ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తు అయిన యువతరం కష్టపడి పని చేయడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్యకాలంలో యువతరం జీవన విధానం తనను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్న ఆయన, క్రమశిక్షణా యుతమైన జీవన విధానాన్ని యువత అలవాటు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం… తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. అహారపు అలవాట్లు…
Author: Editor's Desk, Tattva News
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉండడంతో సామాన్య ప్రజలలో పెరుగుతున్న అసహనాన్ని గమనించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ అపవాదును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కరోనా తీవ్రతపై సమీక్ష జరిపేందుకు ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రయత్నం చేశారు. కేంద్రం రెండు సార్లు సుంకాలు తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వ్హాలను వ్యాట్ తగ్గించమని కోరినా పలు రాష్ట్రాలు (బిజెపియేతర) తగ్గించలేదని విచారం వ్యక్తం చేశారు. వారిని వ్యాట్ తగ్గించి, ధరలు తగ్గించమని అభ్యర్థించడం ద్వారా ఈ విషయంలో కేంద్రం చేయగలిగింది ఏమీ లేదనే సంకేతం ఇచ్చారు. ఆ వెంటనే కేంద్రం నిరంతరం వీటి ధరలను పెంచడం ద్వారా రూ.26 లక్షల కోట్లు ఆర్జించినా రాష్ట్రాలకు తగు వాటా ఇవ్వడం లేదని, పైగా కనీసం జిఎస్‌టి పరిహారం బకాయిలు కూడా చెల్లించడం లేదని పలువురు ముఖ్యమంత్రులు మండిపడ్డారు. ఈ బకాయిలు చెల్లిస్తే తాము కొంత మేరకు ధరలు తగ్గిస్తామంటూ చెప్పుకొచ్చారు. బీజీపీయేతర ముఖ్యమంత్రుల విమర్శలకు బలం చేకూర్చేవిధంగా…
తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్రం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా కానీ, ప్రధాన మంత్రిగా కానీ అణగారిన వర్గాలవారి సంక్షేమం కోసం కృషి చేస్తానని, కానీ రాష్ట్రపతి కాబోనని ఆమె స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బీఎస్పీ ఓట్లను బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా మాయావతి రాష్ట్రపతి అవుతారేమో అంటూ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనను రాష్ట్రపతిని చేయాలని సమాజ్‌వాదీ పార్టీ కలలు కంటోందని, అందుకు కారణం ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవడానికి మార్గం సుగమమవుతుందని భావించడమేనని ఆమె ఎద్దేవా చేశారు. అయితే, ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి కానీ, తనను రాష్ట్రపతిని చేయడం గురించి కానీ కలలు…
కర్ణాటకలో మండ్య నియోజకవర్గానికి స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్న ప్రముఖ సినీ నటి సుమలతా అంబరీష్ (58) బీజేపీలో చేరేందుకు సుముఖత ఆసక్తి వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కుమార్‌పై 1.25 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఆమె సంచలన విజయం సాధించారు. ఆ సమయంలో ఆమెపై బిజెపి అభ్యర్థిని పోటీకి దింపకుండా, ఆమెకు మద్దతు ఇచ్చింది. ఎన్నికల అనంతరమే ఆమె బీజేపీలో చేరనున్నారని, ఆమెను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోనున్నారని వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. సుమలత భర్త అంబరీష్ ప్రసిద్ధ కన్నడ నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను మంత్రిగా వ్యవహరించారు. మండ్య జిల్లా నుంచి అంబరీష్ సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో భద్రతా లోపం వైఫల్యం మరోసారి స్పష్టమైంది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ రాక సందర్భంగా అభిమానులు అంతరాలయంలోకి దూసుకెళ్లారు. శ్రీ అమ్మవారి ఆలయంలో జై భవానీ నినాదాలకు బదులుగా..జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేశారు. మరో రెన్డు రోజులలో తండ్రి చిరంజీవితో కలసి నటించిన ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా రామ్‌చరణ్ బుధవారం ఉదయం 11.15గంటలకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. భారీసంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు రామ్‌చరణ్ కొండపైకి చేరుకోగానే హద్దులు దాటి ప్రవర్తించారు. అమ్మవారి ఆలయంలో ‘జై చరణ్.. జైజై చరణ్’ అంటూ నినాదాలు చేస్తూ వీరంగం చేశారు. రామ్‌చరణ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో భ్రమరాంబను సైతం పక్కకు తోసేశారు. కొందరు అభిమానులు చెప్పులు, బూట్లతో సహా ముఖమండపంలోకి వచ్చేశారు. రామ్‌చరణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన సమయంలో అభిమానులు పోటీలు పడుతూ హుండీలపైకి ఎక్కి మరీ మూలవిరాట్‌ను…
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి సమీక్షించడం కోసం బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చివరిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తావిస్తూ బిజెపియేతర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని కోరడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరంతరం వీటి ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.26 లక్షల కోట్లు ఆర్జించిందని చెప్తూ, కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని మరింత తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు బుధవారం ముంబైలో లీటర్ డీజిల్ ధరలో కేంద్రానికి రూ.24.38, రాష్ట్రానికి రూ.22.37. పెట్రోల్ ధరలో 31.58 పైసలు కేంద్ర పన్ను, 32.55 పైసలు రాష్ట్ర పన్నుగా వెళ్తున్నట్టు థాకరే తెలిపారు. అందువల్ల రాష్ట్రం కారణంగా పెట్రోల్, డీజిల్ ధర పెరగడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా 15 శాతం…
బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయంకు రంగం సిద్ధమైంది. ఈ పబ్లిక్ ఆఫర్ మే 4న మొదలై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇష్యూ ప్రైస్‌ను రూ. 902–-949 మధ్య నిర్ణయించారు. ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు రిటైల్ పెట్టుబడిదారులకు, పాలసీదారులకు రాయితీలను ప్రకటించారు. ఆఫర్ద్వారా రూ.21 వేల కోట్ల విలువైన 22 వేల కోట్ల షేర్లను అమ్ముతుంది. కాబట్టి మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతి పెద్దది అవుతుంది. మొదట 5 శాతం షేర్లను అమ్మాలని అనుకున్నా ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు దృష్ట్యా వాయిదా వేయడంతో పాటు, అమ్మాలనుకున్న మొత్తాన్ని కూడా తగ్గించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్‌ఐసీ…
గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారం నాడు జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన జరిగింది. అయితే, ఈ అంశాలు బోర్డు పరిధిలో లేవని చైర్మన్ తేల్చి చెప్పారు. మరోవంక వివాదాస్పద అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎవ్వరి వాదనలు వారు వినిపించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. పెండింగ్ ప్రాజెక్ట్ లకు తాము డిపిఆర్ సమర్పించామని, వీటిపై ఏపీ అభ్యంతరాలను చైర్మన్ తిరస్కరించారని తెలంగాణ ప్రతినిధి చెప్పగా, అసలు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్ట్ లకు డిపిఆర్ లు ఏమిటని ఏపీ ప్రశ్నించింది. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నదీజలాలను ఇతర…
దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మఅతి (ఐపిసి)లోని సెక్షన్ 124 ఎ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 30లోగా తన స్పందనను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతఅత్వంలోని ధర్మాసనం కేసును మే 5న తుది విచారణకు జాబితా చేయాలని నిర్ణయించింది. ఎటువంటి వాయిదా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ”ఈ వారం చివరిలోగా స్పందన దాఖలు చేయాలని మేము కేంద్రాన్ని ఆదేశిస్తున్నాము. మంగళవారంలోగా దాఖలు చేయాల్సిన అఫిడవిట్‌కు స్పందన ఇవ్వండి. మే 5న ఎలాంటి వాయిదా లేకుండా తుది పరిష్కారానకి సంబంధించిన అంశాన్ని జాబితా చేయండి” అని సుప్రీం కోర్టు ఆమోదించిన ఉత్తర్వులో పేర్కొంది. ఐపిసిలోని సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ, దాన్ని రద్దు చేయాలని కోరుతూ రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్‌జి వోంబట్‌కేరే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్…
నెలనెలా జీతాలకే పైసల్లేవ్… బంగారు తెలంగాణ ఎట్లైతదని సీఎం కేసీఆర్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి నేత డీకే అరుణ ప్రశ్నించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఆమె స్పందిస్తూ నోరు తెరిస్తే కేసీఆర్ బంగారు తెలంగాణ అంటుంటారని, అయితే బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే కానీ ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్… ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలుజేశారని ఆమె దుయ్యబట్టారు. దేశం మొత్తం దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ అడుగుతున్నారన్న ఆమె మొదట రాష్ట్రంలో దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని కేసీఆర్ మహిళల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఆమె చెప్పారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్న కేసీఆర్ మొదట ఆయన కేబినెట్లో 33 శాతం మహిళలకు…