చైనా తైవాన్‌ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే తాము (అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. తైవాన్‌ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ స్పష్టం చేశారు. అయితే వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని ఆయన చెప్పారు. క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి సోమవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్న బైడెన్ ఓ సమావేశంలో పాల్గొంటూ తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ తైవాన్‌ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా…
Author: Editor's Desk, Tattva News
అస్సాంలోని నాగావ్ జిల్లా, బటర్‌డ్రబ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసులో అనుమానితుల ఇళ్ళను జిల్లా అధికారులు కూల్చేశారు. కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు ఆరోపిస్తూ కొందరు ఈ పోలీస్ స్టేషన్‌ను శనివారం తగులబెట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాకాండలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి ఇళ్ళను జిల్లా అధికారులు ఆదివారం బుల్డోజర్లతో కూల్చేశారు. ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్ళను నిర్మించారని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసులో పోలీసులు దాదాపు 21 మందిని అరెస్టు చేశారు. కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అస్సాం పోలీసు స్పెషల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతల విభాగం) జీపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసుపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు…
రాష్ట్రంలో ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మదర్సాలను మూసివేసే చర్య చేపట్టిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వా శర్మ భారతీయ ముస్లింలు విద్యలో పురోగతి సాధించాలంటే “మదర్సా” అనే పదం అంతరించిపోవాలని స్పష్టం చేశారు. “మీరు మతాన్ని బోధించాలనుకుంటే మీరు ఇంట్లో చేయండి. పాఠశాలల్లో, మీరు సైన్స్, గణితం నేర్చుకుంటారు…” అని తేల్చి చెప్పారు. ప్రముఖ జాతీయ వార పత్రికలు పాంచజన్య, ఆర్గనైజర్ ల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత దేశాన్ని రాష్ట్రాల యూనియన్ అని పిలవడం ద్వారా పరోక్షంగా వేర్పాటువాద అంశాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. మదర్సాలను మూసివేసి, యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడే వారెవరైనా వాస్తవానికి భారతీయ ముస్లింలకు నిజమైన స్నేహితులని శర్మ పేర్కొన్నారు. “భారతదేశం రాష్ట్రాల యూనియన్ అయితే, 5,000 సంవత్సరాల గొప్ప చరిత్ర గురించి ఏమిటి? కాంగ్రెస్ తనను తాను భారత జాతీయ కాంగ్రెస్ అని పిలిచినప్పుడు, భారతదేశం అంతటా సమావేశాలు…
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరు కావడం కోసం ప్రస్తుతం బెయిల్ పై ఉండడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి పొందిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా అక్కడకు వెళ్ళకుండా, దారిలో లేకపోయినా లండన్ వెళ్లి, అక్కడ కొద్దిసేపు ఆగి, అక్కడ నుండి వెనుకకు వచ్చి దావోస్ వెళ్లడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. లండన్ లో ఆగితే కోర్టు అనుమతి ముందుగా ఎందుకు పొందలేదని ప్రశ్న తలెత్తుతుంది. భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేకున్నా, లండన్ కంటే చాలా ముందే దావోస్ ఉన్నా, సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగిందని, దావోస్ బయలుదేరిన విమానం లండన్ లో ఎందుకు ల్యాండైందో తెలియడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కార్యక్రమంలో లండన్ లో ఆడుతున్నట్లు లేదు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకోడానికి అనుకోకుండా ఆలస్యం అయిందని, అందువల్ల ముఖ్యమంత్రి…
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన పిలుపుకు బిజెపి ప్రభుత్వాలు ఏవీ స్పందించడం లేదు. కేవలం నాలుగు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే స్పందించి పన్నులు తగ్గించాయి. దేశంలో మరింతగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి ఉందని స్థానిక పన్నులు కుదించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం, రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఓడిశాలోని బిజెడి ప్రభుత్వం, మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కేంద్రంతో పాటు పన్నులు తగ్గించాయి. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ… రాష్ట్ర పన్నుల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వ్యాట్‌ను తగ్గించబోమని గోవా ప్రభుత్వ వర్గాలు…
ప్రపంచ దేశాల అప్పు రూ 23,100 లక్షల కోట్లకు (2021నాటికి) చేరుకుందని, ఆయా దేశాలు చేస్తున్న రుణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చేసిన రణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపుల కోసం ఆయా దేశాల్లో కీలకమైన ప్రభుత్వ సేవలకు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొన్నది. దాదాపు 100కు పైగా దేశాలు రుణ వాయిదాల చెల్లింపు కోసం కీలకమైన ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యంపై వ్యయాన్ని తగ్గించుకోనున్నాయని తెలిపింది. ప్రపంచ దేశాల అప్పులపై ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, కుటుంబాలు, వ్యాపారవేత్తలు చేసిన అప్పుల్ని ‘గ్లోబల్ డెట్’గా ఐఎంఎఫ్ పేర్కొన్నది. ప్రపంచ దేశాల మొత్తం రుణాలు 2021 నాటికి 303 ట్రిలియన్ డాలర్ల (సుమారుగా రూ.23,100 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంత క్రితం గ్లోబల్ డెట్ 226 ట్రిలియన్ డాలర్లుగా (రూ.17,402 లక్షల కోట్లు) ఉంది.…
ఆస్ట్రేలియా నూతన ప్రధాన మంత్రిగా ఆంటోనీ అల్బనీస్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం కాన్ బెర్రాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరగడం విశేషం. విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఆర్థిక మంత్రి కాటీ గల్లాఘర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జపాన్ లో జరుగుతున్న క్వాడ్ సమావేశాలకు హాజరు కావడం కోసం విమానం ఎక్కారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షులు అధ్యక్షులు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదిలను తాను స్వయంగా కలుస్తానని ప్రధాన మంత్రిగా ఎన్నికైన అనంతరం ఆయన వెల్లడించారు. వాతవరణ మార్పులపై చర్చించేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ కు గత వారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 151 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 72 స్థానాల్లో విపక్ష లేబర్ పార్టీ స్థానాల్లో విజయం సాధించగా, మారిసన్ పార్టీ కేవలం…
`రైతు ఫ్రెండ్లీ’ ప్రభుత్వలంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అసలు గిట్టదని ఆరోపిస్తూ కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపిచ్చారు. రైతులను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని చెబుతూ తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా ఉన్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వాటికి మద్దతిస్తామని సీఎం కేసీఆర్…
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బర్రాక్‌పోర్ లోక్‌సభా అభ్యర్థి అర్జున్ సింగ్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. దీనికి కొద్ది సమయం ముందు పార్టీ నాయకత్వం తనను పని చేయనీయడం లేదంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. జనపనార క్వింటాల్ రూ 6,500లకు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడంపై అర్జున్ సింగ్ తీవ్ర అసంతృప్తి చెందారు. జూట్ మిల్లుల సమస్యను కొద్ది రోజులుగా అర్జున్ సింగ్ లేవనెత్తుతున్నారు. దీనికి కొంత మంది శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ యూనిట్‌తో సైతం అర్జున్ సింగ్‌కు వివాదాలు తలెత్తాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్లినట్లు సమాచారం. …
లిక్కర్, ఇసుక మాఫియాపై వార్తలు రాసినందుకు ఒక పాత్రికేయుణ్ణి ఆయన ఇంటి వద్దనే తుపాకితో కాల్చి చంపిన దారుణ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బెగుసరాయి జిల్లా బఖ్రి పోలీస్ స్టేషన్ పరిధి సఖో గ్రామానికి చెందిన 26 ఏళ్ల సుబాష్ కుమార్ మహతో స్థానిక హిందీ పత్రికలకు స్ట్రింగర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పబ్లిక్ యాప్ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్థానిక కేబుల్ ఛానెల్ సిటీ న్యూస్ తరపున విలేకరిగా పనిచేస్తున్నారు. స్నేహితుని పెళ్లి విందుకు వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. తలకు గురిపెట్టి తుపాకితో కాల్చడంతో అయన ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇసుక, లిక్కర్ మాఫియా పనేనని కుటుంబ సభ్యులు, స్నేహితులు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి నలుగురు నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి,…