటి పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసే చర్యలలో భాగంగా నాగబాబు బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని అసెంబ్లి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ కార్యర్తలతో అరసవల్లి రోడ్డులో ఉన్న ఒక ప్రైవేటు హోటల్‌లో ఆయన పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి మాట్లాడి, జిల్లాలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలలో జనసేన కార్యకర్తలు,…

Read More