వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ప్రపంచంలో ఏదో ఒక మూల కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్‌లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆసక్తికరమైన ఓ అధ్యయనం వెలువడింది. వ్యాక్సినేషన్ పొందిన తర్వాత ఒమైక్రాన్ సోకినవారిలో కరోనా రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది వెల్లడైనది. బూస్టర్ డోస్ కన్నా మెరుగైన ఇమ్యూనిటీ లభిస్తోందని తేలింది. కరోనా వ్యాక్సిన్ తయారీదారు బయోఎన్‌టెక్ ఎస్‌ఈ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్ పొందిన జనాలకు ఒమైక్రాన్ వేరియెంట్ సోకితే ఉత్తత్తి అయ్యే యాంటీబాడీలు అధికంగా ఉంటున్నాయి. ఎక్కువ కొవిడ్కరోనా వేరియెంట్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ ఇలాంటివారిలో కనిపిస్తోందని అధ్యయనకారులు తేల్చారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇమ్యూనాలజీ డైరెక్టర్, ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న జాన్ వెర్రీ…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు, కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కె. రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఫిర్యాదు చేస్తూ విడివిడిగా లేఖలు రాశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు బెదిరింపులు సహా పలు అంశాలను ఈ లేఖల్లో ప్రస్తావించారు. అధికార వైఎస్సార్సీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలపై కక్ష సాధింపు చర్యలకుపాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 19, 21ను ఉల్లంఘిస్తూ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా మీడియా సమావేశంలోనే అంగీకరించారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ సహా…
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాను చురుకుగా వాడుతుంటారనే సంగతి తెలిసిందే. అటూ సినిమాలు, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్నా పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. కానీ, ఆయన చేసిన ఓ పోస్టు తెగ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఎగతాళిగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏ మాత్రం సహనం కోల్పోని బిగ్ బి అదే విధంగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉదయం ఎప్పటిలాగానే తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పారు. అయితే, ఆయన పోస్టు చేసినప్పుడు సమయం 11 దాటి పోయింది. ఈ చిన్న పోస్టే విమర్శలకు దారి తీసింది. ఇంకా ఉదయమా ? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇది ఉదయం కాదు.. ఓల్డ్ మేన్.. మధ్యాహ్నం అంటూ వ్యంగ్యంగా కామెంట్స్…
లుంబినీలో బౌద్ధ సంస్కృతి, వారసత్వ అంతర్జాతీయ భారత కేంద్రానిక ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. అమెరికా, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, థాయ్‌లాండ్‌లతో సహా అనేక దేశాలు తమ కేంద్రాలను నిర్మించిన దశాబ్దాల తర్వాత బౌద్ధ తత్వశాస్త్రాన్ని ప్రోత్సహించే సాధనంగా లుంబినీలో భారత్ బౌద్ధ కేంద్రం నిర్మాణం మొదలయింది. దీనికి రూ 100 కోట్ల ఖర్చు అవుతుందని, పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా. సోమవారం ఉదయం నేపాల్‌లోని లుంబినీకి చేరుకున్న ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఘానా స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీ తన ట్వీట్ లో “బుద్ధ పూర్ణిమ ప్రత్యేక సందర్భంగా, అద్భుతమైన నేపాల్ ప్రజల మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. లుంబినీ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆయన వెంట…
దేశంలో ధరలు అమాంతం పెరుగుతుండటంతో వచ్చే ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను పెంచనుందని ఎస్‌బిఐ ఓ పరిశోధనలో అంచనా వేసింది. కాగా.. వడ్డీ రేట్లు పెంచినంత మాత్రాన ద్రవ్యోల్బణం వెంటనే కట్టడిలోకి రాలేదని విశ్లేషించింది. 2022 జూన్, ఆగస్టులో జరగనున్న ఆర్‌బిఐ ఎంపిసి భేటీలో రెపో రేటును 5.15 శాతానికి చేర్చనుందని ఎస్‌బిఐ ఈకోరప్ తన రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇది కరోనా ముందు నాటి స్థాయి. అయినా ధరల పెరుగుదల కొనసాగవచ్చని పేర్కొంది. ఎస్‌బిఐ పరిశోధన వివరాలు రష్యా, ఉక్రెయిన్ పరిణామాలతో ఇంధన ధరలు మరింత పెరిగిపోతున్నాయి. ఇటీవలి మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఉక్రెయిన్ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఈ యుద్ధ ప్రభావంతో అహార్పోత్తులు, పానియాలు, ఇంధనం, రవాణ తదితర ద్రవ్యోల్బణం పెరుగుదలలో 52 శాతం ప్రభావితం అయ్యాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ)…
కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మూడు రోజులుగా కోర్ట్ నియమించిన న్యాయవాదుల బృందం సర్వేలో సోమవారం శివలింగం బయటపడింది. దయానిధి, వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక యంత్రాంగాన్ని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శివలింగం కనబడడంతో జ్ఞానవాపి మసీదు కాంపెక్స్‌లో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే పూర్తయింది. ఇక్కడున్న బావిలో శివలింగం బయటపడినట్టు హిందూవుల అడ్వకేట్లు ప్రకటించారు. శివలింగానికి రక్షణ కల్పించాలంటూ న్యాయవాది విష్ణు జైన్ నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌కు కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాలని, విజిటర్ల ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్, సీఆర్‌పీఎఫ్ కమాండంట్‌లకు ఆదేశాలిచ్చింది. శివలింగం 12 అడుగుల 8 అంగుళాల వ్యాసం కలిగి ఉందని, సంప్రదాయం ప్రకారం నందిని ఎదుర్కొంటున్న…
దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఆదివారం 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) పేర్కొంది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండటతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, లఢఖ్, ఉత్తరాఖండ్, గిల్గిత్ -బాల్టిస్తాన్, పంజాబ్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని, సాధారణం కంటే 5.1 డిగ్రీలు అధికంగా నమోదైందని ఐఎండి తెలిపింది. ఢిల్లీలో సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వాయువ్య ఢిల్లీలోని ముంగేష్‌పూర్, నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ వాతావరణ కేంద్రాల్లో వరుసగా 49.2, 49.1డిగ్రీల సెల్సియస్‌గా రికార్డైనట్లు ఐఎండి వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బందా జిల్లాలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేలో బందాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండి పేర్కొంది. జిల్లాలో 1994న…
పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ట్లు ఒక వంక కధనాలు వెలువడుతుండగా, మరోవంక గద్దె దించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై స్వదేశంలో తిరుగుబాటుకు రంగం సిద్దమవుతున్నాయనే కధనాలు వెలువడుతున్నాయి. రెండున్నర నెలలకు పైగా ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధంలో భారీ నష్టాలు ఎదురు కావడంతో పాటు, ఆర్ధిక ఆంక్షల కారణంగా రష్యా కోలుకోలేని నష్టాలకు గురవుతూ ఉండడంతో ఆయన మద్దతు దారులలోనే అసహనం వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు. వ్లాదిమిర్ పుతిన్ ను గద్దె దించేందుకు ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ ఆరోపించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగస్టు మధ్య లేదా ఈ ఏడాది చివరి నాటికి కీలక దశకు చేరుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన మేజర్ జనరల్ కిరిల్లో బుడనోవ్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాలో పుతిన్ క్యాన్సర్‌తో సహా అనేక…
వచ్చే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయడం కోసం కీలకమైన సంస్థాగత సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజుల పాటు జరిపిన ‘నవ్ సంకల్ప్ చింతన్ శివిర్’లో చర్చల తర్వాత ఆమోదించబడిన ఉదయపూర్ డిక్లరేషన్‌లో ఈ సంస్కరణలను వెల్లడించారు. 50 ఏళ్ల లోపు వారికి పార్టీలో విస్తృత ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ , `ఒకే కుటుంబానికి ఒకే సీట్’ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే అందుకు కీలకమైన మినహాయింపులు ఇచ్చారు. కనీసం ఐదేళ్లపాటు పార్టీలో పని చేస్తున్న వారికి ఈ నిబంధనలు వర్తింపబోవని సంకేతం ఇచ్చారు. కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించేందుకు ఏ వ్యక్తి కూడా ఐదేళ్లకు మించి ఒకే పార్టీ పదవిలో ఉండకూడదని కూడా పార్టీ నిర్ణయించింది. అలాగే అన్ని స్థాయిల సంస్థల్లో 50 ఏళ్ల లోపు వారికి 50 శాతం ప్రాతినిధ్యం…
పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టైలో లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించింది. భారత డబుల్స్ జోడీ సాత్విక్ , చిరాగ్ అహ్సన్-సుకముల్జోను ఓడించారు! 18-21, 23-21, 21-19తో తమ కెరీర్‌లోనే అత్యంత సంచలన విజయం సాధించి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో గేమ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాటన్ క్రిస్టీని ఓడించి 3-0తో సమం చేశాడు. ఫైనల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ ఘనత సాధించారు. భారత…