Author: Editor's Desk, Tattva News

నాలుగైదు రోజులలో ఉక్రెయిన్ లొంగిపోతుందనే అంచనాతో యుద్ధం ప్రారంభించి మూడో నేలలోకి ప్రవేశించినా. కానీ విని ఎరుగని విధ్వంసం సృష్టించినా, వేలాది మందిని మట్టుబెట్టిన లొంగి రాకుండా, ఎదురొడ్డి పోరాడుతూ ఉండడంతో అసహనంతో రష్యా సైనికులు విచ్చలవిడి దాడులకు దిగుతున్నారు. అంతర్జాతీయ నియమనిబంధనలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా నేరుగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియా గుటెరస్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే, ఆయన పర్యటిస్తున్న ప్రాంతానికి సమీపంలో క్షిపణులతో విరుచుకుపడింది. సమీపంలోని ఓ భవనాన్ని రష్యా ప్రయోగించిన క్షిపణులు తాకి విధంసాన్ని సృష్టించాయి. అయితే, ఈ ఉత్పాతంలో గుటెరస్‌ బృందం సురక్షితంగా బయటపడింది. రష్యా యుద్ధోన్మాదంపట్ల యూఎన్‌ చీఫ్‌ దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారంనాడు మాస్కోలో పర్యటించిన గుటెరస్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మరియపోల్‌లోని అతిపెద్ద అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన పౌరులను, క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారం, మంచినీరు అందించేందుకు…

Read More

కరోనా కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి చైనా నుండి తిరిగి వచ్చి, గత రెండేళ్ళుగా తమ చదువు ఆగిపోయినదని ఆందోళన చెందుతున్న భారతీయ విద్యార్థులు తిరిగి వచ్చి, చదువులు తిరిగి కొనసాగించేందుకు చైనాకు రావొచ్చని ఆ దేశ ప్రభుతం ప్రకటించింది. వీసా, ట్రావెల్‌ ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు అనుమతించలేదు. మళ్లీ భారతీయ విద్యార్థులు చైనా వచ్చి చదువులు కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత శాఖ శుక్రవారం ప్రకటించింది. చదువులు కొనసాగించే విషయంలో.. భారత్‌ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ప్రకటించారు. అయితే, చైనాలో వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నామని, ఇతర దేశాల విద్యార్థులకు కూడా వాటిని తెలియజేశామని పేర్కొన్నారు. భారతీయ అధికారులకు కూడా ఇక్కడి నిబంధనలు వివరించగా సానుకూలంగా స్పందించించారని తెలిపారు. అయితే తమ దేశానికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడే విద్యార్థుల జాబితాను భారతీయ అధికారులు ముందుగా అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఉన్న కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విదేశీ విద్యార్థుల రాకపై నిర్ణయాలు తీసుకుంటున్నట్టు జావో తెలిపారు. దీనిపై భారత్‌లోని చైనా ఎంబసీ పని…

Read More

శ్రీలంక ప్రధానమంత్రి పదవినుంచి తన సోదరుడు (అన్నయ్య) మహింద రాజపక్సను తొలగించడానికి అధ్యక్షుడు గొటాబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గొటాబయ రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పరిస్థితుల కారణంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రతిపాదనలో గొటాబయ ఈ మేరకు సమ్మతి తెలిపారు. కొత్త ప్రధానమంత్రి ఎంపిక కోసం నేషనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత తెలిపారని శుక్రవారం అధ్యక్షుడితో సమావేశం అనంతరం మాజీ అధ్యక్షుడు, ఎంపి మైత్రీపాల సిరిసేన తెలిపారు.  సిరిసేన నేతృత్వంలో సుమారు 40 మంది అధికార కూటమి అసమ్మతి ఎంపీలు శుక్రవారం అధ్యక్షుడు గొటాబయ రాజపక్సతో సమావేశమయ్యారు. రాజపక్సకు ముందు సిరిసేన శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నారు.  శుక్రవారం రాజపక్సను కలిసిన 40 మంది కూడా ఈ నెల ప్రారంభం దాకా అధికార కూటమిలో ఉన్న వారే. అయితే…

Read More

పంజాబ్‌లోని పటియాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పటియాలాలో శివ సేన ఖలిస్తాన్‌ వ్యతిరేక మార్చ్‌ నిర్వహిస్తుండగా రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. ఇది ఘర్షణకు దారితీసింది.  శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటియాలా జిల్లాలో 11 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.  అయితే అన్ని అత్యవసర, అవసరమైన సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని కోర్టు తెలిపింది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాటియాలా ఘర్షణలపై తక్షణ విచారణకు ఆదేశించారు.ఈ ఘర్షణకు పాల్పడిన నిందితులలో ఎవరినీ విడిచిపెట్టవద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులను సీఎం మాన్ ఆదేశించారు. ఈ మార్చ్‌ను పంజాబ్‌ శివసేన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హరీష్‌ సింగ్లా నిర్వహించారు. కాళి మాత దేవాలయానికి సమీపానికి ర్యాలీ చేరుకోగానే ‘ఖలిస్తాన్‌ ముర్దాబాద్‌’ అంటూ శివసేన సైనికులు నినాదాలు చేపట్టారు. దీంతో సిక్కు సంఘాలకు చెందిన కత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు.  అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. రాళ్లు రువ్వుకోవడం, కత్తులు…

Read More

తన జీవితపు చివరి సమయాన్ని తాను ఆరోగ్య రంగానికి కేటాయిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలిపారు. మిగిలిన కాలాన్ని తాను ఆరోగ్యానికి అంకితం చేస్తానని, ఈ విధంగా తాను అసోం ఆరోగ్య పరిరక్షణను గుర్తించేలా చేయడం ఇతర ప్రాంతాలు అసోంను ఆరోగ్యపరంగా గుర్తించేలా చేయడం తన లక్షాలని వెల్లడించారు.  గురువారం 84 ఏండ్ల టాటా ప్రధాని మోడీతో కలిసి భారీస్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించి తరువాత మాట్లాడారు. ప్రధానితో కలిసి అసోంలో ఏడు నూతన క్యాన్సర్ సెంటర్లను కూడా రతన్ టాటా ప్రారంభించారు. సాధారణంగా ఇటువంటి ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండే రతన్ టాటా ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు గురించి ప్రస్తావించారు.  అసోం ఇప్పడు ఆరోగ్య విషయాలలో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సలో అగ్రగామి అయ్యే దిశలో ఇది ఓ తొలి అడుగు అవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ, అసోం సిఎం అండదండలు లేకపోతే ఇక్కడ…

Read More

దేశ వ్యాప్తంగా వేసవి నిప్పులు చెరుగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నది. మార్చ్ లో సగటు ఉష్ణోగ్రత ఇటీవల దేశ చరిత్రలోనే అత్యధికం అని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాలలో వచ్చే ఐదు రోజులు వడగాల్పులని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకొంటున్నది. ఇక ఏపీలో సాధారణ ఉష్ణోగ్రతలను దాటి 43, 44 డిగ్రీలను తాకింది. ఈ నెల 26న అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం 27, 28 తేదీల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. గురువారం కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం కాలుగొట్లలో అత్యధికంగా 44, పంచలింగాలలో 43.7 డిగ్రీలు, బనగానపల్లె మండలం నందవరం, ఆళ్లగడ్డలోని అహోబిలంలో 43 డిగ్రీలు నమోదయ్యాయి. కరూులు జిల్లా శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్యనే గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 27న అనకాపల్లి జిల్లా…

Read More

ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ కాకుండా, అడ్డదిడ్డంగా అప్పులు తీసుకు రావడం కోసమే తమను ఉపయోగించుకొంటూ ఉండడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖలో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఇక తాను ఈ ప్రభుత్వంలో పనిచేయలేనని నిర్ణయానికి వచ్చారు. తనను తెలంగాణకు బదిలీ చేయమని విజ్ఞాపన పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఆర్థికశాఖలో ప్రస్తుతం నలుగురు అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేస్తున్నారు. వారందరికీ అధిపతి కావడంతో రావత్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అడ్డదిడ్డంగా జరుగుతున్న ఏపీ ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ గురించి కేంద్రం వరుసగా సంజాయిషీ లేఖలు వారిస్తుంటే, వాటికి సమాధానాలు ఇవ్వలేక, ఇచ్చిన సమాధానాలతో కేంద్రం సంతృప్తికి చెందక ఇరకాటంలో పడుతున్నారు. అదనపు అప్పుకు అనుమతికోసం గత వారం అంతా ఆర్ధిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డితో కలసి ఢిల్లీలో పడిగాపులు కాసిన ఆయనను కేంద్రంలోని ఉన్నతాధికారులు ఆర్ధిక మంత్రిని బయట…

Read More

హిందీ జాతీయ భాష అంటూ, అందరూ హిందీ నేర్చుకోవాలని, ఇంగ్లీష్ కు బదులు హిందీలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వాఖ్యలు దేశంలో పలు ప్రాంతాలలో భాషా వివాదాన్ని తెరపైకి తెస్తున్నది. తాజాగా బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో సహితం ఈ వివాదం చెలరేగింది. బిజేపికి చెందిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు హిందీ జాతీయ భాష కాదని, దేశంలోని ఓ భాష మాత్రమే అని స్పష్టం చేశారు. నటులు అజయ్ దేవగన్, కిచ్ఛా సుదీప్‌ల ట్వీటు సంవాదంలో ఈ రాజకీయ నేతలు కూడా పాలుపంచుకున్నారు. హిందీ ఇతర భాషల లాగా నే దేశంలో ఓ భాష అని, దీనిని జాతీయ భాషగా అంతా అంగీకరించాల్సిన అవసరం లేదని బొమ్మై, కుమారస్వామి, సిద్ధరామయ్యలు స్పష్టం చేశారు. హిందీకి ప్రాధాన్యత ఇచ్చే పట్టుతో ఇతర భాషలను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాలీవుడ్ నటుడు…

Read More

ఈశాన్య ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) నుఈశాన్య ప్రాంతం అంచెలంచెలుగా ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలోని లోరింగ్‌ధెపిలో గురువారం ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ పేరుతో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ గత ఎనిమిదేళ్ల నుంచి శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతున్న కారణంగా ఈ ప్రాంతంలో విధించే చట్టాల తీరులో మార్పు వస్తోందని పేర్కొన్నారు. ఎఎఫ్‌ఎస్‌పిఎను మొదట త్రిపురలోను, తరువాత మేఘాలయలోను రద్దు చేశామని తెలిపారు. ఈ నెల ఒకటిన నాగాలాండ్‌, అస్సాం, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎఎఫ్‌ఎస్‌పిఎను వెనక్కి తీసుకున్నామని వివరించారు. ఈ క్రూరమైన చట్టాన్ని రక్షణ కవచంగా భావించిన భద్రతా దళాలు ఈశాన్య ప్రాంత ప్రజలపై పాల్పడుతున్న అకృత్యాలకు అడ్డు అదుపులేకుండా పోయిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. గత ఏడాది డిసెంబరులో నాగాలాండ్‌లో 14 మంది యువకులైన బగ్గుగని…

Read More

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకుని విషయమై మల్లగుల్లాలు పడి, చివరకు ఆయన పార్టీలో చేరానని చెప్పడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొంటున్న కాంగ్రెస్ అధిష్ఠానంకు రాజస్తాన్‌ రూపంలో మరో తలనొప్పి ఎదురవుతున్నది.  ఏ మాత్రం ఆలస్యం కాకుండా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు రాజస్తాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ పార్టీ  నాయకత్వంకు అల్టిమేటం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఈ మధ్య వరుసగా భేటీలు జరుపుతున్న ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారని చెబుతున్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉన్నందున పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనుకుంటే.. చకాచకా పనులు జరగాలని సచిన్‌ స్పష్టం చేస్తున్నారు. అలా కాకుండా ఆలస్యం చేసి, పంజాబ్ లో వలే ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని మార్చినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అటువంటప్పుడు,  పంజాబ్‌ గతే రాజస్తాన్‌కు పట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు.  కాగా,…

Read More