Author: Editor's Desk, Tattva News

రైతుల సాధికారత, వారి జీవితాలను ఆధునీకరించడంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తున్నప్పటికీ వ్యవసాయం నేటికీ పాత పద్ధతుల్లోనే సాగుతున్నదని చెప్పారు. ఫలితంగా అనేక చిక్కులతోపాటు ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా పరిస్థితులు వృథాకు దారి తీస్తున్నాయని స్పష్టం చేశారు. భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ వేడుక “భారత్ డ్రోన్ మహోత్సవ్-2022”ను ఆయన శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘కిసాన్ డ్రోన్’ పైలట్లతో సంభాషించారు. డ్రోన్ల బహిరంగ ప్రదర్శనను తిలకించడంతోపాటు అంకుర సంస్థల ప్రతినిధులతోనూ మాట్లాడారు. రక్షణ, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, పర్యాటకం, చలనచిత్ర, వినోద రంగాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోందని ప్రధాని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత వినియోగం మరింత పెరగడం తథ్యమన్నారు. ‘ప్రగతి’ సమీక్షలు, కేదార్‌నాథ్ ప్రాజెక్టులపై పర్యవేక్షణను ఉదాహరిస్తూ.. తాను అధికారిక నిర్ణయాలు తీసుకోవడంలో డ్రోన్లు ఉపయోగపడిన తీరును…

Read More

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్ జరీన్‌కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ తో పాటు  ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫూట్ బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఇవ్వాల మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులతో కలిసి విమానాశ్రయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఆమె విమానాశ్రయం నుండి బయటకు రాగానే ఆమెకు మంత్రులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు పూల బోకే ఇచ్చి స్వాగతించారు. …

Read More

కరోనా కారణంగా రెండేళ్లపాటు రద్దయి ఇటీవల ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాదిమంది స్థానికులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ యాత్ర మొదలైన నెలరోజుల్లోనే 78 మంది యాత్రికులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతాలలో కొలువై ఉన్న ఈ ఆలయాలను సందర్శించడానికి వెళ్లే యాత్రికులు తగిన ప్రాణవాయువు అందక గుండెపోటుతో మరణించడం ప్రతి ఏడాది సంభవిస్తున్నప్పటికీ యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో యాత్రికులు మృత్యువాత పడడం అసాధారణంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్-మే నుంచి అక్టోబర్–నవంబర్ వరకు ఆరు నెలలపాటు యాత్రా సీజన్ కొనసాగుతుండగా 2019లో మొత్తం 90 మంది, 2018లో 102 మంది, 2017లో 112 మంది యాత్రికులు మరణించారు. ఈ సీజన్ ప్రారంభమైన నెలరోజుల్లోపే చార్ ధామ్ యాత్రికులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించారు.  అందుకు దారితీసిన…

Read More

 కశ్మీరు టీవీ నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నటిని హత్య చేసినవారని జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం  తెలిపారు.  పోలీసు అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో అగన్హంజిపొర ప్రాంతంలో గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. బుడ్గాం (  జిల్లాలో టీవీ నటి అమ్రీన్ భట్‌ ను బుధవారం హత్య చేసిన ఇద్దరు ఉగ్రవాదులు షాహిద్ ముష్తాక్ భట్, ఫర్హాన్ హబీబ్ ఈ ఎన్‌కౌంటర్లో మరణించారు.  వీరు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ లతీఫ్ ఆదేశాల మేరకు అమ్రీన్‌ను హత్య చేశారు. వీరి నుంచి ఓ ఏకే 56 రైఫిల్, 4 మ్యాగజైన్స్, ఓ పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కశ్మీరు…

Read More

గత ఏడాది నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన ప్రసిద్ధ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) తన ఛార్జ్ షీట్ సమర్పించింది. ఏజెన్సీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఎన్‌సిబి  14 మంది వ్యక్తులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.  అయితే, ఇందులో ఆర్యన్‌ని చేర్చలేదు. “ఆర్యన్ (ఖాన్), మోహక్ (జైస్వాల్) మినహా నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు” అని నోట్ పేర్కొంది.  ‘సిట్’ తన దర్యాప్తును “ఆబ్జెక్టివ్ పద్ధతిలో” నిర్వహించిందని తెలిపింది. షారూఖ్‌ ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్‌ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాల్లేవ్‌. ఇకనైనా ఎన్‌సిబి తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది” అని రోహత్గీ వ్యాఖ్యానించారు. డ్రగ్స్…

Read More

సెక్స్‌ వర్క్‌ను వృత్తిగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఈ వృత్తిని ఆచరించేవారు గౌరవానికి అర్హులని, చట్టం కింద వారికి కూడా సమానమైన రక్షణ వుంటుందని స్పష్టం చేసింది. వారి వృత్తిలో పోలీసులు జోక్యం చేసుకోరాదని, వయోజన, కన్సెంటింగ్‌ సెక్స్‌ వర్కర్లపై నేరపూరితమైన చర్యలు తీసుకోరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ”వృత్తితో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద పరువు మర్యాదలతో జీవించే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.” అని కోర్టు వ్యాఖ్యానించింది. ”చట్టం కింద సెక్స్‌ వర్కర్లకు సమానమైన రక్షణ వుంటుంది. ‘వయస్సు, సమ్మతి’ ప్రాతిపదికన అన్ని కేసుల్లో క్రిమినల్‌ చట్టాన్ని సమానంగా వర్తింపచేయాలి” అని తెలిపింది.  పైగా సెక్స్‌ వర్కర్‌ వయోజనులై వుండి, పూర్తి సమ్మతితోనే ఇందులో పాల్గొన్నపుడు వారిపై పోలీసులు ఎలాంటి నేరపూరితమైన చర్య తీసుకోరాదని లేదా వారి విషయంలో అస్సలు జోక్యం చేసుకోరాదని …

Read More

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన గురువారం సాయంత్రం అత్యంత ఉత్సాహంగా జరిగినా, ఈ సందర్భంగా ఫెడరలిజంపై వేదికపై నుండే ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నిలదీయడంతో ఖంగు తినవలసి వచ్చింది.  కేంద్రం రాష్ట్రాల పట్ల మరీ ముఖ్యంగా తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ ప్రధాని ముందర స్టాలిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఇరకాటంలో పడ్డారు. వెంటనే తేరుకుని తమిళ భాష ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందంటూ తమిళవాదం వినిపించే యత్నం చేశారు. స్టాలిన్‌ ద్రవిడ మోడల్‌కు ఇరుసుగా ఉన్న తమిళాన్ని ప్రస్తావించడం ద్వారా తాను తమిళులకు వ్యతిరేకం కాదని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.  వాస్తవానికి ఓ బీజీపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రధాని అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పైగా స్టాలిన్ ముఖ్యమంత్రి ఆపదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర పర్యటనకు…

Read More

భారత రచయిత్రి గీతాంజలి శ్రీ  రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్‌ సమాధి(2018).. ఆంగ్ల తర్జుమా ‘టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కు 2022కుగానూ ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది.  టాంబ్‌ ఆఫ్ సాండ్ అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకం. పైగా హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల. అంతేకాదు బుకర్‌ప్రైజ్‌ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి ఈమెనే. గురువారం లండన్‌లో జరిగిన ప్రదానోత్సవంలో గీతాంజలి శ్రీ(64)కి ప్రైజ్‌ను అందించారు. గీతాంజలితో పాటు రేత్‌ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేసిన డైకీ రాక్‌వెస్‌(అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు యాభై వేల బ్రిటిష్‌ స్టెర్లింగ్‌ పౌండ్లను సైతం క్యాష్‌ ప్రైజ్‌గా అందించారు.  రేత్‌ సమాధి ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన…

Read More

కేంద్రంలో మార్పు తధ్యం అని భరోసా వ్యక్తం చేస్తూ రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి కొద్దిసేపు ముందే బెంగళూరు బయలుదేరి వెళ్లిన  ఆయన అక్కడ మాజీ ప్రధాని  దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ జాతీయ రాజకీయాలపై సమాలోచనలు జరిపారు.  అనంతరం కుమారస్వామి గౌడ్ తో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదని, ఉజ్వల్‌ భారత్‌ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని, దేశంలో అపారమైన యువశక్తి ఉందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.  ‘‘నేను దేవెగౌడ, హెచ్‌డీ కుమారస్వామిని కలిసి అంతా చర్చించుకున్నాము. త్వరలో జాతీయ స్థాయిలో మార్పు వస్తుంది, ఎవరూ అడ్డుకోలేరు.. భారత్‌ మారుతుంది.. భారత్‌ మారాలి.. మనం అన్ని విధాలా ప్రయత్నించాలి. దేశ స్థితిని మార్చాలి’’ అని కేసీఆర్ తెలిపారు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా…

Read More

ఒక వంక ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ పాలన వార్షికోత్సవాలు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుపుకోవడానికి బిజెపి సమాయత్తం అవుతూ ఉండగా, మరో వంక కాంగ్రెస్ పార్టీ “ఎనిమిదేళ్లు – ఎనిమిది అబద్దాలు – బిజెపి వైఫల్యాలను” అంటూ ఒక రిపోర్ట్ కార్డును విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ “8 సాల్, 8 ఛాల్, బిజెపి సర్కారు విఫల్” పేరిట ఓ సంకలనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మకెన్‌లు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలను ఈ ఎనిమిదేళ్ల కాలంలో బూటకపు మాటలతో, అట్టహాసపు నినాదాలతో నిండా ముంచిందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్నది కేవలం జంతర్‌మంతర్ అంతకు మించి మాయోపాయాల భరిత పాలననే అని వారు విమర్శించారు. ప్రజలకు కడగండ్లు, దుష్పరిపాలన, తీవ్రస్థాయి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన విభజనరేఖలు బిజెపి ప్రభుత్వానికి ప్రతీకలుగా మారాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అచ్చే…

Read More