Author: Editor's Desk, Tattva News

భారత్‌లో ప్రజాస్వామ్యం నానాటికీ బలహీనపడుతోందని..నిరంకుశత్వం దిశగా వెళ్తోందని తాజా నివేదిక హెచ్చరించింది. నిరంకుశత్వం దిశగా వెళ్తున్న ఎల్‌ సాల్విడార్‌, టర్కీ, హంగేరీ..మొదలైన టాప్‌-10 దేశాల్లో భారత్‌ ఉండటం ఆందోళన కలిగించే అంశమని స్వీడన్‌కు చెందిన ‘వి-డెమ్‌’ (వెరైటీస్‌ ఆఫ్‌ డెమొక్రసీ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌) నివేదిక వెల్లడించింది.  స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం..రెండు విభాగాల్లో 179 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, ఇందులో భారత్‌కు వరుసగా..93వ ర్యాంక్‌, 100వ స్థానం దక్కింది. ”డెమొక్రసీ రిపోర్ట్‌ 2022 : ఆటోక్రటైజేషన్‌ ఛేంజింగ్‌ నేచర్‌?” అనే పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత రెండు సంవత్సరాలతో పోల్చితే భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. దిగువన ఉండే 40నుంచి 50శాతం దేశాల జాబితాలో చేరుతోంది. పౌర హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం, మైనార్టీ హక్కుల విషయంలో అత్యంత ప్రమాదకరమైన పోకడలు తలెత్తుతున్నాయి. పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారు.  ప్రతిపక్షాల్ని బలహీనం చేయడానికి…

Read More

ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ … యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను, సర్వీసులను రష్యాలో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ చర్యకు దీటుగా రష్యా తాజాగా ఓ కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టింది.  తమ దేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌ ‘అయ్య టీ 1 (AYYA T 1) ‘ ను తీసుకొస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లను స్కేల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనుబంధ సంస్థ స్మార్ట్‌ ఇకో సిస్టమ్‌ కంపెనీ అభివఅద్ధి చేస్తోందని తెలిపింది. ఐఫోన్లకు బదులు ‘అయ్య టీ1’ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరింది. రష్యన్‌ స్టేట్‌ డూమా సభ్యులు మరియా బుటినా, డెనిస్‌ మైదానోవ్‌ లు మాట్లాడుతూ ఈ అయ్య టీ వన్‌ ఫోన్‌ అత్యంత నమ్మదగిన ఫోన్‌ అని తమ దేశ పౌరులకు సూచించారు. ‘అయ్య…

Read More

ఉత్తరప్రదేశ్‌ మణిపూర్ లలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని, పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తుందని, ఉత్తరాఖండ్ లో పోటీ కీలకంగా ఉన్నదని హైదరాబాద్ కు చెందిన  పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది.  యుపిలో బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్‌ పోల్‌ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్‌ పార్టీ 4 నుంచి 8 స్థానాలకు పరిమితం కానుంది.  పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది.ఆమ్‌ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్‌ 23 నుంచి…

Read More

ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభాన్ని ముగించడం కోసం, రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగోవడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. నేడు ఆయనకు ఫోన్ చేసి 50 నిముషాల సేపు ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న కల్లోల పరిస్థితుల గురించి మాట్లాడారు.  ఉక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి  వివరించారు. గత నెల 25న ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత పుతిన్ తో మోదీ మాట్లాడటం ఇది మూడవసారి. ఇంకా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఆ దేశం విడిచి రావడానికి అవకాశం కల్పించామని కూడా ఈ సందర్భంగా ప్రధాని పుతిన్ ను కోరారు.  మరో వంక, ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్స్కీతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ  ఫోన్ లో…

Read More

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజుననే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేయడం, అందుకు  నిరసన వ్యక్తం చేస్తుండగా  పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.  ముఖ్యంగా టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెన్నంటి ఉంటూ, ఆ పార్టీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి, ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీకి మొదటిసారిగా వచ్చిన కొద్దీ నిముషాలకే సస్పెండ్ కావడం గమనార్హం.  గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ను సమర్పిస్తూ సమావేశాలు జరగడానికి వీల్లేదని అంటూ వారు ముగ్గురు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తుండగా, వారిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించడం, ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలపడం జరిగిపోయింది.  మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెన్షన్…

Read More

తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రూ.2.56 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైందని హరీశ్‌ రావు తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. సిఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళుతున్నారని, రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర అని అభివర్ణించారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందని, అవినీతి రహితంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వడం లేదని, రాష్ట్రం పట్ల వివక్షత చూపుతున్నదని హరీష్‌ ఆరోపించారు. సవాళ్ళు క్లిష్టమయిన పరిస్థితులను అధిగమిస్తున్నామని పేర్కొంటూ విద్యుత్ కోతల నుంచి విముక్తి కల్పించిన…

Read More

ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీపై ఒక వంక అంతర్జాతీయంగా, స్వదేశంలోని కూడా వత్తిడి పెరుగుతున్నది. ముఖ్యంగా  అమెరికా నుంచి  ఈ విషయమై ఒత్తిడి పెరుగుతున్నట్లు దౌత్యరంగ నిపుణులు తెలిపారు.  రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. రెండు సందర్భాలలో భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది.   ఆ తర్వాత ఐరాస మానవ హక్కుల సంస్థ నిర్వహించిన సమావేశానికి కూడా భారత్‌ గైర్హాజరైంది. భారత్ తో పాటి చైనా, పాకిస్థాన్ కూడా ఓటింగ్ కు దూరంగా ఉండడం గమనార్హం.  ఈ నేపథ్యంలో నిర్ధిష్టమైన వైఖరి తీసుకోవాలని, రష్యా దాడిని ఖండించాలంటూ భారత్‌పై వాషింగ్టన్‌ ఒత్తిడి పెంచుతోందని అమెరికా సీనియర్‌ దౌత్యవేత్త డొనాల్డ్‌ లూ తెలిపారు. ఐరోపా దేశాల నుండి కూడా ఈ విషయమై భారత్ పై వత్తిడులు ఎదురవుతున్నాయి. భారత్, చైనా ఒక వైఖరి తీసుకోవాలని బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్…

Read More

* రెండు రాష్ట్రాల బిజెపి కమిటీలలో ప్రక్షాళన  * మార్చ్ 15 తర్వాత తెలుగు రాష్ట్రాలపై దృష్టి  * పెద్ద రాష్ట్రాల్లో కోల్పోయే సీట్ల భర్తీకి వ్యూహం బిజెపి అగ్ర నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు చెందిన బిజెపి లోని వివిధ  వర్గాల వారితో ఆయన సవివరంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత, మార్చ్ 15 అనంతరం ఈ విషయాలపై లోతుగా మాట్లాడదామని వారికి చెప్పిన్నట్లు తెలిసింది.  ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ధోరణి చూస్తే ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ బిజెపి పెద్ద సంఖ్యలో లోక్ సభ సీట్లను కోల్పోయే అవకాశాలున్నట్లు సంకేతం వస్తున్నది. అటువంటి పరిష్టితులే బిజెపికి అత్యధిక ఎంపీ సీట్లున్న మధ్య ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక  వంటి రాష్ట్రాలలో కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.  2014లో తిరిగి 300 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరోసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. పైగా, మొదటిగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ వ్యవహారంపై తీవ్ర అసంతృత్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయమై తానే స్వయంగా మాట్లాడతానని కూడా ఆదివారం సాయంత్రం బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం కోసం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చెప్పిన్నట్లు తెలుస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌‌ఎస్‌‌ తడాఖా ఏందో చూపిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. కేంద్రంతో కొట్లాడుడేనని తేల్చిచెప్పారు. కూటమి ప్రయత్నాలకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి మస్తు స్పందన వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌‌ కేంద్రంగా త్వరలోనే దేశంలోని అన్ని రైతుసంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రినే చంపాలని చూస్తే ఊరుకుంటమా అని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలను కేంద్రం అమలు చేయలేదని, వాళ్లతో ఎంత సఖ్యతగా ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై సానుకూలంగా స్పందించనే…

Read More

నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.  సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ.. మిగిలిన వార్తలను యథావిధిగా అందించాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలన్న ఆయన… వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు.  హైదరాబాద్ లో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ  ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలంటే వాటిని ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని తెలిపారు. అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని స్పష్టం చేసారు. ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు.  మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని పాత్రికేయ…

Read More