న్యాయస్థానం నుండి విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల చట్టాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు ధర్మాసనం ముందు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో న్యాయస్థానం విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోందని న్యాయవాది చేసిన వాదనలపై ఎజి శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. నిన్నటి విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదనల కోసం విచారణను ఫిబ్రవరి 2 కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దును సదుద్దేశంతో చేయలేదని, బహుళ రాజధానుల చట్టాన్ని మళ్లీ తీసుకొస్తామని బహిరంగంగానే చెబుతోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని బృహత్ ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు. తాము…
Author: Editor's Desk, Tattva News
అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల విభజన కసరత్తు జరిగిందని ప్రణాళిక శాఖ చెబుతున్నా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా, కేవలం ఒక రోజు వ్యవధిలో జిల్లాల విభజన పూర్తి కావించి, రాత్రికి రాత్రి జీవో విడుదల చేయడం, అందులో వందకు పైగా దోషాలు ఉన్నట్లు కనుక్కొని మరుసటి రోజు మరో రెండు జీవోలు వసూలు చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ మొత్తం కసరత్తు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన మరుసటి రోజునే జరగడం గమనిస్తే, వారు ప్రభుత్వం ముందుంచిన సమస్యలను పరిష్కరింపలేక, వారి నిరసనల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ కసరత్తు అంతా హడావుడిగా చేశారని భావింపవలసి వస్తున్నది. ఈ సందర్భంగా పదే, పదే మార్పులు చేయడం గమనిస్తే లోతయిన అధ్యయనం, ఆలోచనలు లేకుండానే చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. కొత్త జిల్లాలపై రెవెన్యూ శాఖ అందించిన నివేదిక వేరు. 25వ తేదీ రాత్రి పొద్దు పోయాక…
భారతదేశంలోని ప్రస్తుత మానవ హక్కుల పరిస్థితిపై మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మరో నలుగురు అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని అంటూ తీవ్రంగా తిప్పికోట్టింది. పైగా, ఈవెంట్ నిర్వాహకుల ట్రాక్ రికార్డ్ “పాల్గొనేవారి పక్షపాతాలు, రాజకీయ ప్రయోజనాలకు” ప్రసిద్ధి చెందిందని కొట్టిపారవేసింది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన వర్చువల్ ప్యానెల్ చర్చలో అన్సారీ, నలుగురు అమెరికా చట్టసభ సభ్యులు ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “మేము ఈ సమస్యపై నివేదికలను చూశాము. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యం. దీనికి ఇతరుల నుండి ధృవీకరణ అవసరం లేదు. మన రాజ్యాంగాన్ని ఇతరులు రక్షించాల్సిన అవసరం ఉందనే వాదన అహంకారం, అసభ్యకరమైనది. ఈవెంట్ ఆర్గనైజర్ల ట్రాక్ రికార్డ్ కూడా పాల్గొనేవారి పక్షపాతాలు,…
రక్షణ రంగంలో ఆయుధాలను ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ మన దేశం ఇప్పుడు అత్యంత నాణ్యతతో స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకుంటోంది. అంతేకాదు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇప్పడు ఆ దిశగా అడుగులు పడ్డాయి. భారత్, ఫిలిప్పీన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నౌకాదళానికి భారత్ తాము రూపొందించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 374 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.2,800 కోట్లకుపైమాటే. ఈ క్షిపణులను మన దేశం తొలిసారిగా ఒక దేశానికి ఎగుమతి చేస్తుండడం గమనార్హం. ‘ఫిలిప్పీన్స్‌కు యాంటీ షిప్ మిసైల్స్‌ను సరఫరా చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్( బిఎపిఎల్) జనవరి 28న( శుక్రవారం) రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక…
దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ నిలిచింది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లు. ప్రాంతీయ పార్టీలలో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో (26.46 శాతం) ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో…
ఒక వంక కరోనా మహమ్మారి నుండి కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ఒకటి రెండు నెలల్లో ఈ మహమ్మారి అంతం కాగలదని ఎదురు చూస్తున్న వేళ అంతకన్నా ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించడం వణుకు పుట్టిస్తున్నది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘ నియోకోవ్’ (neo cov)అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా విస్తరించే లక్షణంతో పాటుగా మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశముందని శాత్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తల నుండే ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఉండే గబ్బిలాల్లో ఈ నియోకోవ్’ వైరస్ బయటపడింది. ఇది కూడా కరోనా వైరసేనని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఇది జంతువులనుంచి…
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేయడం చరిత్రాత్మకం అంటూ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం రాజ్యాంగవ్యతిరేకమని, అది చెల్లదని సుప్రీంకోర్ట్ తీర్పు ఇవ్వడం పట్ల బిజెపి నేతలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలని కోర్టు ఇచ్చిన తీర్పు సత్య విజయం అని పేర్కొంటూ మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తన గళాన్ని పెంచుతూనే ఉంటుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. గత ఏడాది జులైలో మిగిలిన…
భారత్ తో పాటు మధ్య ఆసియా దేశాలకు ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న సాధారణ అంశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఐదు మధ్య ఆసియా దేశాల అధినేతలతో జరిపిన శిఖరాగ్ర సదస్సులో “ప్రాంతీయ భద్రత,స్థిరత్వానికి పరస్పర సహకారం మరింత ముఖ్యమైనది” అని పేర్కొన్నారు. చైనా మధ్య ఆసియా దేశాలతో వర్చువల్ సమ్మిట్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత, ప్రధాని జరిపిన ఈ సమావేశంలో “వచ్చే 30 సంవత్సరాలలో ప్రాంతీయ అనుసంధానం, సహకారం కోసం ఒక సమగ్ర విధానం” ఏర్పర్చుకోవాల్నయి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ దృష్టిలో మధ్య ఆసియా ప్రధానమని ఆయన పేర్కొన్నారు. సమీకృత, స్థిరమైన పొరుగు ప్రాంతం. వర్చువల్ ఫార్మాట్‌లో ప్రధాని ఆతిధ్యంలో జరిగిన మొదటి భారత్ -మధ్య ఆసియా సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం, మధ్య ఆసియా మధ్య సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన దృక్పథాన్ని నిర్వచించాలని సూచించారు. సమగ్రమైన, స్థిరమైన పొరుగు ప్రాంతం…
నిజామాబార్ బీజేపీ ఎంపీ డి అరవింద్ పై గత మంగళవారం ఆర్మూర్ లో అధికార పక్షానికి చెందిన వారు జరిపిన దాడిపై బిజెపి అధిష్ఠానం తీవ్రంగా స్పందిస్తున్నది. ఇంతకు ముందు కరీంనగర్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు జరిపిన దౌర్జన్యంపై తీవ్రంగా స్పందించడం, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఆ అంశాన్ని వెంటనే చేపట్టడం తెలిసిందే. అదే విధంగా, ఇప్పుడు నేరుగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ అరవింద్ కు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. మరోవంక, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఫోన్ చేసి ఏమి జరిగిందే తెలుసుకున్నారు. వెంటనే లోక్ సభ స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేయమని సూచించారు. నడ్డా కూడా స్పీకర్ ఓం బిర్లాకు ఫోన్ చేసి జరిగిన సంఘటనను వివరించినట్లు తెలుస్తున్నది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గురువారం గవర్నర్ తమిళిసై ఫోన్ చేసి…
తన ట్విట్టర్ ఖాతాదారులు తగ్గిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత నెలలో రాసిన లేఖకు సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఘాటుగా స్పందించింది. ఆ సంఖ్య అర్ధవంతమైనవి, ఖచ్చితమైనవని స్పష్టం చేసింది. మానిప్యులేషన్, స్పామ్‌లను ఏ మాత్రం సహించబోదని ట్విట్టర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తాము స్పామ్, హానికరమైన ఆటోమేషన్‌తో వ్యూహాత్మకంగా, లెర్నింగ్ టూల్స్‌తో పోరాడతామని, ఆరోగ్యకరమైన, విశ్వసనీయ ఖాతాలను నిర్ధారించడానికి తాము చేపడుతున్న చర్యల కారణంగా ఫాలోవర్ల సంఖ్య హెచ్చు తగ్గులుగా ఉండవచ్చునని తెలిపారు. భారత్‌లో స్వేచ్ఛ, న్యాయమైన భావ ప్రకటనను అరికట్టడంతో ట్విట్టర్ బహుశా తెలియకుండానే భాగస్వామ్యమైందని చెప్పారు. గత నెల 27న సంస్థ సిఇఒ పరాగ్ అగర్వాల్‌కు రాహుల్ వ్రాసిన లేఖలో ఆగస్టు 2021లో తన ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ అయిన తర్వాత.. తన ఫాలోవర్ల సంఖ్య పెరగలేదని ఫిర్యాదు చేశారు. భారత్ ఆలోచనల్ని నాశనం చేయడంలో పావుగా మారకూడదంటూ మండిపడ్డారు. భారత దేశంలో…