Author: Editor's Desk, Tattva News

ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో ఐదారురోజులలో ఆ దేశం తమ ఆధీనంలోకి వస్తుందనే అంచనాలతో యుద్దానికి దిగిన రష్యా ఊహించని తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసిందని, యుద్ధ సామాగ్రి, ఆయుధ సంపత్తిని పెద్దఎత్తున కోల్పోయిందని బ్రిటన్‌ రక్షణశాఖ వెల్లడించింది. రష్యా బలగాల్లో అత్యంత సమర్ధమైన విభాగాల్లో ఈ నష్టం మరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది. బ్రిటన్‌ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అందించిన తాజా నివేదికలోప్రకారం వేలాది సైనికులను, ప్రత్యేకించి దళాలను ముందుండి నడిపే హోదాల్లోని సైనికాధికారులను పెద్దసంఖ్యలో కోల్పోయింది. మరోవైపు రష్యాకు చెందిన అత్యాధునిక 7-90 యుద్ధట్యాంక్‌ను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిందని స్పష్టం చేసింది. రష్యా వద్ద ప్రస్తుతం ఈ తరహా యుద్ధ ట్యాంకులు కేవలం 100 మాత్రమే ఉన్నాయి. కాగా ఉక్రెయిన్‌పై యుద్దం నేపథ్యంలో ఐరోపా సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయుధాల తయారీ వేగం మందగించనుంది. …

Read More

మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో ఇప్పటికే ఓ సీనియర్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చింది. ఎస్ ఐల ఎంపిక కుంభకోణంలో మరో మంత్రి రాజీనామాకై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. తాజాగా రూ 2,500 కోట్లు ఇస్తే సీఎం పోస్ట్ తనదే అని ఒకరు తనతో బేరాలు ఆడారని అంటూ ఓ ఎమ్యెల్యే చేసిన ఆరోపణ కలకలం సృష్టిస్తున్నది. ముఖ్యమంత్రి పదవి కావాలంటే రూ.2500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్ ఆరోపించారు. అయితే ఎవరు ఈ డబ్బులు డిమాండ్ చేసిందీ ఆయన వెల్లడించలేదు. పార్టీలోని కొందరు ఏజెంట్లు తనను ఈ మొత్తం డిమాండ్ చేశారని, ఇవి ముట్టచెపితే ఏకంగా సిఎం కుర్సీ ఇస్తామన్నారని తెలిపారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ ఆరోపణ మరో ఆయుధం అందించి నట్లయింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వేలానికి పెట్టారా? డబ్బులిస్తే చాలు…ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా?…

Read More

వచ్చే ఎన్నికలలో క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని టికెట్లు ఇస్తామని చెబుతూ హైదరాబాద్‌లో కూర్చుంటే టికెట్లు రావని, ప్రజలతో ఉండి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని హామీ ఇచ్చారు. ‘‘ప్రజల్లో ఉండి వారిపక్షాన పనిచేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తుంది. పార్టీ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దు. అలాగని టికెట్ల కోసం ఢిల్లీకి రావొద్దు. స్వతంత్రంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాం’’అని చెప్పారు. “పార్టీ టికెట్లు మెరిట్‌ ప్రతిపాదకనే ఇస్తాం. ఎవరూ భ్రాంతిలో ఉండకండి. తర్వాత నన్ను తప్పుపట్టొద్దు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో.. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, యువత పక్షాన పోరాటం చేస్తారో వారికే పార్టీ టికెట్‌ ఇస్తుంది.…

Read More

తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుల చరిత్ర కాంగ్రెస్‌దని , టిఆర్‌ఎస్‌తో బిజెపి ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్‌లో పెట్టుకోదనిబిజెపి ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామనంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని వరంగల్ లో రాహుల్ గాంధీ హామీలపై ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదని చెబుతూ కాంగ్రెస్‌ ఢిల్లీలో కాదుగదా.. గల్లీలో కూడా లేదని… రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ద్వారానే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేసినా టీఆర్‌ఎస్‌కే చెల్లుతుందని పేర్కొన్నారు. గెలిసిన వాళ్ళందరూ మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో చేరటం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ ఏనాడు పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణాలో రాహుల్‌ సభలు వృధా ప్రయాసని చెబుతూ గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెసేనని విమర్శించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒక…

Read More

పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినా, నాటకీయ పరిణామాలతో తిరిగి శుక్రవారం ఇంటికి చేరుకున్న బిజెపి యువమోర్చా జాతీయ కార్యదర్శి    తజిందర్ పాల్ సింగ్‌పై మోహాలీ కోర్టు శనివారం తాజా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తాజిందర్‌ బగ్గాపై ఐపీసీ సెక్షన్‌  153ఏ, 505,505(2), 506 కింద కేసులు నమోదయ్యాయి.  దీంతో మోహాలీ కోర్టు ఆదేశాలను అనుసరించి జిల్లా మెజిస్ట్రేట్‌ తజిందర్‌ బగ్గాను అరెస్టుచేసి కోర్టు ముందు హాజరు పరచాలని సైబర్‌ క్రైం పోలీసులను కోరింది. మొహాలీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సున్నీ సింగ్ అహ్లూవాలియా ఫిర్యాదు మేరకు ఆరోపణలు నమోదయ్యాయి.  ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర‌వింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆరోపణలపై తజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గాను శుక్రవారం పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ పోలీసులు ఢిల్లీలో ఆయన నివాసానికెళ్లి అదుపులోకి తీసుకున్నారు.  అయితే బగ్గాను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, కనీసం తలపాగా కూడా కట్టుకోనివ్వలేదని బగ్గా తల్లిదండ్రులు ఆరోపించారు. ఢిల్లీలో త‌న కొడుకును కిడ్నాప్…

Read More

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) రెపోరేటును పెంచడంతో బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లను పెంచడానికి ఒక్కోటిగా వరుస కడుతున్నాయి. తాజాగా హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డిఎఫ్‌సి) గృహ రుణాలపై వడ్డీరేటును పెంచేసింది. రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (ఆర్‌పిఎల్‌ఆర్‌) 30 బేసిక్‌ పాయింట్లు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజాగా రుణాలు తీసుకునేవారు, ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బిఒఐ), సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీరేట్లను పెంచాయి. బుధవారం ఆర్‌బిఐ అనూహ్యంగా రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని విత్త సంస్థలు వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. రుణ గ్రహీతలపై భారం పెంచాలని నిర్ణయించాయి.…

Read More

రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం జరుపుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఐరోపా దేశాలు విధిస్తున్న ఆంక్షలు ఆయన ప్రియురాలికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.  ఆమె ఉనికికే ప్రమాదంగా పరిణమించినట్లు తెలుస్తున్నది.  ఆమెను బహిష్కరించాలంటూ ఇప్పటికే పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఐరోపా యూనియన్  ఆంక్షల జాబితాలో అలీనా కబేవాను చేర్చారని వార్తలు వస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాల కఠిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ, యుద్దాన్ని మరింత తీవ్రం కావిస్తూ ఉండడంతో, పలువురి దృష్టి ఆయన ప్రియురాలిపై పడినట్లు కనిపిస్తున్నది.  పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న జిమ్మాస్ట్ అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. అలీనా కబయేవా, ఆమె నలుగురు పిల్లలు భారీ భద్రత మధ్య, చాలా రహస్యంగా నిర్మించిన షాలేలో (కొండ ప్రాంతాల్లో నిర్మించే చెక్కల కట్టడాలు) ఉంటున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ అలీనా కబయేవాను…

Read More

కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీ చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.  తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్‌పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ జలసౌధలో సమావేశం జరిగింది.  ఛైర్మెన్‌ ఎంపి సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు భేటీలో సభ్యకార్యదర్శి రాయిపురే, సభ్యులు మౌంతాంగ్‌, ఆర్కే పిళ్లై, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఏపీ జలవనరులశాఖ…

Read More

బీజేపీ వారు కేంద్రంలో, ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్క‌డ టీఆర్ ఎస్ పార్టీని న‌డ‌పాల‌ని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోదీ  మూడు న‌ల్ల‌చ‌ట్టాలు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు దానికి మ‌ద్ద‌తుగా టీఆర్ ఎస్‌పార్టీ మ‌ద్ద‌తు తెలిపిందని ఆయన గుర్తు చేశారు.  హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యక్ష యుద్ధం అని ప్రకటించారు.  “బీజేపీకి తెలుసు తెలంగాణ‌లో నేరుగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే శ‌క్తి వారికి లేదు. అలాగే బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్ర‌పంచం ఉన్న వ‌ర‌కు కాంగ్రెస్, బీజేపీతోని పొత్తు, ఒప్పందం ఉండ‌దు. అందుకోస‌మే బీజేపీ వారు ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డొద్ద‌ని టీఆర్ ఎస్‌కు మద్దతు ఇస్తూ,  వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు” అని…

Read More

పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన చివరి మజిలీగా టీం ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిసి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లి, విందు ఆరగించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. గంగూలీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతుందన్న కధనాలు వెలువడుతున్నాయి.  అయితే అటువంటి కథనాలను గంగూలీ కొట్టిపారవేసారు. కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే అని స్పష్టం చేశారు. అమిత్ షా మర్యాదపూర్వకంగా తన ఇంటికి విచ్చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని గంగూలీ వివరించారు. అమిత్ షా కుమారుడు జయ్ షా బీసీసీఐ హానరరీ సెక్రటరీగా కొనసాగుతుండగా, గంగూలీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ సహచరులు కావడంతో గంగూలీ ఇంటికి అమిత్ షా వెళ్లారని చెబుతున్నారు. అమిత్ షాను చూసేందుకు గంగూలీ ఇంటి వెలుపల జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కారు ముందు సీట్లో ఉన్న అమిత్ షా జనాలకు అభివాదం చేస్తూ…

Read More